అబిడ్స్: ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పోటెత్తారు. బుధవారం నుమాయిష్ కు దాదాపు 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి బుధవారం వరకు సుమారు 5 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులందరినీ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment