నరేంద్ర మోడీ
ఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. ఉభయసభల్లో ఆయనే నాయకుడిగా కొనసాగుతారు. లోక్‌సభలో ఉప నాయకుడిగా కేంద్ర హొం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో ఉప నాయకుడిగా ఆర్థి మంత్రి అరుణ్ జైట్లీ ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుని ఎంపిక చేశారు.
లోక్‌సభలో బీజేపీ చీఫ్‌విప్‌గా అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉంటారు. రాజ్యసభలో బీజేపీ చీఫ్‌విప్‌గా అవినాష్ రాయ్ ఖన్నా ఉంటారు.