Garikapati Mohan Rao
-
తెలంగాణకు పెద్దపీట
సాక్షి , హైదరాబాద్/ న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణకు పార్టీ నాయకత్వం పెద్ద పీట వేసింది. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులకు అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావులకు జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. ఈటల రాజేందర్, విజయశాంతిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీ నారాయణకు చోటు కల్పించారు. కొత్త మంత్రులకు చోటు రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా నియమించిన కమిటీలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింథియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. మేనక, వరుణ్‌లకు దక్కని స్థానం లఖీమ్‌పూర్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్‌లతో పాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీలను కమిటీ నుంచి తప్పించారు. కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. -
ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కా లని పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీడీపీ నేతలు ఉప్పెనలా బీజేపీలోకి తరలిరావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బాబు బాగుండాలి: గరికపాటి ఎన్టీఆర్ చూపిన అభిమానంతో టీడీపీలో చేరానని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నానని ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. మనసు రాయి చేసుకొని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలు వీరే... గరికపాటి మోహన్‌రావు–రాజ్యసభ సభ్యుడు, శోభారాణి–తెలుగు మహిళ అధ్యక్షురాలు, దీపక్‌రెడ్డి–టీడీపీ జనరల్ సెక్రటరీ, ఈగ మల్లేశం–వరంగల్ రూరల్ అధ్యక్షుడు, రజనీకుమారి–తుంగతుర్తి ఇన్చార్జి, పోరిక జగన్ నాయక్–మాజీ మంత్రి, ఎర్ర శేఖర్–మాజీ ఎమ్మెల్యే, మొవ్వ సత్యనారాయణ–శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి, ముజఫర్–మలక్‌పేట్ టీడీపీ ఇన్చార్జి, సామ రంగారెడ్డి–రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కోనేరు చిన్ని–కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్–పఠాన్ చెరు ఇన్చార్జి, బోట్ల శ్రీనివాస్–జనగామ జిల్లా అధ్యక్షుడు, రాజ్యవర్ధన్రెడ్డి–కాంగ్రెస్ నేత, శ్రీనివాస్‌గౌడ్–నల్లగొండ ఇన్చార్జ్, అంజయ్య యాదవ్–నాగార్జున సాగర్ అసెంబ్లీ ఇన్చార్జి, సాధినేని శ్రీనివాస్–మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్చార్జి, శ్రీకళారెడ్డి–కోదాడ నేత, ఓం ప్రకాశ్ మాజీ తెలుగు విద్యార్థి నేత, బాబురావునాయక్–టీడీపీ ఎస్టీ సెల్, విజయ్‌పాల్‌రెడ్డి–మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్, ఉపేందర్–కాంగ్రెస్ నేత, సత్యం–మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు, రఘునాథ్‌రెడ్డి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రామ్‌రెడ్డి–సూర్యాపేట ఇన్చార్జి, జయశ్రీ–టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల తీరుపై రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో గరికపాటి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, గరికపాటి కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యునిగానే ఉన్నారు. అయితే నేడు నడ్డా సమక్షంలో గరికపాటి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరే సమయంలో గరికపాటి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఆరోపించారు. తాను పదవుల కోసం బీజేపీలో చేరలేదని చెప్పారు. తన వెంట బీజేపీలో వచ్చిన టీడీపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు. గ్రేటర్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు టీడీపీ నాయకులు బీజేపీలో చేరారు. -
నేడు బీజేపీలోకి భారీగా చేరికలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో పెద్దఎత్తున టీటీడీపీ శ్రేణులు చేరడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో 18 జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, క్షేత్రస్థాయినేతలు, కార్య కర్తలు మొత్తం 20 వేలమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చేరికల ద్వారా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. మాజీమంత్రి పి.జగన్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, ఊకె అబ్బయ్య, టీడీపీ నేతలు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, ఎంఎన్ శ్రీనివాస్, బి.శోభారాణి, లంకల దీపక్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాదినేని శ్రీనివాస్, పాల్వాయి రజనీకుమారి, శ్రీకాంత్‌గౌడ్, శ్రీకళారెడ్డి బీజేపీలో చేరను న్నట్టు సమాచారం. త్వరలోనే మరి కొందరు టీడీపీ, కాంగ్రెస్‌నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్, కె.లక్ష్మా రెడ్డి, ప్రసాద్‌లతో బీజేపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. రాష్ట్రానికి వస్తున్న నడ్డాకు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. -
మన పదవి మనకే
► జిల్లా అభ్యర్థికే రాజ్యసభ టికెట్ ► కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అవకాశం ► గుండు సుధారాణికి మొండిచేరుు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాజ్యసభ ఎన్నికల్లో జిల్లాకు మరోసారి ప్రాధాన్యం దక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావుకు అవకాశం వచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కెప్టెన్ అభ్యర్థిత్వాన్ని గురువారం ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేస్తున్న లక్ష్మీకాంతరావుకు అరుదైన అవకాశం కల్పించారు. టీఆర్ఎస్కు శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావ డం లాంఛనమే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య సాన్నిత్యం ఉంది. టీఆర్ఎస్ ప్రస్థానంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ అయిన లక్ష్మీకాంతరావుకు కీలకమైన రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. సుధారాణికి ఆశాభంగం... జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి రాజ్యసభ స భ్యులుగా ఉండగా ఇప్పుడు గుండు సుధారాణికి బదులుగా లక్ష్మీకాంతరావు ఎన్నికవుతుండడంతో జిల్లాలోని రాజ్యసభ సభ్యుల సంఖ్యలో మార్పు ఉండదు. జిల్లాకు చెందిన గుండు సుధా రాణి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. గుండు సుధారాణి 2010లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ముందు గత ఏడాది అక్టోబరులో ఆమె టీఆర్ఎస్లో చేరారు. రాజ్యసభ సభ్యత్వంపై హామీతోనే టీఆర్ఎస్లో చేరినట్లు ఆమె పలుసార్లు తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. మార్చిలో జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సుధారాణి కోడలు అశ్రీతారెడ్డికి టీఆర్ఎస్ కార్పొరేటర్ టికెట్ వచ్చింది. అనంతరం సుధారాణి తన కోడలు అశ్రీతారెడ్డికి మేయర్ పదవి కోసం పలు ప్రయత్నాలు చేశారు. కానీ, టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన నన్నపునేని నరేందర్‌కు ఈ పదవి దక్కింది. దీంతో సుధారాణి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తుమ్మల నాగేశ్వర్రావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి సైతం రాలేదు. దీంతో గుండు సుధారాణి అనుచరుల్లో నైరాశ్యం నెలకొంది. గుండు సుధారాణి రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగుస్తోంది. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు మే 31 చివరి రోజుగా నిర్ణయించింది. జూన్ 11న పోలింగ్ జరగనుంది. లక్ష్మీకాంతరావు రాజకీయ జీవితం ఇదీ.. లక్ష్మీకాంతరావు రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో మొదలైంది. లక్ష్మీకాంతరావు సోదరుడు వడితెల రాజేశ్వరరావు 1972 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. లక్ష్మీకాంతరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1995 వరకు సింగాపురం గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా పనిచేశారు. ఇదే గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 జూన్ నుంచి 14 నెలలపాటు మంత్రిగా పనిచేసి రాజీనామా చేశారు. 2008లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికలో తిరిగి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్‌గా, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. భారత సైన్యంలోనూ.. లక్ష్మీకాంతరావు చదువుకునే రోజుల్లో ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ కేడెట్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1963లో సీనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైనిక దళంలో చేరారు. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ పొందారు. 1968 లో సైనిక సేవల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం కాకతీయ, ఆంధ్ర యూనివర్సిటీల సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. హసన్‌పర్తి, హుజూరాబాద్, రాంటెక్(నాగపూర్)లో ఇంజనీరింగ్ కాలేజీలు, హైదరాబాద్‌లో విజేత పబ్లిక్ స్కూల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మనోళ్లు.. మనకే
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో చేపట్టిన రాజ్యసభ సభ్యుల కేటాయింపు ప్రక్రియపై నెలకొన్న టెన్షన్ తొలగిపోయింది. జిల్లాకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో.. జిల్లాకు చెందిన ముగ్గురు సభ్యులు తెలంగాణకే కేటాయించబడ్డారు. రాష్ట్రం యూనిట్‌గా లాటరీ పద్ధతి నిర్వహించడంతో ఎవరు ఏ ప్రాంతానికి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై రాజ్యసభ సభ్యుల్లోనూ టెన్షన్ నెలకొంది. లాటరీ పక్రియ ముగియడంతో ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో 18 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ నుంచి గుండు సుధారాణి, గరికపాటి మోహన్‌రావులు రాజ్యసభ సభ్యులుగా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడే తరుణంలో 11 మంది సభ్యులను ఆంధ్రప్రదేశ్‌కు, ఏడుగురిని తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నారు. ఎవరిని ఏ ప్రాంతానికి కేటాయించాలనే విషయంపై తేల్చేందుకు లాటరీ పద్ధ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు. 2016లో ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. వీరిలో ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన గుండు సుధారాణి పదవీకాలం 2016 లోనే ముగియనుంది. లాటరీ కావడంతో ఎలా ఉంటుందోనన్న సందేహం వీడింది.సుధారాణి తెలంగాణకే ప్రాతినిధ్యం వహించేలా లాటరీలో నిర్ణయించారు. 2018లో పదవీకాాలం ముగియనున్న వారిలో ముగ్గురిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన రాపోలు ఆనందభాస్కర్ పదవీకాలం 2018లోనే ముగుస్తోంది. లాటరీలో ఆనందబాస్కర్ తెలంగాణకే వచ్చారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గరికపాటి మోహన్‌రావు పదవీకాలం 2020లో ముగియనుంది. ఇంకా బాధ్యతలు చేపట్టని మోహన్‌రావు లాటరీలో ఏ రాష్ట్రానికి ఎంపికవుతారనే సందేహం వీడింది. లాటరీలో మోహన్‌రావు తెలంగాణకే వచ్చారు. -
కేంద్ర మంత్రివర్గంలో చోటు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : కేంద్రంలో ఏర్పడనున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయ మైంది. తెలంగాణకు సంబంధించి టీడీపీ కోటాలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి తెలంగాణలో మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం ఒక్కటే దక్కింది. ఈ స్థానం నుంచి గెలిచిన మల్లారెడ్డి ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. దీంతో తెలంగాణకు సంబంధించి టీడీపీ కోటాలో రాజ్యసభ సభ్యులకే అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఇద్దరు రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణిలలో ఒకరికి అవకాశం వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత గరికపాటి మోహన్‌రావుకు కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది. టీడీపీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం గరికపాటికి ప్రధాన అనుకూలతగా ఉంది. 2004లో అధికారం కోల్పోయిన రోజు నుంచీ.. గరికపాటి మోహన్‌రావు రాజకీయంగా, ఆర్థికంగా టీడీపీకి అండగా ఉంటున్నారు. చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’తో పాటు భారీ కార్యక్రమాలకు గరికపాటి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ అంశాలతోనే ఇటీవల గరికపాటికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. సాధారణ ఎన్నికల్లో గరికపాటి తెలంగాణలోని పలువురికి ‘సహకారం’ అందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల సమన్వయ బాధ్యతలను గరికపాటి నిర్వహించారు. ఈ మూడు జిల్లాలో కలిపి టీడీపీకి 44 సీట్లు వచ్చారుు. ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో గరికపాటికి మరింత గుర్తింపు వచ్చిందని, తెలంగాణ కోటాలో ఈయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణలో పార్టీని పటిష్ట పరచడంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు... అన్ని రకాలుగా తనకు విధేయుడిగా ఉండే గరికపాటి మోహన్‌రావుకు ఈ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. జిల్లాలోని మరో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పేరు సైతం కేంద్ర మంత్రి వర్గం విషయంలో పరిశీలనకు వస్తుందని ఆమె వర్గీయులు చెబుతున్నారు. -
'బాబుకు లాభం చేకూర్చినవారికే రాజ్యసభ సీట్లు'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు వ్యక్తిగతంగా లాభం చేకూర్చిన వారికే రాజ్యసభ సీట్లు కట్టబెడుతున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ టీడీపీ ఫోరానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ ఎన్నికల బరిలో నిలపాలని ఆ ప్రాంత నేతలను ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబు నిలబెట్టిన గరికపాటి మోహన్ రావును ఓడించాలని తెలంగాణ టీడీపీ ఫోరానికి సూచించారు. ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని గరికపాటి మోహన్ రావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీతామహాలక్ష్మిని రాజ్యసభ అభ్యర్థులుగా చంద్రబాబు నిన్న ఉదయం నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
గరికపాటికి రాజ్యసభ సీటు ఖరారు
-
గరికపాటికి రాజ్యసభ సీటు ఖరారు
చివరి నిమిషంలో ఖరారు చేసిన బాబు మూడుకు చేరిన జిల్లా ప్రాతినిథ్యం టీడీపీ నేతల్లో హర్షం సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీడీపీ నుంచి గరికపాటి మోహన్‌రావుకు రాజ్యసభ టికెట్ ఖరారైంది. ఆ పార్టీ నుంచి ఉన్న రెండు రాజ్యసభ ఎంపీ సీట్ల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ ముఖ్యనేతలతో పలుమార్లు తీవ్ర చర్చలు జరిపిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం రాత్రి 11:30 గంటలకు తనకు కుడిభుజంగా ఉన్న గరికపాటివైపే మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారి సంఖ్య మూడుకు చేరింది. కాంగ్రెస్ నుంచి రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణి రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతున్నారు. తాజాగా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన గరికపాటి మోహన్‌రావు రాజ్యసభకు ఎంపిక కావడం జిల్లా టీడీపీ నేతల్లో ఉత్తేజాన్ని నింపింది. గరికపాటి 1985లో టీడీపీలో చేరి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన శివాజీ ఉండగా.. అదే సామాజిక వర్గానికి చెందిన గరికపాటి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి చురుకైన నాయకుడిగా పనిచేస్తూ వచ్చారు. టీడీపీలో పెను సంచలనం సృష్టించిన ఆగస్టు సంక్షోభ సమయంలో పార్టీ అధ్యక్షుడు శివాజీ... నాదెండ్ల భాస్కర్వర్గంలో చేరినా గరికపాటి మాత్రం ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. ఆ తదుపరి చంద్రబాబుకు కుడిభుజంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2013 వస్తున్నా.. మీకోసం యాత్ర ఇన్చార్జ్గా గరికపాటి వ్యవహరించారు. గరికపాటి పుట్టి పెరిగింది నర్సంపేట మండలం మహేశ్వరంలోనేనైనా మంగపేట మండలం కమలాపురంలో వ్యాపారంలో స్థిరపడ్డారు. ములుగు నియోజకవర్గంతో అనుబంధం పెంచుకుని కమలాపురం ప్రస్థానంగా ఎదిగారు. పార్టీ తరఫున మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేశారు. గరికపాటికి రాజ్యసభ సీటు దక్కడంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి చెందిన నేతకు ఎంపీ పదవి రావడం వల్ల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆమె అన్నారు.