బీజేపీతో బంగారు తెలంగాణ | Gold with BJP Telangana | Sakshi
Sakshi News home page

బీజేపీతో బంగారు తెలంగాణ

Published Wed, Aug 6 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

బీజేపీతో బంగారు తెలంగాణ

బీజేపీతో బంగారు తెలంగాణ

బీజేపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా
 
సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, తమ పాలన కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు టీఆర్‌ఎస్ సర్కార్ నిరాశే మిగిల్చిందన్నారు. 2019 నాటికి పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

మజ్లిస్ కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్: కిషన్‌రెడ్డి

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ నేతల కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్‌కు అనుకూలంగా నడుచుకున్నట్లుగానే టీఆర్‌ఎస్ కూడా ఆ పార్టీని చంకన పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోం దని ఆరోపించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement