పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్సీపీ | ysrcp slams hike of train fares | Sakshi
Sakshi News home page

పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్సీపీ

Published Fri, Jun 20 2014 7:37 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్సీపీ - Sakshi

పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్సీపీ

రైల్వే ఛార్జీల పెంపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో, అసలు ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా రైల్వే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

ప్రయాణికులపై భారీ మొత్తంలో భారం మోపారని, అలాగే సరుకు రవాణా ఛార్జీలు కూడా పెంచి రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని ఉమ్మారెడ్డి  వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement