సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల తీరుపై రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో గరికపాటి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, గరికపాటి కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యునిగానే ఉన్నారు.
అయితే నేడు నడ్డా సమక్షంలో గరికపాటి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరే సమయంలో గరికపాటి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఆరోపించారు. తాను పదవుల కోసం బీజేపీలో చేరలేదని చెప్పారు. తన వెంట బీజేపీలో వచ్చిన టీడీపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు. గ్రేటర్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు టీడీపీ నాయకులు బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment