నేటితో ముగియనున్న నుమాయిష్ ఎక్సిబిషన్ | Last Day Of Hyderabad's Numaish (Nampally Exhibition) | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న నుమాయిష్ ఎక్సిబిషన్

Feb 18 2024 9:12 AM | Updated on Feb 18 2024 1:59 PM

End Of Numaish Exhibition Hyderabad - Sakshi

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్‌ హోల్డర్స్‌ విజ్ఞప్తి మేరకు నుమాయిష్‌ను మూడు రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీంతో 18వ తేదీన నుమాయిష్‌ ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement