
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో పెద్దఎత్తున టీటీడీపీ శ్రేణులు చేరడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో 18 జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, క్షేత్రస్థాయినేతలు, కార్య కర్తలు మొత్తం 20 వేలమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.
నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చేరికల ద్వారా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. మాజీమంత్రి పి.జగన్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, ఊకె అబ్బయ్య, టీడీపీ నేతలు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, ఎంఎన్ శ్రీనివాస్, బి.శోభారాణి, లంకల దీపక్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాదినేని శ్రీనివాస్, పాల్వాయి రజనీకుమారి, శ్రీకాంత్‌గౌడ్, శ్రీకళారెడ్డి బీజేపీలో చేరను న్నట్టు సమాచారం. త్వరలోనే మరి కొందరు టీడీపీ, కాంగ్రెస్‌నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్, కె.లక్ష్మా రెడ్డి, ప్రసాద్‌లతో బీజేపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. రాష్ట్రానికి వస్తున్న నడ్డాకు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment