Railway Charges
-
నష్టాలను తప్పించుకునేందుకు కరోనా సాకు
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణతో వచ్చే నష్టాలను కొంతమేర తగ్గించుకునేందుకు రైల్వేశాఖ కోవిడ్ బూచిని సాకుగా వాడుకుంటోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులైనా ఈ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్‌నూ ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్ రైళ్లను మాత్రం షురూ చేయడం లేదు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే వాటిని ప్రారంభించడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు, సాధారణ బస్సులు, అన్రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, బహిరంగ సభలు, పెళ్లిళ్లుపేరంటాలు.. ఇలా వేటివల్లా విస్తరించని కరోనా, ప్యాసింజర్ రైళ్లతోనే వ్యాపిస్తుందన్న వాదన వింతగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లు లేకపోవటంతో అల్పాదాయ ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. (చదవండి: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?) నిర్వహణ వ్యయం ఎక్కువే.. ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో ప్రయాణికులపై 30 శాతమే భారం పడుతోందని, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు ఉందని పేర్కొంటోంది. అలాగే, ప్యాసింజర్ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్లో కచ్చితంగా ఆగాల్సిందే. ఇలా రైలును ఆపి మళ్లీ పరిగెత్తించేందుకు డీజిల్/విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్ ఛార్జీ భారం పెరుగుతుంది. 400 కి.మీ. దూరం ఉండే గమ్యం చేరటంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నాలుగైదు స్టేషన్లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు 15 నుంచి 18 వరకు స్టేషన్ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది. టికెట్ ధరలు చవక, నిర్వహణ వ్యయం ఎక్కువతో ప్యాసింజర్ రైళ్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు.. దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్‌కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. అంటే.. అంతమేర నష్టాలొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత నష్టాలొస్తున్నా.. సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీన్ని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నిబంధనల మేరకు ప్యాసింజర్ రైళ్లను గతేడాది మార్చి ఆఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అవి కిక్కిరిసి ప్రయాణికులతో పరుగుపెడుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తమ్మీద కేరళ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడం లేదు. మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలున్నా.. దేశంలో ఎక్కడా కఠిన నియంత్రణలు, ఆంక్షలు లేవు. కానీ, ఒక్క ప్యాసింజర్ రైళ్ల విషయంలోనే ఏడాదిన్నరగా ఆంక్షలు కొనసాగిస్తుండటం విడ్డూరంగా కనిపిస్తోంది. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం కూడా లేదు. ► దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు: 350 ► ప్యాసింజర్ రైళ్లు: 200 ► నిత్యం జోన్ పరిధిలో ప్రయాణించేవారు: 10.5 లక్షలు ► వీరిలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేవారు: 8 లక్షలు ► నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.12–15 కోట్లు ► ఈ మొత్తంలో ప్యాసింజర్ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే ► ప్యాసింజర్ రైలు టికెట్‌పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోంది.. ఇదీ రైల్వే మాట. ► కోవిడ్ ఆంక్షల పేరుతో ఏడాదిన్నరగా ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది జీతాలు మినహా నిర్వహణ నష్టాలన్నీ ఆగిపోయాయి. ► టికెట్ ఆదాయం కూడా ఆగినా.. అది నామమాత్రమే. -
‘ఆ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల టికెట్టు చార్జీలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గురువారం లేఖ రాసింది. శ్రామిక రైళ్ల చార్జీల విషయంలో రాజకీయం చేయ్యొద్దని విజ్ఞప్తి చేసింది. స్టేషన్లలో గుంపులుగా ఏర్పడకుండా చూడటం కోసమే ఛార్జీలు విధించామని తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ఇంత మంది కార్మికులు ఒకేసారి ప్రయాణించడం చాలా ప్రమాదకరమని, కానీ రైల్వే ఉద్యోగులు తమ కష్టంతో దాన్ని సాధ్యపడేలా చేశారని లేఖలో పేర్కొన్నారు. (‘శ్రామిక్’ చార్జీలపై రాజకీయ దుమారం) లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న వలస కార్మికులను ఇంటికి చేర్చేందుకు భారత ప్రభుత్వం మే 1 నుంచి శ్రామిక్ రైళ్లపేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ప్రయాణించడానికి అధిక మొత్తంలో ఛార్జీలు విధించారు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఈ విషయంపై స్పందిన కాంగ్రెస్ పార్టీ ఆ భారాన్ని తాము భరిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా సోనియాకి లేఖ రాశారు. వలస కార్మికులను పంపించడానికి 115 రైళ్ల ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతా సక్రమంగా కొనసాగుతుంది. మీ రాజకీయ లాభాల కోసం ఈ విషయాన్ని వాడుకోకండి అని లేఖలో పేర్కొన్నారు. అయితే శ్రామిక రైళ్ల ఛార్జీల్లో 85 శాతం రైల్వే శాఖ, మిగిలిన 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్రం సూచించింది. (ఆ ఖర్చులో 85 శాతం రైల్వేలే భరించాయి) -
రైల్వే చార్జీల హేతుబద్ధీకరణ
న్యూఢిల్లీ: ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను హేతుబద్ధీకరించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వై.కె.యాదవ్ గురువారం వెల్లడించారు. అయితే, ఛార్జీలు పెరుగుతాయా? అన్నదానిపై సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన విషయమని విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామన్నారు. సరుకు రవాణా చార్జీలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణికులను రైల్వే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం కారణంగా రైల్వే ఆదాయంలో తగ్గుదల నమోదవడం తెల్సిందే. రైల్వే నిర్వహణకు ఐదు విభాగాలు రైల్వేలలో ఇకపై యూపీఎస్సీ తరహాలో ఐదు ప్రత్యేక విభాగాలకు నియామకాలు జరుగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగానే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్) కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని అందులో విజయం సాధించిన వారు ఐదు విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకుంటారని ఆయన వివరించారు. ఈ ఐదు ప్రత్యేక విభాగాల్లో నాలుగు సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్ వంటి ఇంజినీరింగ్ సేవలు కాగా, మిగిలిన నాన్ టెక్నికల్ విభాగం కింద అకౌంట్స్, పర్సనెల్, ట్రాఫిక్ వంటివి ఉంటాయని చెప్పారు. చివరి విభాగంలో ఉద్యోగం కోసం హ్యుమానిటీస్ చదువుకున్న వారూ అర్హులేనని, అందరికీ ఒకేసారి పదోన్నతులు దక్కుతాయని తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ ఇకపై రైల్వేల సీఈవోగా ఉంటారు. ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారే ఈ పదవి చేపట్టనున్నారు. సీనియారిటీకి ఢోకా లేదు: పీయూష్ గోయెల్ రైల్వేలోని వివిధ విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల అధికారుల సీనియారిటీకి ఇబ్బంది కలగబోదని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్రతిభ, సీనియారిటీల ఆధారంగా రైల్వే బోర్డులో సభ్యులయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. -
రైళ్లలో ఫ్లెక్సీ–ఫేర్‌కు సవరణలు
న్యూఢిల్లీ: ఖరీదైన రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 2016లో ప్రవేశపెట్టిన ఫ్లెక్సీ–ఫేర్ విధానంలో రైల్వే మార్పులు చేయడంతో కొన్ని రైళ్లలో చార్జీలు తగ్గనున్నాయి. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని 15 రైళ్లలో పూర్తిగా, మరో 32 రైళ్లలో ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్ నెలల్లో మాత్రమే రైల్వే శాఖ రద్దు చేసింది. ఆ మూడు నెలల్లో ఈ 32 రైళ్లలో రద్దీ తక్కువగా ఉంటున్నందునే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫ్లెక్సీ–ఫేర్ విధానం అమలయ్యే మిగతా రైళ్లలోనూ గరిష్ట చార్జీని ప్రస్తుతం ఉన్న 1.5 రెట్ల నుంచి 1.4 రెట్లకు తగ్గించింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ ఫ్లెక్సీ–ఫేర్ విధానం కారణంగా ప్రతి పది శాతం సీట్లు బుక్ అయ్యే కొద్దీ చార్జీ 10 పెరుగుతూ పోతుంది. అలా సాధారణ చార్జీతో పోలిస్తే గరిష్టంగా 1.5 రెట్ల వరకు చార్జీలను పెంచేవారు. తాజా నిర్ణయంతో చార్జీలు 1.4 రెట్ల వరకే పెరుగుతాయి. ఫ్లెక్సీ–ఫేర్ విధానం వల్ల రైల్వేకు ఆదాయం పెరిగింది కానీ ప్రయాణికుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిందనీ ఈ ఏడాది జూలైలోనే రైల్వేపై కాగ్ మొట్టికాయలు వేశారు. దీంతో ఫ్లెక్సీ–ఫేర్‌లో తాజా మార్పులు జరిగాయి. ఈ మార్పుల కారణంగా చార్జీలు తగ్గుతున్నాయి కాబట్టి మరింత ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కడం ద్వారా అధిక ఆదాయాన్ని సాధిస్తామని రైల్వే మంత్రి గోయల్ చెప్పారు. ఫ్లెక్సీ–ఫేర్ విధానం పూర్తిగా రద్దయిన వాటిలో చెన్నై–మదురై దురంతో రైలు ఉండగా.. ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్ నెలల్లో మాత్రమే ఈ విధానం రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్–పుణె శతాబ్ది, సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ శతాబ్ది, సికింద్రాబాద్–ముంబై దురంతో, చెన్నై సెంట్రల్–కోయంబత్తూర్ శతాబ్ది తదితర రైళ్లున్నాయి. -
ఫ్లెక్సీ ఫేర్ బాదుడు నుంచి ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని, దురంతో, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ స్కీమ్ కింద భారీ టిక్కెట్ ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రైలు ప్రయాణీకులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ చార్జీలపై ప్రభుత్వం ప్రయాణీకులకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునే వారితో పాటు రైళ్లు బయలుదేరే 4 రోజుల ముందుగా బుక్ చేసుకున్న వారికి 100కు పైగా ప్రీమియం రైళ్లలో డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా 40 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ టికెట్లపై 20 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. రైల్వే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించే నూతన చార్జీల స్కీమ్‌ను సార్వత్రిక ఎన్నికల ముందుగా ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఫ్లెక్సీ ఫేర్ విధానంతో పలు రూట్లలో రైల్వే చార్జీలు విమాన చార్జీల కంటే అధికంగా ఉన్నాయని కాగ్ ఆక్షేపించిన క్రమంలో ప్రభుత్వం నూతన చార్జీలపై దృష్టిసారించిందని సమాచారం. -
గుడ్‌న్యూస్ : ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయ్!
రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు కిందకి దిగొచ్చాయి. ఆహార పదార్థాలపై జీఎస్టీ ఛార్జీలను తగ్గించడంతో టిక్కెట్ ధరలు కూడా కిందకి దిగొచ్చినట్టు తెలిసింది. సోమవారం నుంచి రైళ్లు, ప్లాట్‌ఫామ్ వద్ద విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకుల ధరలను ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తగ్గించింది. దీంతో మీల్స్ ధరలు కలిసి ఉండే ప్రీమియం రైళ్ల టిక్కెట్ ధరలు కూడా తగ్గాయి. జీఎస్టీ రేటును తగ్గించడంతోనే ఆహార పదార్థాల ధరలు తగ్గించామని ఐఆర్సీటీసీ తెలిపింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకులన్నింటిపై కూడా ఒకేవిధమైన జీఎస్టీ రేటు 5 శాతాన్ని విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకముందు ఈ రేటు 18 శాతంగా ఉండేది. ఈ రేటును 18 శాతం నుంచి 5 శాతం తగ్గించడంతో, ప్రీమియం రైళ్ల టిక్కెట్ ధరలు ఒక్కో టిక్కెట్‌పై రూ.40 నుంచి రూ.60 మధ్యలో దిగొచ్చాయి. రైల్వే లైసెన్సులతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశీయ రైల్వే మొబైల్, స్టాటిక్ కేటరింగ్‌కు పలు రేట్లను అమలు చేస్తోంది. జీఎస్టీ రేటు తగ్గింపుతో, ఐఆర్సీటీసీ అధికారిక లైసెన్సీలు అమ్మాల్సిన ఆహార పదార్థాల ధరలు ఈ విధంగా ఉన్నాయి.. చికెన్ బిర్యానీ ప్లేటుకు 89 రూపాయలు, అంతకముందు రూ.100 ఎగ్ బిర్యానీ ప్లేటుకు 61 రూపాయలు, అంతకముందు రూ.69 మసాలా దోశ ప్లేటుకు 18 రూపాయలు, అంతకముందు రూ.21 సూప్‌లు, వెజ్ నూడుల్స్, రైస్ పదార్థాలకు రైల్వే ప్రయాణికులు రూ.2 నుంచి రూ.4 తగ్గనుంది. జీఎస్టీ మినహాయింపు ఉన్న టీ, కాఫీ, రైల్వే నీర్, స్టాండర్డ్ బ్రేక్‌ఫాస్ట్, ఎకానమీ మీల్స్ వంటి వాటి ధరల్లో మార్పు లేదు. -
షాకింగ్ : పెరగనున్న రైలు చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు పెరుగుతున్న ఖర్చులకు దీటుగా ప్రయాణీకులపై చార్జీల భారం మోపనున్నాయి. నష్టాలను తగ్గించుకునే క్రమంలో నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలను సమీక్షించాలని పార్లమెంట్లో సమర్పించిన కాగ్ నివేదిక సూచించింది. రైల్వేలు నిర్వహణా వ్యయాన్ని అధిగమించలేకపోతున్నాయని 2016, మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సమర్పించిన ఈ నివేదిక పేర్కొంది. 2015-16లో రైల్వేలకు ప్రయాణీకులు, ఇతర కోచింగ్ సేవలపై రూ 36,283 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. 2015-16లో రైల్వేల మొత్తం ఆదాయం కేవలం 4.57 శాతం మాత్రమే పెరిగిందని ఇది 2011-15 వరకూ సాధించిన 14.86 శాతం వృద్ధి కంటే చాలా తక్కువని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘రైల్వేలు నష్టాలను తగ్గించుకునే క్రమంలో ప్రయాణీకుల చార్జీలను దశలవారీగా సవరించాల్సిన అవసరం ఉంద’ ని నివేదిక స్పష్టం చేసింది. రైల్వేల ఆర్థిక పరిస్థితి..ప్రస్తుత మార్కెట్ తీరుతెన్నులతో పాటు నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను నిర్ణయించాలని పేర్కొంది. ప్రయాణీకుల సేవలపై నష్టాలను కేవలం ఏసీ ఫస్ట్‌క్లాస్, ఫస్ట్‌క్లాస్, ఏసీ 2-టయర్‌పైనే రికవరీ చేయాలనుకోవడం సరైంది కాదని తెలిపింది. -
రైల్వే ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రయాణీకులకు నూతన సంవత్సర కానుక అందజేసింది. రైల్వే ఛార్జీలను పెంచే ఆలోచనేది లేదని రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం శుభవార్త అందించింది. రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహేన్ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇవాల్టి లోక్‌సభ సమావేశాల్లో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజన్ గోహెన్ లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ తీపి కబురు అందించారు. చార్జీలను పెంచబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానిమిస్తూ "ప్రస్తుతం ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదు" అని ఆయన చెప్పారు . ఏటికేడాది రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-నవంబరు 2017 నాటికి ప్రయాణీకుల రవాణాలో 0.68 శాతం పెరుగుదలను, ఢిల్లీ, ముంబైల మధ్య 0.99 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమాలకు, పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుందన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు నడుపుతున్న ఈ ప్రత్యేక రైలు సర్వీసుల్లో బేసిక్ ఛార్జీలపై వివిధ స్థాయిల్లో 10 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిమాండ్‌కు అనుగుణంగా నడుపుతున్న సువిధ రైళ్లలోని ఛార్జీలు సైతం తత్కాల్ ఛార్జీల మాదిరిగానే ఉంటున్నాయని తెలిపారు. -
రైల్వే ‘ప్రత్యేక దోపిడీ’
- ప్రత్యేక రైళ్లు, సువిధ రైళ్ల పేర అదనపు చార్జీలు - ఫ్లెక్సీ ప్రైస్ పేరిట మరో రకం దోపిడీ - రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో చార్జీల మోత - దళారుల అక్రమార్జనకు ఊతం సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిపై రైల్వే ముప్పేట దాడి చేస్తూ.. చార్జీలు ఏ మాత్రం పెంచకుండానే దొడ్డిదారి వడ్డింపులతో నడ్డి విరుస్తోంది. పండుగొచ్చిందంటే చాలు 50 శాతం అదనపు చార్జీలతో ప్రయాణికుల నిలువుదోపిడీకి పాల్పడే ఆర్టీసీ తరహాలోనే దక్షిణమధ్య రైల్వే రంగంలోకి దిగింది. ఒకవైపు ఏడాదికిపైగా వివిధ రూట్లలో ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లలో చార్జీలను రెట్టింపు చేయగా.. ఇటీవల ‘ఫ్లెక్సీ ప్రైస్’పేరుతో రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో చార్జీల మోత మోగించింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రతి 10 శాతం బెర్తులపైన భారాన్ని పెంచేశారు. తాజాగా దసరా, దీపావళి, తిరుమల బ్రహ్మోత్సవాల పేరిట అక్టోబర్, నవంబర్ నెల ల్లో నడుపనున్న 52 ప్రత్యేక రైళ్లను సైతం వదిలి పెట్టకుండా సాధారణ చార్జీల స్థానంలో ‘తత్కాల్’ చార్జీలు విధించి అదనపు దోపిడీకి అధికారులు తెరలేపారు. దీంతో ఇప్పటి వరకు చౌకగా ఉన్న రైలు ప్రయాణం భారంగా మారింది. ప్రత్యేక రైళ్లలో తత్కాల్ చార్జీలు... తిరుమల బ్రహోత్సవం, దసరా, దీపావళి పర్వదినాల దృష్ట్యా నడిపే ప్రత్యేక రైళ్లన్నింటికీ తత్కాల్ చార్జీలు వర్తించనున్నాయి.హైదరాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-మైసూర్, సంత్రాగచ్చి(కోల్కత్తా)-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-పట్నాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ రెండవ వారం వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ‘సువిధ’ంగా దోపిడీ .... గతంలో ప్రీమియం రైళ్ల పేరుతో బెర్తుల బేరానికి దిగిన రైల్వే ఇప్పుడు ‘సువిధ’ంగా పేరు మార్చుకుంది. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు పెరిగి, బెర్తులు నిండుతున్నా కొద్దీ చార్జీలు పెరుగుతాయి. మొదట తత్కాల్‌తో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్ చార్జీ రూ.365 ఉంటుంది. కానీ సువిధ రైళ్లలో ఇది తత్కాల్ చార్జీలతో అంటే రూ.470తో మొదలవుతుంది. మొదటి 25 బెర్తుల వరకు ఈ చార్జీలు ఉంటాయి. ఆ తరువాత 26వ బెర్తు నుంచి నుంచి 50వ బెర్తు వరకు సుమారు రూ.900.. 51వ బెర్తు నుంచి 72వ బెర్తు వరకు దాదాపు రూ.1200 నుంచి రూ.1300 వరకు పెరుగుతుంది. ఇలా ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు చార్జీలు పెరుగుతాయి. రాజధాని, శతాబ్దిల్లో ఫ్లెక్సీ ప్రైస్.... ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా చార్జీల పెంపునకు రైల్వే ‘ఫ్లెక్సీ ప్రైస్’పేరుతో అదనపు దోపిడీకి తెరలేపింది. ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఫస్ట్ ఏసీ మినహా మిగతా బెర్తులలో ప్రతి 10 శాతం బెర్తులపైన 10 శాతం చొప్పున చార్జీలు పెరుగుతాయి. ఉదాహరణకు రిజర్వేషన్ కార్యాలయంలో బుకింగ్ కోసం నిరీక్షిస్తున్న మొదటి 10 మంది ప్రయాణికులు సాధారణ చార్జీలపైనే బుకింగ్ చేసుకుంటే అదే లైన్లో పడిగాపులు కాసే ఆ తరువాత 10 మంది తమ బుకింగ్లపైన 10 శాతం చార్జీలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. అలాగే 21వ ప్రయాణికుడి నుంచి 30వ ప్రయాణికుడి వరకు 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సాధారణ చార్జీలపైన 50 శాతం వరకు చార్జీలు పెంచుకునే విధానాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. కాగా ఫ్లెక్సీ ప్రైస్ దళారుల అక్రమ ద ందాకు అవకాశం కల్పిస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో టిక్కెట్లు బుక్ చేసి ప్రయాణికులకు అధికధరలకు విక్రయించే దళారులకు ఫ్లెక్సీ ప్రైస్ మరింత లాభసాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాట్‌ఫామ్ చార్జీ పెంపు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20 కి పెంచింది. ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఇంచార్జి సీపీఆర్వో ఏకే సింగ్ తెలిపారు. సాధారణ రోజుల్లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.1.5 లక్షల ఆదాయం లభిస్తుండగా, చార్జీల పెంపు వల్ల రోజుకు రూ.5 లక్షల ఆదాయం రానుంది. -
రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు
హైదరాబాద్: పండుగ రద్దీ పేరుతో రైల్వే శాఖ కూడా ప్రయాణికుడిపై బాదుడు షురూ చేసింది. దసరా, దీపావళి సందర్భంగా సెలవుల దృష్ట్యా రైల్వేశాఖ అదనపు చార్జీల పేరుతో ప్రయాణికుడిపై ముప్పేట దాడికి పాల్పడుతోంది. ఈ పండుగల ఎఫెక్ట్‌తో దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్‌ఫాం టికెట్ ధర ఇప్పుడు రూ.20కు పెంచింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ ఈ పెంపు అమల్లో ఉంటుంది. ఇక పండగొచ్చిందంటే చాలు.. రైల్వేశాఖ రెట్టింపు అదనపు చార్జీలతో ప్రయాణికులను వీరబాదుడు బాదుతోంది. ఒకవైపు ఏడాదికి పైగా వివిధ రూట్లలో ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లలో చార్జీలను రెట్టింపు చేయగా, ఇటీవల ‘ఫ్లెక్సీ ప్రైస్’ పేరుతో రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో చార్జీల మోత మోగించారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రతి 10 శాతం బెర్తులపైన భారాన్ని పెంచేశారు. తాజాగా దసరా, దీపావళి, తిరుమల బ్రహ్మోత్సవాల పేరిట అక్టోబర్, నవంబర్ నెల ల్లో నడుపనున్న 52 ప్రత్యేక రైళ్లను సైతం వదిలి పెట్టకుండా సాధారణ చార్జీల స్థానంలో ’తత్కాల్‘ చార్జీలు విధించి అదనపు దోపిడీకి తెరలేపారు. ప్రయివేట్ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం భారంగా భావించే సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులు తక్కువ చార్జీలతో రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. కానీ, రకరకాల పేర్లతో రైల్వే సైతం ప్రయాణికులపై దోపిడీ పర్వం కొనసాగిస్తోంది. దీంతో ఇప్పటి వరకు చౌకగా ఉన్న రైలు ప్రయాణం సైతం భారంగా మారింది. ప్రత్యేక రైళ్లలో తత్కాల్ చార్జీలు తిరుమల బ్రహోత్సవం, దసరా, దీపావళి పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ మేరకు 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ, ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ తత్కాల్ చార్జీలు వర్తించనున్నాయి. హైదరాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-మైసూర్, సంత్రాగచ్చి (కోల్‌కతా) -సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ మధ్య, సికింద్రాబాద్- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ రెండో వారం వరకు ఇవి నడుస్తాయి. దీంతోపాటు సెలవుల దృష్ట్యా రద్దీ ఉండే మార్గాల్లో 53 ‘సువిధ’ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. దీంతో ప్రయాణికులపై సాధారణ చార్జీలపైన రెట్టింపు భారం పడనుంది. ఈ రైళ్లను విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్‌లో మార్గాల్లో వేసవి సెలవుల సందర్భంగా ఏప్రిల్, మే, జూన్ నెల ల్లో నడుపనున్నారు. తత్కాల్‌తో మొదలై రెండున్నర రెట్లు అధికం... గతంలో ప్రీమియం రైళ్ల పేరుతో బెర్తుల బేరానికి దిగిన రైల్వే ఇప్పుడు ‘సువిధ’గా పేరు మార్చుకుంది. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ,నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు పెరిగి, బెర్తులు నిండుతున్న కొద్దీ చార్జీలు పెరుగుతాయి. మొదట తత్కాల్‌తో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్ చార్జీ రూ.365 ఉంటుంది. కానీ, సువిధ రైళ్లలో ఇది తత్కాల్ చార్జీలతో అంటే రూ.470తో మొదలవుతుంది. మొదటి 25 బెర్తుల వరకు ఈ చార్జీలు ఉంటాయి. ఆ తరువాత 26వ బెర్తు నుంచి నుంచి 50వ బెర్తు వరకు రెట్టింపవుతాయి. అంటే ఈ చార్జీ రూ.900 వరకు ఉంటుంది. 51వ బెర్తు నుంచి 72వ బెర్తు వరకు రెట్టింపు కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది రూ.1200 నుంచి రూ.1300 వరకు పెరుగుతుంది. ఇలా ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు చార్జీలు అనూహ్యంగా పెరుగుతాయి. అలా బెర్తులు తగ్గిన కొద్దీ చార్జీలు రెట్టింపవుతాయి. విమానాల్లో ఈ తరహా డైనమిక్ చార్జీలు ఉన్నప్పటికీ ప్రయాణికుల డిమాండ్ లేకపోతే చార్జీలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కానీ, రైళ్లలో అలా కాదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొనే ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తారు. కాబట్టి ఇంక తగ్గించే ప్రసక్తే ఉండదు. క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. -
డిమాండ్‌ను బట్టి రైలు చార్జీల మోత
శతాబ్ది, రాజధాని, దురంతో టికెట్ల ధరలకు రెక్కలు! న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.500 కోట్ల ఆదాయమే లక్ష్యంగా రైల్వే శాఖ రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్ల టికెట్ ధరలను అమాంతం పెంచనుంది. 10 నుంచి 50 శాతం వరకు ధరలు పెరగొచ్చు. ఈ రైళ్లలోని రెండో తరగతి, మూడో తరగతి ఏసీ, చైర్ కార్ కోచ్‌లలో, దురంతో రైళ్లలోని స్లీపర్ క్లాస్‌లలో ఈ కొత్త ధరలను అమలుచేయనున్నారు. దళారులను అడ్డుకునేందుకు ఈ పద్ధతిని సెప్టెంబర్ 9 నుంచి ప్రయోగాత్మకంగా తెస్తున్నామని రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ తెలిపారు. 3-4 నెలల తర్వాత ధరలను సమీక్షించనున్నారు. మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను సాధారణ ధరలకు విక్రయిస్తారు. ఆ తర్వాత ప్రతీ పదిశాతం సీట్ల ధరలను పదిశాతం చొప్పున పెంచుతూ మొత్తం బెర్తుల్లో సగం బెర్తులను ఇలా అధిక ధరలకు విక్రయిస్తారు. దీంతో సెకండ్ ఏసీ, చైర్ కార్ ధరలు 59 శాతం, థర్డ్ ఏసీ ధరలు 40 శాతం పెరిగే వీలుంది. పౌరవిమానయాన రంగంలో అమల్లో ఉన్న వినూత్న ధరల విధానాన్ని ఇలా రైల్వేల్లో అమలుచేయనున్నారు. ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలు, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్, కేటరింగ్, సర్వీస్ చార్జీల్లో మార్పు లేదు. 42 రాజధాని, 46 శతాబ్ది, 54 దురంతో రైళ్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ముంబై రాజధాని రైల్లో థర్డ్ ఏసీ టికెట్ సాధారణ ధర రూ.1628 ఉంటే అది 10శాతం ఎక్కువతో రూ.1791, 50శాతం ఎక్కువతో రూ.2,279కు చేరనుంది. -
సిమెంట్ రేట్లు పెరుగుతాయ్!
రైల్వేలు బొగ్గు రవాణా చార్జీలను పెంచడంతో సిమెంటు రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీల పెంపు కారణంగా సిమెంటు పరిశ్రమపై రూ.2,000 కోట్లకు పైగానే ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఈ భారాన్ని వినియోగదారులపైనే వేయాల్సి వస్తుందని వారు అంటున్నారు. బొగ్గు రవాణా టారిఫ్‌లలో రైల్వే శాఖ గత వారం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ దూరం రవాణా టారిఫ్‌లను కొంత తగ్గించి.. తక్కువ దూరానికి సంబంధించిన టారిఫ్‌లను పెంచింది. అంతేకాకుండా 100 కిలోమీటర్లకు మించిన బొగ్గు రవాణాపై లోడింగ్, అన్‌లోడింగ్‌కు టన్నుకు రూ.110 చొప్పున కోల్ టెర్మినల్ సర్‌చార్జీని కూడా విధించింది. రైల్వేల తాజా టారిఫ్ పెంపు వల్ల సిమెంటు పరిశ్రమ ఉత్పాదక వ్యయం పెరిగేందుకు దారితీస్తుంది. మరోపక్క, విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. ఈ రెంటింటి కారణంగా పరిశ్రమపై రూ.2,000 కోట్ల భారం ఉంటుందని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని కంపెనీలు భరించడం కష్టమే. ఫలితంగా సిమెంటు ధరలు పెరిగే అవకాశం ఉంది’ అని సిమెంటు తయారీదార్ల అసోసియేషన్(సీఎంఏ) ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. -
రైలు చార్జీలను తగ్గించాల్సిందే
లక్నో: సామాన్య ప్రజలపై పెను భారం మోపేలా మోడీ సర్కారు రైలు చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ధర్నాలు, రైల్‌రోకోలు కొనసాగాయి. పెంచిన చార్జీలను తగ్గించాల్సిందేనంటూ విపక్షాలు రెండో రోజూ రోడ్డెక్కాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు పలు కూడళ్లలో ధర్నాలు నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు మూడు గంటలపాటు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక మోడీ నియంత లా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ అర్విందర్‌సింగ్ దుయ్యబట్టారు. మోడీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, చేదు మాత్రలు ఢిల్లీవాసులతోపాటు యావత్ దేశ ప్రజలకు చేటు చేయనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ప్రయాణ చార్జీల పెంపుతోపాటు సరుకు రవాణా చార్జీలను సైతం 6.5 శాతం పెంచడం వల్ల బొగ్గు సహా ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై మరింత భారం మోపుతాయన్నారు. అందువల్ల పెంచిన చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పలు జిల్లాల్లో రైళ్లను నిలిపేశారు. ఫలితంగా రాజధాని ఎక్స్‌ప్రెస్, బాగ్ ఎక్స్‌ప్రెస్, జనాయక్ ఎక్స్‌ప్రెస్, నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా పలు గూడ్సు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా, చార్జీల పెంపును ఖండిస్తూ ముంబై కాంగ్రెస్ ఆదివారం తీర్మానం చేసింది. ఈ నెల 24న ముంబైలో భారీ స్థాయిలో నిరసనలు చేపడతామని తెలిపింది. ప్రభుత్వ చర్యకు నిరసనగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాణిక్‌రావు ఠాక్రే సోమవారం ముంబైలో టికెట్ లేకుండా ప్రయాణి స్తానన్నారు. చార్జీల పెంపు అనివార్యం: గడ్కారీ రైలు ప్రయాణ, సరుకు రవాణా చార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నా ప్రభుత్వం మాత్రం తమ చర్యను గట్టిగా సమర్థించుకుంటోంది. రైల్వేశాఖ చవిచూస్తున్న నష్టాల నేపథ్యంలో సంస్థ మనుగడకు చార్జీల పెంపు అనివార్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చార్జీల పెంపు నిర్ణయం గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్నదేనని గుర్తుచేశారు. దేశాభివృద్ధి దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ సైతం గత యూపీఏ సర్కారు నిర్ణయాన్నే తాము అమలు చేశామని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. -
కఠినమే అయినా కరెక్ట్: జైట్లీ
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమర్థించారు. చార్జీల హెచ్చింపు నిర్ణయం కఠినమైనదైనా, అది సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. కఠినమే అయినా, చార్జీల హెచ్చింపుపై రైల్వే మంత్రి సరైన నిర్ణయమే తీసుకున్నారని జైట్లీ అన్నారు. కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న రైల్వేలు కోలుకునేందుకు చార్జీల పెంపు తప్ప గత్యంతరం లేదన్నారు. రైల్వే చార్జీల పెంపు వెనుక అసలు నిజం పేరుతో సోషల్ వెబ్సైట్ ఫేస్బుక్లో జైట్లీ ఒక వివరణను పొందుపరిచారు. రైల్వే బోర్డు గత ఫిబ్రవరి 5న యూపీఏ హయాంలోనే చార్జీల పెంపుపై ప్రతిపాదన చేసిందని జైట్లీ ఫేస్బుక్లో పేర్కొన్నారు. కాగా, రైల్వే చార్జీల పెంపును సమర్థిస్తూ అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జైట్లీ వ్యాఖ్యలు అహంకారంతో కూడుకున్నవని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. అది ఒత్తిళ్లమధ్య తీసుకున్న నిర్ణయం..కల్రాజ్ తీవ్రమైన ఒత్తిళ్లమధ్య తప్పనిసరి పరిస్థితుల్లోనే, రైలు చార్జీలపెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా అన్నారు. అయితే, చార్జీల హెచ్చింపువల్ల తలెత్తే ద్రవ్యోల్బణం సమస్యకు ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం చూస్తుందని చెప్పారు. ప్రగతికోసం కఠిన నిర్ణయాలు..వెంకయ్య ైరైల్వే చార్జీల పెంపును మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా సమర్థించారు. ప్రస్తుతం రెల్వేల పరిస్థితి అంత బాగాలేదని, నిధులు, వనరుల కొరత నెలకొందని ఆయన చెన్నైలో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రతిపాదించిన రైలుమార్గాలు నిర్మించాలంటే కనీసం 40ఏళ్లు పడుతుందన్నారు. అయితే దేశం ప్రగతికోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. -
చార్జీలు పెంచడం కఠిన నిర్ణయమే..అయినా అదే సరైనది:జైట్లీ
న్యూఢిల్లీ. రైల్వే ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమర్థించారు. చార్జీల హెచ్చింపు నిర్ణయం కఠినమైనదైనా, అది సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. కఠినమే అయినా, చార్జీల హెచ్చింపుపై రైల్వే మంత్రి సరైన నిర్ణయమే తీసుకున్నారని జైట్లీ అన్నారు. రైలు ప్రయాణ సదుపాయాన్ని పొందేవారు అందుకు తగిన చార్జీ చెల్లించినపుడే రైల్వేల మనుగడ సాద్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న రైల్వేలు కోలుకోవాలంటే చార్జీల హెచ్చింపు తప్ప మరో గత్యంతరలేదని జైట్లీ అన్నారు. రైల్వే చార్జీల పెంపు వెనుక అసలు నిజం పేరుతో సోషల్ వెబ్సైట్ ఫేస్బుక్లో జైట్లీ ఒక వివరణను పొందుపరిచారు. రైల్వే బోర్డు గత ఫిబ్రవరి 5న యూపీఏ హయాంలోనే చార్జీల పెంపుపై ప్రతిపాదన చేసిందని జైట్లీ ఫేస్బుక్లో పేర్కొన్నారు. -
పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్సీపీ
రైల్వే ఛార్జీల పెంపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో, అసలు ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా రైల్వే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రయాణికులపై భారీ మొత్తంలో భారం మోపారని, అలాగే సరుకు రవాణా ఛార్జీలు కూడా పెంచి రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. -
కొత్త రైలు ఛార్జీలు ఇవీ...
పెరిగిన రైలు ఛార్జీలు ఈనెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా పెరిగే రైలు ఛార్జీలు ఇలా ఉండబోతున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్-తిరుపతి మధ్య స్లీపర్ ఛార్జీ ప్రస్తుత ధర రూ.355 ఉండగా, పెరిగిన ధర రూ.385 కాబోతోంది. అలాగే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్-తిరుపతి స్లీపర్ ప్రస్తుత ధర రూ.365 ఉండగా, పెరిగిన ధర రూ.420 అవుతుంది. (చదవండి: రైలు ప్రయాణం మరింత భారం) గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్-విశాఖపట్నం మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.335 కాగా, పెరిగిన ధర రూ.405 అవనుంది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం-బెంగళూరు మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.435 ఉండగా పెంపు అనంతరం అది రూ.495 కానుంది. -
రైలు ప్రయాణాలు ఇక భారం
-
రైలు ప్రయాణాలు ఇక భారం
అందరూ అనుకున్నట్లుగానే రైలు ఛార్జీలు పెరిగాయి. ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం చొప్పున, సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ వస్తుండటం, అలాగే రైల్వే మంత్రి సదానంద గౌడ కూడా రైలు ఛార్జీల పెంపు గురించి ప్రస్తావిస్తుండటం తెలిసిందే. అందుకు అనుగుణంగానే రైలు ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు తక్షణం అమలులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల ఛార్జీలు ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడూ పెరగలేదు. అటు రవాణాతో పాటు ఇటు ప్రయాణికుల ఛార్జీలను కూడా భారీగా పెంచారు. ప్రధానంగా డీజిల్ ధరలు గణనీయంగా పెరగడం, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో ఛార్జీల పెంపు తప్పలేదని అంటున్నారు. గతంలో రైలు ఛార్జీలను పెంచినప్పుడు ఏకంగా తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రితో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా కూడా చేయించారు. ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాగా.. రైల్వే బోర్డు ప్రతిపాదించిన మేరకు సరిగ్గా అంతే శాతం చొప్పున ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాను 6.5 శాతం చొప్పున పెంచడం గమనార్హం. దీంతోపాటు రైల్వేలలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు కూడా పచ్చజెండా ఊపాలని సదానందగౌడ భావిస్తున్నట్లు తెలిసింది. -
ఇక రైల్వే చార్జీల బాదుడు
న్యూఢిల్లీ: సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ ప్రజలపై వడ్డనకు సిద్ధమవుతోంది. రైలు చార్జీలను పెంచడానికి కసరత్తు మొదలుపెట్టింది. చార్జీల పెంపుతో పాటు రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) పచ్చజెండా ఊపాలని భావిస్తోంది. చార్జీల పెంపు, ఎఫ్‌డీఐలపై రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నట్టు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాపై 6.5 శాతం మేర చార్జీలు పెంచాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను రెండు రోజుల్లో సదానందగౌడ ప్రధాని మోడీ ముందుంచనున్నారు. జూలై రెండో వారంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే వీటిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రైల్వే అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలకు అనుమతివ్వాలని భావిస్తున్నట్టు సదానందగౌడ తెలిపారు.ఎఫ్‌డీఐల వల్ల హైస్పీడ్ రైళ్లు, రైల్వే స్టేషన్లు అభివ ృద్ధి చెందుతాయన్నారు. -
దండిగాం రోడ్డు వరకూ రైల్‌బస్
సాలూరు రూరల్,న్యూస్‌లైన్ : సాలూరు ప్రాంత ప్రజల కల మరి కొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చనుంది. పెరుగుతున్న ఆర్టీసీ బస్సు చార్జీల నేపథ్యంలో రైల్వే చార్జీలు తక్కువగా ఉండడంతో రైల్‌బస్‌లో ప్రయాణించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బొబ్బిలి-సాలూరు మధ్య నడుస్తున్న రైల్‌బస్‌ను దండిగాం రోడ్డు వరకూ పొడిగించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. మక్కువ బైపాస్ రోడ్డు మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దండిగాం రోడ్డు వరకు రైల్‌బస్‌ను నడిపితే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. సాలూరు పట్టణానికి దగ్గరగా ఉన్న దండిగాం రోడ్డు వరకు రైల్వేట్రాక్ ఉంది. రైల్‌బస్‌ను పొడిగించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఇంద్రసేన్‌కు లేఖ రాశారు. ఇందుకు వారి స్పందించి రైల్‌బస్‌ను పొడిగించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర వద్ద ఫోన్లో ప్రస్తావించగా సాలూరు ప్రజలు సౌకర్యార్థం రైల్‌బస్‌ను పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారని, రైల్వే జీఎం నుంచి లేఖ తనకు వచ్చిందని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే సంబందిత పనులు చేపట్టనున్నట్టు లేఖలో పేర్కొన్నారన్నారు. సర్వత్రాహర్షం రైల్ బస్ సేవలను వినియోగించుకోవాలని సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సాలూరు పరిసర ప్రాంత వాసులకు విషయం తెలియడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. సాలూరు నుంచి బొబ్బిలికి ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే 15 రూపాయలు చార్జీ వసూళు చేస్తున్నారని, అదే రైల్‌బస్‌లో వెళితే కేవలం 5 రూపాయలు సరిపోతుందని చెబుతున్నారు. -
రైలు చార్జీల పెంపు కూత?
ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం: మంత్రి ఖర్గే న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఏసీ)ను అనుసరించి చార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని మంత్రి గురువారం నాడిక్కడ చెప్పారు. సంస్థ వ్యయం, మార్కెట్ పరిస్థితులకనుగుణంగా ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా రుసుములపై ప్రతీ ఆర్నెల్లకోసారి సమీక్షించాలని రైల్వే యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కల ప్రకారం వచ్చే ఆర్నెల్లలో ఇంధనం, ఇతర ఉత్పత్తి వ్యయం పెంపు దృష్ట్యా రైల్వే రూ. 1,200 కోట్ల భారం భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రయాణికుల సేవలపై ప్రభుత్వం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ ఇప్పటికే రూ. 26,000 కోట్లు దాటింది. సరుకు రవాణా రుసుం గత ఏప్రిల్ నుంచి ఎఫ్ఏసీ ఆధారంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. ఈ ఏడాది జనవరిలోనే ప్రయాణికుల చార్జీలను పునఃసమీక్షించాల్సి ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోలేదు. ఇంధన ధరల పెంపుతో పడుతున్న రూ. 850 కోట్ల అదనపు భారాన్నీ రైల్వేనే భరిస్తోంది.