
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సమీప ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియాలో శనివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగసి పడడంతో.. ఐదు కార్లు దగ్ధం అయ్యాయి.
పార్కింగ్‌లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. అయితే.. మంటలు పూర్తిగా అదుపు అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు వీకెండ్ కావడంతో నుమాయిష్‌కు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనపై అబిడ్స్ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment