వారంలో పార్లమెంటు ముందుకు
న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ 60 ఏళ్లనాటి ఐటీ చట్టం స్థానంలో ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకొచ్చారు.
స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని (ఎస్‌ఐపీ) కొనసాగించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. దానికి రూ. 8,800 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పీఎం కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీఓ 4.0), పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (పీఎం–ఎన్‌ఏపీఎస్), జన్ శిక్షణ్ సంస్థాన్‌లను ఎస్‌ఐపీ కింద ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment