
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వదంటూ, ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలంటూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టిన అనంతరం ఎగ్జిబిషన్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ప్రజల భద్రతపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. జనవరి 6 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. ఇక రేపటి నుంచి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఘపంగా ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment