హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేశారు. జనవరి26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఓ సాంగ్ షూటింగ్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పెళ్లి తర్వాత ఈమధ్యే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన స్వాతి ఇటీవలె పంచతంత్రం సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి1న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15వరకు జరగనుంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌గా పేరొందిన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment