
హాస్య కదంబాల నుంచి మూకాభినయం వరకు
వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక
నాంపల్లి గ్రౌండ్స్‌లో కల్చరల్ ఈవెంట్ల సందడి
నగరంలో 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జోరుగా సాగుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఈవెంట్ ఫిబ్రవరి 18 వరకూ కొనసాగనుంది. ఎప్పటి నుంచో షాప్ హాలిక్స్‌కు ఫేవరెట్ స్పాట్‌గా ఉన్న ఈ వస్తూత్పత్తుల ఉత్సవం.. గత కొంత కాలంగా సాంస్కృతిక కార్యకలాపాల వేదికగానూ వరి్ధల్లుతోంది. కళలను అభిమానించేవారికి చిరునామాగా మారుతోంది.
నుమాయిష్‌కి వెళ్లొచ్చాను అనగానే.. ఏం కొన్నావ్? ఏం తిన్నావ్? అనే ప్రశ్నలే ఎదురవుతాయి తప్ప ఎవరి పాటలు ఎంజాయ్ చేశావ్! ఎవరి నృత్యాభినయాన్ని ఆస్వాదించావ్? అనే ప్రశ్నలు అరుదే. ప్రధానంగా షాపింగ్ ప్రియుల కోసం ఏర్పాటైన ప్రదర్శన కావడం వల్ల నుమాయి‹Ùని ఒక కల్చరల్ ఈవెంట్స్‌కి కేరాఫ్‌గా పరిగణనలోకి తీసుకోరు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. మంచి సంగీతాన్ని, నృత్యాన్ని, హాస్య కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అవకాశం ఉంటుందనే ఆలోచన నగరవాసుల్లో వస్తోంది.
రోజుకు 6 గంటలపైనే..
నుమాయిష్ షాపింగ్ ప్రధాన ఆకర్షణ అయితే, దానితో పాటే అంతకు మించిన అనుభవాన్ని, వినోదాత్మక కార్యక్రమాలను కూడా అందిస్తోంది. రోజూ సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వీటిని నిర్వహిస్తున్నారు. దీని కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా పండల్, లాన్స్‌లో 2 వేదికలు ఏర్పాటు చేశారు. నుమాయి‹Ùని సందర్శించాలని ప్లాన్ చేసే కళాభిమానులు తమకు నచ్చిన ఈవెంట్ ఉన్న రోజును ఎంచుకోవడానికి వీలుగా షాపింగ్‌తో పాటే పలు రకాల అద్భుతమైన ఈవెంట్‌ల జాబితా కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉంచారు. మంత్రముగ్ధులను చేసే నృత్య ప్రదర్శనల నుంచి మనోహరమైన ముషైరా సెషన్స్ వరకు, ప్రతి ఒక్కరికీ నచ్చేలా వైవిధ్యభరిత ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చారు.
కూచిపూడితో కూడి..
సంప్రదాయ సౌరభాలను ఆస్వాదించేవారికి నుమాయిష్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు. కూచిపూడి వంటి సంప్రదాయక నృత్యకళలకు ఇక్కడ ఎక్కువగా పట్టం గడుతున్నారు. అలాగే గజల్స్, సూఫీ సంగీతం వంటివి ప్రముఖ కళాకారులు అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు నుమాయిష్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆయా ఈవెంట్లకు సంబంధించిన తేదీలు, వేదికలు, కళాకారుల వివరాలతో కూడిన ఈవెంట్‌ల జాబితాను పరిశీలించుకోవచ్చు.
ప్రముఖ స్టార్స్ ఈవెంట్స్..
గత సంవత్సరం, బాలీవుడ్ స్టార్ సింగర్ జావేద్ అలీ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం చాలా మంది నగరవాసులకు మధురమైన జ్ఞాపకం. ఈ ఏడాది ఇప్పటి వరకూ అలాంటి సంచలనాత్మక ప్రకటన ఏమీ రానప్పటికీ.. రానున్న రోజుల్లో ఉండొచ్చని నిర్వాహకులు, సందర్శకులు అంటున్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాలు ఓ వైపు సందర్శకులను సేదతీరుస్తూనే, మరోవైపు స్థానిక ఔత్సాహిక కళాకారులకు అనువైన వేదికలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయని చెప్పాలి.
నేడు, రేపు..ఇలా..
ఈ వారాంతం వరకూ ఒకసారి పరిశీలిస్తే.. నేడు (మంగళవారం) కూచిపూడి నృత్యం (ఎం.భిక్షపతి) కామెడీ కార్యక్రమం (షాబుద్దీన్), బుధవారం సినిమా పాటలు (జాఫర్ ఉజ్ జమా), కూచిపూడి నృత్యం (రాజ్‌కుమార్), లయన్స్ క్లబ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ అలాగే గురువారం భువనవిజయం ప్రదర్శన, శుక్రవారం విశ్వప్రభ కూచిపూడి నృత్యం, శ్రీకృష్ణ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, గజల్ గీతాలు (అడ్నాన్ సలీమ్)జిందా దిలాన్‌ఏ హైదరాబాద్ (ముషాయిరీ).. ఇలా పలు వైవిధ్యభరితంగా సందర్శకులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment