ఉభయసభల్లో మోడీనే సారథి
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియామకం
పార్టీ ఉపనేతలుగా లోక్‌సభలో రాజ్‌నాథ్, రాజ్యసభలో జైట్లీ
ప్రభుత్వ చీఫ్ విప్‌గా వెంకయ్యనాయుడు
కొత్త కమిటీలో చోటు దక్కని ఏపీ, తెలంగాణ ఎంపీలు
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ పక్షనేతగా ప్రధాని నరేంద్ర మోడీ నియమితుడయ్యారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ తాజా పునర్వ్యవస్థీకరణ తర్వాత లోక్‌సభలో పార్టీ ఉపనేతగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో ఉపనేతగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నియమితులయ్యారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కమిటీ మొత్తం 27 మంది సభ్యులతో ఏర్పాటైందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక్కరు బీజేపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, కమిటీలో వారెవ్వరికీ చోటు దక్కలేదు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం.వెంకయ్యనాయుడు, పార్లమెంటులో ప్రభుత్వం తరఫున చీఫ్ విప్‌గా నియమితులయ్యారు.
లోక్‌సభలో డిప్యూటీ చీఫ్ విప్‌గా పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్, రాజ్యసభలో డిప్యూటీ చీఫ్‌విప్‌గా సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేకర్ నియమితులయ్యారు. లోక్‌సభలో విప్‌లుగా 13మందిని, రాజ్యసభలో విప్‌లుగా ముగ్గురిని నియమించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా అర్జున్ రామ్ మేఘవాల్(రాజస్థాన్), రాజ్యసభలో చీఫ్ విప్‌గా అవినాశ్‌రాయ్‌ఖన్నా (పంజాబ్ ) నియమితులయ్యారు. లోక్‌సభలో కార్యదర్శిగా గణేశ్ సింగ్ (మధ్యప్రదేశ్