
సాక్షి, హైదరాబాద్: నుమాయిష్ అగ్ని ప్రమాదంపై ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. బాధితులు సమస్యలు చెప్పుకుందామంటే రాష్ట్రంలో మంత్రులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. వ్యాపారస్తులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సంఘటన స్థలాన్ని సీపీఐ కార్యవర్గ సభ్యులు సుధాకర్, నగర కార్యదర్శి ఈటీ నరసింహ, ఏఐటీయూసీ నాయకులు వెంకట్, గెల్వయ్య, మన్నన్ తదితరులు సందర్శించారు.