Jagat Prakash nadda
-
BJP National Convention 2024: 100 రోజులు.. 370 స్థానాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 370 నియోజవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేయాలని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు లభిస్తున్నగౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. మరో మూడు నెలల్లోగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. తొలిరోజు భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు సహా 11 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలిలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ, నడ్డా తదితరులు తిలకించారు. అనంతరం పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలు, ప్రచార వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు. ముఖర్జీకి నిజమైన నివాళి: మోదీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శనివారం బీజేపీ జాతీయ ఆఫీసు–బేరర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆరి్టకల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజుల ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడటంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: జేపీ నడ్డా ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో బీజేపీ అనేక విజయాలు సాధించిందని జేపీ నడ్డా అన్నారు. 2014లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ, 17 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని గుర్తుచేశారు. పశి్చమ బెంగాల్లో బీజేపీకి 10 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ పరంగా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కటి నుంచి 8కి, ఓట్ల శాతం 7.1 నుంచి 14కు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టబోమని, అక్కడ అధికారంలోకి వస్తామని, అందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలంతా దీపాలు వెలిగించినా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ మహత్కార్యానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన నేతలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో పాటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీనియర్ నేతలు సోము వీర్రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధ్దన్‌రెడ్డి, సత్యకుమార్, కిలారు దిలీప్ హాజరయ్యారు. -
నేడు హైదరాబాద్‌కు నడ్డా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకలజనుల విజయ సంకల్పసభ పేరిట నిర్వహిస్తున్న బహిరంగసభలు, రోడ్‌షోలలో ఆయన పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా నారాయణపేటకు చేరుకుని ఒంటిగంట నుంచి రెండుగంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్‌షోలలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు. కాగా, సోమవా రం (20న) కొల్లాపూర్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. -
బీజేపీ కార్యకర్తలపై దాడి.. దీదీపై నడ్డా ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయం ‘నబన్నా’ ముట్టడికి వచ్చిన వందలాది మంది బీజేపీ నిరసకారులకు, పోలీసులకు మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఇక ఆమె పదవిలో ఉండే రోజులు లెక్కబెట్టుకోవాల్సిన తరుణం అసన్నమయ్యింది అన్నారు. ఈ మేరకు నడ్డా వరుస ట్వీట్లు చేశారు. ‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై నీటి ఫిరంగులను, టియర్ గ్యాస్‌ని ఉపయోగించారు. ఇవన్నీ దీదీలోని నిరాశను తెలియజేస్తున్నాయి. ఆమె పదవి కోల్పోయే సమయం దగ్గర పడింది. బెంగాల్ ప్రజలు ఆమె నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధమయ్యారు. బీజేపీ కార్యకర్తలు బెంగాల్ కోల్పోయిన కీర్తి, ప్రతిష్టలను పునరుద్ధరించడానికి గాను అవినీతి, నిరంకుశ, హింసాత్మక ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాటడానికి సంకల్పించారు. కానీ వారిపై అమానుషంగా దాడి చేశారు. బెంగాల్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఆమె ఓటమి కోసం కృషి చేస్తారు’ అన్నారు నడ్డా. (చదవండి: ‘నబన్నా’ ముట్టడి, కోల్‌కతాలో ఉద్రిక్తత) ‘వామపక్షాల పాలనలో కంటే మమతా బెనర్జీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై హింస, దాడులు పెరిగాయి. దీదీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కానీ మేం బెంగాల్ ప్రజలతో నిలబడతాం. మా ధైర్యవంతులైన బీజేపీ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నం చేశారు. దీదీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అనడానికి ఇదే నిదర్శనం. దౌర్జన్యం, రక్తపాత దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిరసనలు చేయకుండా నిరోధించడానికి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం బీజేపీ కార్యకర్తలపై దారుణమైన హింసకు పాల్పడ్డారు. ఈ అధికార దుర్వినియోగం ఆమోదయోగ్యం కాదు’ అంటూ నడ్డా వరుస ట్వీట్లు చేశారు. పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడి సమావేశాలను నిర్వహించడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి నిరసనగా బీజేపీ ‘ఛలో నబన్నా’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు. -
'థ్యాంక్యూ సోనియా జీ; మీ ఆరోగ్యం జాగ్రత్త'
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్నిగంటల ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ప్రసంగంతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. సోనియా తన ప్రసంగంలో కరోనాపై పోరాటంలో తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అండంగా ఉంటుందన్నారు. అందరూ జాగ్రత్తగా ఇళ్లలో ఉంటూ కరోనా బారి నుంచి తమను తాము రక్షించుకున్నప్పుడే ఈ పోరాటంలో విజయం సాధించవచ్చంటూ తన సందేశాన్ని వినిపించారు. అయితే ప్రధాని ప్రసంగానికి ముందు ఈ వీడియోను విడుదల చేయకుండా ఉండాలంటూ బీజేపీ శ్రేణులు సూచించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వీడియో సందేశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. 'థ్యాంక్యూ సోనియా జీ; మీ ఆరోగ్యం జాగ్రత్త' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే గతంలో కూడా సోనియాపై దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ముండిపడిన విషయం తెలిసిందే. కాగా.. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి మే 3వ తేది వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస ‘అంతకు మించిన దేశభక్తి మరోకటి లేదు’ -
నిశ్శబ్ద వ్యూహకర్త
న్యూఢిల్లీ: అధికార బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జగత్ ప్రకాష్ నడ్డా(59)కు మృదు స్వభావిగా పేరుంది. స్వభావరీత్యా ఒదిగి ఉండే నడ్డా కార్యాచరణలో మాత్రం దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు. ఆర్భాటాలపై ఆసక్తిలేని నడ్డా అనతికాలంలోనే ఎదిగి, అపరచాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా నిర్వర్తించిన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. నడ్డా నిశ్శబ్ద వ్యూహకర్త. ఆయన నిశ్శబ్దం వెనుక పట్టుదల, నిబద్ధత, సంస్థాగత నైపుణ్యం దాగి ఉన్నాయంటారు ఆయనను ఎరిగిన వారు. ఆరెస్సెస్‌కు నమ్మకస్తుడు ఆరెస్సెస్‌తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి నడ్డా. బీజేపీలో ప్రస్తుతం నడ్డా అత్యంత బలమైన మూడో వ్యక్తి. పార్టీ భవిష్యత్ వ్యూహంలో భాగంగానే గత ఏడాది నడ్డాని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి జేపీ నడ్డా 1960 డిసెంబర్ 2వ తేదీన బిహార్‌లోని పట్నాలో జన్మించారు. నడ్డా తండ్రి ఎన్.ఎల్. నడ్డా. ఈయన పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. విద్యార్థి దశనుంచే బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకి ఉంది. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయాలంటూ నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు నడ్డాని 45 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ‘ఛత్రా సంఘర్‡్ష సమితిలో చేరడానికి జేపీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందాను’ అని నడ్డా ఒకచోట ప్రస్తావించారు. ఆ తరువాత ఏబీవీపీ, బీజేపీ యువజన సంఘం భారతీయ యువ మోర్చాతో కలిసి పనిచేశారు. రాజకీయ కుటుంబం కాదు నడ్డాది సామాన్య బ్రాహ్మణ కుటుంబం. కానీ, రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన యువతిని వివాహం చేసుకున్నారు. నడ్డా భార్య మల్లిక జబల్పూర్ ఎంపీ జయశ్రీ బెనర్జీ కుమార్తె. జేపీ నడ్డా రాజకీయాల్లో ఆసక్తి కనపరిస్తే, మల్లిక నడ్డా విద్యారంగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. బిలాస్పూర్ నుంచి అసెంబ్లీలోకి డిగ్రీ వరకు బిహార్‌లో చదివిన నడ్డా.. ఎల్ఎల్బీని హిమాచల్‌ప్రదేశ్‌లో చదివారు. బిలాస్పూర్ నుంచి 1993లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలుమార్లు నడ్డా ఇదే స్థానం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అటవీశాఖ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా నడ్డా పనిచేశారు. -
కమలనాథులకు కొత్త దళపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు. ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా చేరడంతో.. గత జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యం ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు. కలిసి స్కూటర్‌పై తిరిగాం నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్‌పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
బీజేపీ చీఫ్‌గా నడ్డా!
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే సోమవారం నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వస్తున్నారు. విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా పరిణమించాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లను జనవరి 20న దాఖలు చేస్తారని, అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తామని బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ప్రకటించారు. అమిత్ షా అడుగు జాడల్లో.. ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత దశను అనుభవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. నడ్డా ప్రస్తుతం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జ్గా నడ్డా వ్యవహరించారు. -
నేడు బీజేపీలోకి భారీగా చేరికలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో పెద్దఎత్తున టీటీడీపీ శ్రేణులు చేరడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో 18 జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, క్షేత్రస్థాయినేతలు, కార్య కర్తలు మొత్తం 20 వేలమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చేరికల ద్వారా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. మాజీమంత్రి పి.జగన్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, ఊకె అబ్బయ్య, టీడీపీ నేతలు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, ఎంఎన్ శ్రీనివాస్, బి.శోభారాణి, లంకల దీపక్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాదినేని శ్రీనివాస్, పాల్వాయి రజనీకుమారి, శ్రీకాంత్‌గౌడ్, శ్రీకళారెడ్డి బీజేపీలో చేరను న్నట్టు సమాచారం. త్వరలోనే మరి కొందరు టీడీపీ, కాంగ్రెస్‌నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్, కె.లక్ష్మా రెడ్డి, ప్రసాద్‌లతో బీజేపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. రాష్ట్రానికి వస్తున్న నడ్డాకు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఓటమి భయంతోనే కుమ్మక్కు రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఓటమి భయంతోనే కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూసి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లాల్‌బహుదూర్ స్టేడియంలో సోమవారం(3న) నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయతో కలసి నడ్డా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన సభల ద్వారా తమ విజయం దాదాపు ఖరారయిందన్నారు. మోదీ, అమిత్‌షాలు రాష్ట్రంలో అడుగుపెడుతుంటే చంద్రబాబు, కేసీఆర్‌ల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలను అయోమయానికి గురి చేసేలా ఉందన్నారు. మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పించని టీఆర్ఎస్ను ఏవిధంగా ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు. ఉనికి కోసమే చంద్రబాబు పాట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ అస్థిత్వం కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని దత్తాత్రేయ విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు కచ్చితంగా ఓడిపోతార ని జోస్యం చెప్పారు. అందుకే ఆయన ఒకదాని కొకటి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ఎదుట తేలికవుతున్నారని, బాబు వ్యాఖ్యలు ఆయన పతనానికే దారితీస్తాయని చెప్పారు. బహిరంగ సభల్లో కేసీఆర్ మాటలు చూస్తుంటే టీఆర్ఎస్ ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ ‘స్టార్ వార్!’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొంత మంది కీలక నేతలను ఆ పార్టీ రంగంలోకి దించనుంది. ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్ బహిరంగ సభల్లో పాల్గొనగా, అమిత్‌షా 9 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా హైదరాబాద్‌లోనే మకాం వేసి, పార్టీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించడంతోపాటు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంతోష్ గంగ్వార్, పార్టీ సీనియర్ నేతలు మురళీధర్‌రావు, రాంమాధవ్, పురంధేశ్వరి, స్వామి పరిపూర్ణానంద వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ మేడ్చ ల్ అభ్యర్థి మోహన్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. పరిపూర్ణానంద ఇప్పటికే పదుల సంఖ్యలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా, మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఐదో తేదీ వరకు కీలకసభలు ఈ నెల ఒకటి(శనివారం) నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే బహిరంగ సభలు తమకు ఎంతో కీలకమైనవని బీజేపీ పేర్కొంటోంది. ఈ నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో పరిణామాలు మారుతాయని, బీజేపీకి మరింత అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 2 న అమిత్‌షా నారాయణ్‌పేట్, కల్వకుర్తి (ఆమనగల్), కామారెడ్డి బహిరంగసభలు, ఉప్పల్, మల్కాజిగిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2న భూపాలపల్లి, ముధోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిలో, 5న కరీంనగర్, వరంగల్, గోషామహల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. 4న కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, రవిశంకర్ ప్రసాద్‌ల సభలు నిర్వహించనున్నారు. శనివారం(నేడు) ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ భద్రాచలం, ఎల్లారెడ్డి, ఖైరతాబాద్ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. -
మోదీకి భయపడే కేసీఆర్ ముందస్తు వెళ్ళారు
-
‘కేసీఆర్ మాటలే ఆయన పిచ్చి పాలనకు అద్దం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భయపడే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్, కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలన పరంగా కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడే మాటలే ఆయన పిచ్చి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సరైన కారణం చెప్పడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ కింద 172కోట్లు తెలంగాణకు ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. కేసీఆర్ స్వలాభం కోసం తెలంగాణ ప్రజలకు మోదీ పథకాలు చేరకుండా చేశారని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యం అని జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు. -
కొత్తగా 4వేల పీజీవైద్య సీట్లు
కేంద్రం ఆమోదం ► మార్చి ముగిసేలోపు మరో వెయ్యికి అవకాశం న్యూఢిల్లీ: 2017–18 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా నాలుగు వేల కొత్త పీజీ వైద్య విద్య సీట్లకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా గురువారం చెప్పారు. వీటితో కలిపి దేశంలోని మొత్తం పీజీ వైద్య విద్య సీట్ల సంఖ్య 35,117కు చేరనుంది. వైద్య విద్య అభివృద్ధికి ఈ సీట్ల పెంపు తోడ్పడుతుందని నడ్డా అన్నారు. దేశంలో వైద్య నిపుణుల సంఖ్యను పెంచేందుకుగాను ప్రతి ఏడాది 5,000 కొత్త పీజీ వైద్య సీట్లను మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ప్రకటించడం తెలిసిందే. సీట్ల పెంపు కోసం ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని క్లినికల్ సబ్జెక్టుల్లో అధ్యాపకుడు, విద్యార్థుల నిష్పత్తిలో మార్పులు చేసినట్లు నడ్డా వెల్లడించారు. ఆ మార్పుల వల్ల 1,137 కొత్త సీట్లు లభించాయనీ, మార్చి ముగిసేలోపు మరో వెయ్యి సీట్లు పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఎండీ/ఎంఎస్‌లకు సమానమైన డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్ బీ) కోర్సుల్లో గత ఏడాది కాలంలో మొత్తంగా 2,147 సీట్లను పెంచారు. ఇప్పుడు చెబుతున్న నాలుగు వేల సీట్లలో ఈ 2,147 సీట్లు కూడా కలసి ఉన్నాయి. మొత్తం మీద 2017–18 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు కొత్తగా లభించినట్లు నడ్డా తెలిపారు. -
మంగళగిరి ఎయిమ్స్ మూడేళ్లలో పూర్తి
శంకుస్థాపన సభలో కేంద్రమంత్రి నడ్డా వెల్లడి సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని అభివృద్ధి పరిచి, పేదలకు ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. దేశంలో 10 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలతోపాటు ఆయుర్వేదం, యునానీ, సిద్ధ వంటి అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఎయిమ్స్ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హరియాణా, కోల్‌కతాలో రెండు కేన్సర్ పరిశోధనా కేంద్రాలు, అన్ని రాష్ట్రాల్లో 20 కేన్సర్ ఇనిస్టిట్యూట్లు, 50 క్యాన్సర్ ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. దేశంలో 58 జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచి వైద్య కళాశాలలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెడికల్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరి ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఎయిమ్స్‌ను దేశంలో నంబర్‌వన్‌గా రూపొందిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎయిమ్స్ విద్యార్థులకు విజయవాడ లేదా గుంటూరు ఆసుపత్రుల్లో తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. రాజధానికి ఎయిమ్స్ ను మణిహారంగా మారుస్తామన్నారు. ఆసుపత్రుల్లో జనరిక్ మందుల అమ్మకాలను డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తామన్నారు. గుంటూరు, కర్నూలులో కేన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఎయిమ్స్‌కు రూ.4 కోట్ల విరాళాలు మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణానికి ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన డాక్టర్ సదాశివరావు కుమారులు రమేశ్, సురేశ్ రూ.2 కోట్లు, డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్ రూ.2 కోట్లు విరాళంగా అందచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సన్మానించారు. వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న వైద్య ప్రముఖులు సోమరాజు, గురువారెడ్డి, మన్నెం గోపీచంద్, చదలవాడ నాగేశ్వరరావు, ముక్కామల అప్పారావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పి.అశోక్‌గజపతిరాజు, వై.సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, పి.మాణిక్యాలరావు, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ-గుంటూరుకు ఎలక్ట్రికల్ ట్రైన్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను దేశంలోని 393 జిల్లాల్లో 30 కోట్ల మందికి వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎయిమ్స్ శంకుస్థాపన సభలో ఆయన ప్రసంగించారు. విజయవాడ-గుంటూరు మధ్య ఎలక్ట్రికల్ ట్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అంతర్వేది వద్ద రూ.1,800 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. -
'మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం'
విజయవాడ: మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నడ్డా, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 193 ఎకరాల్లో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్‌ను నిర్మించనున్నట్టు జేపీ నడ్డా తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. 'మంగళగిరి ఎయిమ్స్ అమరావతికి మణిహారంలా నిలవబోతుంది. వైద్య సేవల కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. రెండేళ్లలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలి' అని చెప్పారు. 'త్వరలోనే విజయవాడ మెట్రో రైలు టెండర్స్ పిలుస్తాం. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు కి ప్రత్యేక ఎలక్ట్రికల్ ట్రైన్ సర్వీస్ ప్రారంభిస్తాం. ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా ఏపీకి ప్రాధాన్యం ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం' అని వెంకయ్యనాయుడు అన్నారు. -
నేడు ఎయిమ్స్‌కు శంకుస్థాపన
హాజరవనున్న కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించే ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా శంకుస్థాపనకు హాజరవుతున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. -
ఏబీవీపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి...
బీహార్ కు చెందిన బీజేపీ నాయకుడు జేపీ నద్దా కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనకు కేబినెట్ ర్యాంకు దక్కింది. హిమాచల్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయనకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలు వంటబట్టించుకున్న ఆయన బీజేపీ స్టూడెంట్ విభాగం- ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ తో ముడిపడివుంది. రెండుసార్లు హిమాచల్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తిపేరు: జగత్ ప్రకాశ్ నద్దా జన్మదినం:1960 డిసెంబర్ 2 జన్మస్థలం: పాట్నా వయసు: 53 తల్లిదండ్రులు: నరైన్ లాల్ నద్దా, కృష్ణా నద్దా భార్య: డాక్టర్ మల్లికా నద్దా పిల్లలు: ఇద్దరు కుమారులు పార్టీ: బీజేపీ నివాసం: న్యూఢిల్లీ రాజకీయ జీవితం ఏబీవీపీలో 13 ఏళ్ల పాటు సేవలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు 1998-2003 మధ్య హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రిగా సేవలు 2012లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక 2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం -
బీజేపీతో బంగారు తెలంగాణ
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, తమ పాలన కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు టీఆర్ఎస్ సర్కార్ నిరాశే మిగిల్చిందన్నారు. 2019 నాటికి పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మజ్లిస్ కనుసన్నల్లోనే టీఆర్ఎస్: కిషన్‌రెడ్డి అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ నేతల కనుసన్నల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్‌కు అనుకూలంగా నడుచుకున్నట్లుగానే టీఆర్ఎస్ కూడా ఆ పార్టీని చంకన పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోం దని ఆరోపించారు. -
బీజేపీ అధ్యక్ష రేసులో మోడీ సన్నిహితుడు?
లోక్‌సభ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా పేరు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి విన్పిస్తోంది. రాజ్‌నాథ్ సింగ్ వారసుడిగా షాకు ఛాన్స్ దక్కే అవకాశముందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో పార్టీని విజయపథంలో నడిపించిన అమిత్ షా అధ్యక్ష పదవి రేసులో పోటీదారుల కంటే ముందున్నారని భావిస్తున్నారు. బీజేపీ మరో ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నద్దా పేరు కూడా పార్టీ అధ్యక్ష పదవికి బలంగా విన్పిస్తోంది. అమిత్ షా కంటే ముందే నద్దా పేరు తెరపైకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నద్దా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడంలో చాకచాక్యంగా వ్యవహరించారు. ప్రచారానికి దూరంగా ఉండే నద్దా పార్లమెంట్ గత సమావేశాల్లో రాజ్యసభలో చేసిన ప్రసంగం ద్వారా సీనియర్లను ఆకట్టుకున్నారు. ప్రభుత్వానికి ఆచరణ సాధ్యమైన సూచనలిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోడీ, పార్టీలు పెద్దలు, ఆర్ఎస్ఎస్ అండతో తనకు అధ్యక్ష పదవికి ఖాయమన్న దీమాతో ఉన్నారు. అమిత్ షాతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ భారతీయ యువ జనతా మోర్చాలో పనిచేసిన వారే. అయితే అనూహ్యంగా అమిత్ షా పేరు వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష పదవి పీఠంపై ఆయనను కూర్చోబెడితే ఎలా ఉంటుందన్న చర్చ బీజేపీలో మొదలయిందని సమాచారం. ఉత్తరప్రదేశ్ లో అమిత్ షా అవలంభించిన వ్యూహాల కారణంగానే బీజేపీ పెద్ద సంఖ్యలో లోక్‌సభ సీట్లు గెల్చుకుందని అధిష్టానం నమ్ముతోంది. ఇదే వ్యూహాన్ని దేశమంతా అమలు చేస్తే పార్టీకి తిరుగుండదని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పేరు తెరపైకి వచ్చింది. మోడీ సన్నిహితుడైన షాను అధ్యక్షుడిగా అద్వానీ వర్గం వ్యతిరేకించే అవకాశముంది. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నద్దా!
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా జేపీ నద్దా (జగత్ ప్రసాద్ నద్దా) ఎన్నికయ్యే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఆయన నరేంద్ర మోడీతోనూ, ఇతర బిజెపి నేతలతోనూ సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను మోడీ మంత్రివర్గంలోకి తీసుకుని హోం లేదా ఇతర కీలక శాఖ అప్పగిస్తారని సమాచారం. దాంతో ఆయన స్థానంలో జేపీ నద్దా బీజేపీ పగ్గాలు చేపట్టే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నద్దా తొలుత ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించారు. పదేళ్లకు పైగా వివిధ స్థాయిల్లో విద్యార్థి నేతగా పనిచేశారు. ఆ తర్వాత బిజెపిలో చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్నారు. కాగా నద్దా నియామకంపై బీజేపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.