సాక్షి, న్యూఢిల్లీ: శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల టికెట్టు చార్జీలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గురువారం లేఖ రాసింది. శ్రామిక రైళ్ల చార్జీల విషయంలో రాజకీయం చేయ్యొద్దని విజ్ఞప్తి చేసింది. స్టేషన్లలో గుంపులుగా ఏర్పడకుండా చూడటం కోసమే ఛార్జీలు విధించామని తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ఇంత మంది కార్మికులు ఒకేసారి ప్రయాణించడం చాలా ప్రమాదకరమని, కానీ రైల్వే ఉద్యోగులు తమ కష్టంతో దాన్ని సాధ్యపడేలా చేశారని లేఖలో పేర్కొన్నారు. (‘శ్రామిక్’ చార్జీలపై రాజకీయ దుమారం)
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న వలస కార్మికులను ఇంటికి చేర్చేందుకు భారత ప్రభుత్వం మే 1 నుంచి శ్రామిక్ రైళ్లపేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ప్రయాణించడానికి అధిక మొత్తంలో ఛార్జీలు విధించారు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఈ విషయంపై స్పందిన కాంగ్రెస్ పార్టీ ఆ భారాన్ని తాము భరిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏఐఆర్‌ఎఫ్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా సోనియాకి లేఖ రాశారు. వలస కార్మికులను పంపించడానికి 115 రైళ్ల ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతా సక్రమంగా కొనసాగుతుంది. మీ రాజకీయ లాభాల కోసం ఈ విషయాన్ని వాడుకోకండి అని లేఖలో పేర్కొన్నారు. అయితే శ్రామిక రైళ్ల ఛార్జీల్లో 85 శాతం రైల్వే శాఖ, మిగిలిన 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్రం సూచించింది. (ఆ ఖర్చులో 85 శాతం రైల్వేలే భరించాయి)
‘శ్రామిక్ రైళ్ల ఛార్జీలు అందుకే విధించాం’
Published Thu, May 7 2020 5:49 PM | Last Updated on Thu, May 7 2020 5:49 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment