'థ్యాంక్యూ సోనియా జీ; మీ ఆరోగ్యం జాగ్రత్త' | JP Nadda Takes Dig At Sonia Gandhi For Her Video Message | Sakshi
Sakshi News home page

'థ్యాంక్యూ సోనియా జీ; మీ ఆరోగ్యం జాగ్రత్త'

Published Tue, Apr 14 2020 4:31 PM | Last Updated on Tue, Apr 14 2020 4:31 PM

JP Nadda Takes Dig At Sonia Gandhi For Her Video Message - Sakshi

న్యూఢిల్లీ: లా​క్‌డౌన్‌పై ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్నిగంటల ముందు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ప్రసంగంతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. సోనియా తన ప్రసంగంలో కరోనాపై పోరాటంలో తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అండంగా ఉంటుందన్నారు. అందరూ జాగ్రత్తగా ఇళ్లలో ఉంటూ కరోనా బారి నుంచి తమను తాము రక్షించుకున్నప్పుడే ఈ పోరాటంలో విజయం సాధించవచ్చంటూ తన సందేశాన్ని వినిపించారు.

అయితే ప్రధాని ప్రసంగానికి ముందు ఈ వీడియోను విడుదల చేయకుండా ఉండాలంటూ బీజేపీ శ్రేణులు సూచించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వీడియో సందేశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. 'థ్యాంక్యూ సోనియా జీ; మీ ఆరోగ్యం జాగ్రత్త' అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. అయితే గతంలో కూడా సోనియాపై దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ముండిపడిన విషయం తెలిసిందే. కాగా.. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి మే 3వ తేది వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస

‘అంతకు మించిన దేశభక్తి మరోకటి లేదు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement