ఏబీవీపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి... | Jagat Prakash Nadda profile | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి...

Published Sun, Nov 9 2014 1:36 PM | Last Updated on Thu, May 24 2018 2:09 PM

ఏబీవీపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి... - Sakshi

ఏబీవీపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి...

బీహార్ కు చెందిన బీజేపీ నాయకుడు జేపీ నద్దా కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనకు కేబినెట్ ర్యాంకు దక్కింది. హిమాచల్ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయనకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలు వంటబట్టించుకున్న ఆయన బీజేపీ స్టూడెంట్ విభాగం- ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ తో ముడిపడివుంది. రెండుసార్లు హిమాచల్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

వ్యక్తిగత, కుటుంబ వివరాలు
పూర్తిపేరు: జగత్ ప్రకాశ్ నద్దా
జన్మదినం:1960 డిసెంబర్ 2
జన్మస్థలం: పాట్నా
వయసు: 53
తల్లిదండ్రులు: నరైన్ లాల్ నద్దా, కృష్ణా నద్దా
భార్య: డాక్టర్ మల్లికా నద్దా
పిల్లలు: ఇద్దరు కుమారులు
పార్టీ: బీజేపీ
నివాసం: న్యూఢిల్లీ

రాజకీయ జీవితం
ఏబీవీపీలో 13 ఏళ్ల పాటు సేవలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
1998-2003 మధ్య హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రిగా సేవలు
2012లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక
2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement