
చార్జీలు పెంచడం కఠిన నిర్ణయమే..అయినా అదే సరైనది:జైట్లీ
న్యూఢిల్లీ. రైల్వే ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమర్థించారు. చార్జీల హెచ్చింపు నిర్ణయం కఠినమైనదైనా, అది సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. కఠినమే అయినా, చార్జీల హెచ్చింపుపై రైల్వే మంత్రి సరైన నిర్ణయమే తీసుకున్నారని జైట్లీ అన్నారు. రైలు ప్రయాణ సదుపాయాన్ని పొందేవారు అందుకు తగిన చార్జీ చెల్లించినపుడే రైల్వేల మనుగడ సాద్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
గత కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న రైల్వేలు కోలుకోవాలంటే చార్జీల హెచ్చింపు తప్ప మరో గత్యంతరలేదని జైట్లీ అన్నారు. రైల్వే చార్జీల పెంపు వెనుక అసలు నిజం పేరుతో సోషల్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో జైట్లీ ఒక వివరణను పొందుపరిచారు. రైల్వే బోర్డు గత ఫిబ్రవరి 5న యూపీఏ హయాంలోనే చార్జీల పెంపుపై ప్రతిపాదన చేసిందని జైట్లీ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.