train fares
-
రైల్వే ప్రయాణికులకు తీపి కబురు
Indian Railways Revert Ticket Prices: రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు తీపి కబురు అందించింది భారత రైల్వే శాఖ. కరోనా-లాక్డౌన్ తర్వాత ‘స్పెషల్’ పేరిట రైళ్లు నడుపుతూ టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే కదా. అయితే ప్రయాణికుల ఒత్తిడి మేరకు ఆ ధరలను పాత రేట్లకే సవరించింది. కరోనాకు ముందు ఉన్న టికెట్ రేట్లను తక్షణం అమలులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం హడావిడిగా ఆదేశాలు జారీ చేసింది భారత రైల్వే శాఖ. అంతేకాదు కొవిడ్ స్పెషల్ ట్యాగులను సైతం రైళ్లకు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ వర్తింపు ఉంటుందని తెలిపింది. అయితే పండుగ పూట నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లకు మాత్రం ఈ సవరణ వర్తించదని స్పష్టం చేసింది. అంతేకాదు పూర్థిస్తాయిలో రైళ్లను నడిపించేందుకు (గతంలో నడిచే 1700 రైళ్లు) సైతం రైల్వే శాఖ సిద్ధమైంది. కరోనా ప్రభావంతో రైల్వే వ్యవస్థ కొన్ని నెలలపాటు బంద్కాగా, భారత రైల్వే శాఖ ఆదాయం దారుణంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత కొన్ని రైళ్లను(ఆల్రెడీ ఉన్న సర్వీసులనే) స్పెషల్ ట్రెయిన్స్ పేరుతో దాదాపు అన్ని రూట్లలో నడుపుతూ.. అన్ని కేటగిరీల సిట్టింగ్‌లను.. ‘రిజర్వేషన్’ కింద మార్చేసి టికెట్ రేట్లను పెంచేసింది. దీంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు.. టికెట్ రేట్లను సవరించాలంటూ అన్ని జోనల్ రైల్వేస్‌కు సూచించింది రైల్వే బోర్డు. అయితే హడావిడిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాన్ని మాత్రం పేర్కొనపోకపోవడంతో గందరగోళం నెలకొనగా.. ఒకటి రెండు రోజుల్లో ఇది అమలులోకి వస్తుందని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే రాబోయే రోజుల్లో జనరల్ టికెట్లకు ‘క్యూ’ సిస్టమ్ ఉంటుందా? లేదంటే పూర్తిస్థాయి ఆన్లైన్ జారీనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక ప్యాసింజర్‌సెగ్మెంట్ కంటే ట్రాన్స్పోర్టర్ ద్వారా రైల్వే శాఖ ఆదాయం (113 శాతం) పెరగడం విశేషం. -
మళ్లీ రైలు చార్జీల మోత!
న్యూఢిల్లీ: రైలు ప్రయాణ చార్జీలు మరోసారి పెరగనున్నాయి. పెరుగుతున్న విద్యుత్ చార్జీల భారాన్ని ప్రయాణికులపై వేస్తూ, చార్జీల హెచ్చింపుతో రూపొందించిన ప్రతిపాదనలను వచ్చే సంవత్సరం ఆరంభంలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో పొందుపరచనున్నారు. అలాగే, ఇంధన ధరల హెచ్చింపునకు అనుగుణంగా డిసెంబర్లో అమలు కావలసిన చార్జీల సవరణను కూడా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇటీవల గత కొన్ని నెలల్లో విద్యుత్ చార్జీలు 4 శాతంపైగా పెరిగినందున రైలు ప్రయాణ చార్జీలను కూడా పెంచవలసిన అవసరం ఏర్పడిందని రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. రైల్వేలపై ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విధానం ప్రకారం ఇంధనం, విద్యుత్ చార్జీలకు అనుగుణంగా రైలు ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీల సవరణ ఏడాదికి రెండుసార్లు అమలవుతూ వస్తోంది. -
గౌడ బండి కూత పెట్టేనా ?
- నేడు రైల్వే బడ్జెట్ - గుంతకల్లు డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా? - అందరి చూపు పెండింగ్ ప్రాజెక్టులపైనే గుంతకల్లు టౌన్ :రైల్వే బడ్జెట్ అనగానే సాధారణంగా ప్రజలకు అమితమైన ఆసక్తి ఉంటుంది. రైలు చార్జీలు పెరుగుతాయా లేక తగ్గుతాయా, తమ ప్రాంతానికి కొత్త ప్రాజెక్టులేవైనా వస్తాయని అని ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారి కూడా గుంతకల్లు డివిజన్ ప్రజల్లో అలాంటి ఆసక్తే నెలకొంది. డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా అని ఎదురుచూస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ సొంత రాష్ట్రం కర్ణాటక కావడం, గుంతకల్లు డివిజన్ పరిధిలో ఆ రాష్ట్రంలోని ప్రాంతాలు కూడా కొన్ని ఉండటంతో ఈసారి డివిజన్‌కు ఎంతోకొంత మేలు జరిగే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులపైన అందరి దృష్టి ఉంది. వాటిని పూర్తి చేయడం కోసం ఏమేరకు నిధులు కేటాయిస్తారోనని అటు రైల్వే డివిజన్ అధికారులు, ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పట్లో వాటికి నిధులు కేటాయించకపోవడంతో ముందుకు సాగలేదు. రూ.100 కోట్లతో గుంతకల్లులో విద్యుత్ లోకోషెడ్డు నిర్మాణం, నంచర్ల- మద్దికెర బైపాస్ లైన్, గుత్తి డీజిల్‌షెడ్డులో డబ్ల్యూడీజీ-4 పనులు, నంద్యాల- గాజులపల్లి, రామలింగపల్లి-నందిపల్లి, కృష్ణమ్మ కోన వద్ద క్రాసింగ్ స్టేషన్లు వంటివి పెండింగ్‌లో ఉండిపోయాయి. -
సిలిండర్‌పై వడ్డింపు వాయిదా!
సాక్షి, మంచిర్యాల : ‘బండ’ బాదుడుకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. గృహ సిలిండర్ ఒక్కో దానిపై రూ.5 చొప్పున పెంచాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు మౌఖిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.17,13,500 భారం తప్పినట్లయింది. కేంద్ర ప్రభుత్వం గద్దెనెక్కి నెల కూడా గడవకముందే పెద్ద ఎత్తున రైలు చార్జీలు పెంచడంతో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థితిగతుల రీత్యా కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే దాదాపు 14 శాతానికిగా ైరె ల్వే చార్జీలను పెంచారు. దీనిపై రాజకీయ పార్టీలతోపాటు ప్రజల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ తోపాటు పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఉంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోనూ త్వరలో ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్న ప్రభుత్వం రెండు మూడు నెలలపాటు పెంపును వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కారణాలు ఏవైనప్పటికీ ఈ నిర్ణయం ఉపశమన నాన్ని కలిగిస్తుందని గ్యాస్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నమోదిత వంటగ్యాస్ వినియోగదారులు 3,42,700 మంది ఉన్నారు. సిలిండర్‌పై రూ.5 చొప్పున పెంచి వసూలు చేస్తే నెలకు రూ.17,13,500 భారం సదరు లబ్ధిదారులపై పడేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ భారం తప్పినట్లయింది. -
యూపీఏ పాలనలో దేశం దివాళా
కేంద్ర మంత్రి సిద్ధేశ్వర్ దావణగెరె : పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, దీంతో పున శ్చేతనం చేసేందుకు పలు కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యమైందని పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి జీఎం.సిద్ధేశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలో జన సంపర్క కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైలు చార్జీల పెంపు ప్రతిపాదన గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారే చేపట్టిందని, దాన్ని ఇప్పుడు అమలు చేశామన్నారు. రైల్వే ప్రయాణ ధరల పెంపు అనివార్యమైందన్నారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం, భద్రత, సౌకర్యాల కల్పన కోసం ఈ ధరల పెంపుదల అనివార్యమైందన్నారు. దేశ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ రైతులకు మద్దతు ధరలు, ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. హరిహర-బెంగళూరు మధ్య ఇంటర్ సిటీ రైలు సౌకర్య కల్పన విషయాన్ని త్వరలోనే రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ దృష్టికి తీసుకె ళతానన్నారు. విపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ శివయోగిస్వామి మాట్లాడుతూ... ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎంపీ. రేణుకాచార్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.రామచంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి, కొండజ్జి జయప్రకాశ్, యశవంతరావ్ జాదవ్ పాల్గొన్నారు. -
ఎంఎంటీఎస్ ప్రయాణమూ భారమే..
నెలవారీ, క్వార్టర్లీ పాస్‌లపై చార్జీల పెంపు పెరిగిన చార్జీలు 25వ తేదీ నుంచి అమలు సాక్షి,సిటీబ్యూరో: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇప్పటి వరకు అతి తక్కువ చార్జీల్లో లభించిన ఎంఎంటీఎస్ ప్రయాణం ఇక ప్రియంగా మారనుంది. అన్ని రకాల రైల్వే చార్జీలతో పాటు ఎంఎంటీఎస్, లోకల్ రైలు చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సామాన్య ప్రయాణికులు వినియోగించే సెకెండ్ క్లాస్ చార్జీలను 15 కిలోమీటర్ల వరకు యదాతథంగా ఉంచారు. 16 నుంచి 20 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు ఉన్న రూ.5 కు బదులు ఇక నుంచి రూ.10 చార్జీ ఉంటుంది. ఆ తరువాత 21 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు చార్జీల్లో మార్పు లేదు. ప్రస్తుతం ఉన్నట్లుగానే రూ.10 చార్జీ ఉంటుంది. ఇక మధ్యతరగతి, ఆ పై వర్గాలు వినియోగించే ఫస్ట్‌క్లాస్ చార్జీలు 5 కిలోమీటర్ల కనీస దూరానికి రూ.45 నుంచి రూ.50 కి పెరిగాయి. 40 కిలోమీటర్ల గరిష్ట దూరానికి రూ. 135 నుంచి రూ.150 కి పెరిగాయి. అలాగే నెలవారీ సెకెండ్‌క్లాస్ నెలవారీ పాస్ ప్రస్తుతం కనీస దూరానికి రూ.130 కాగా, ఇక నుంచి రూ.225కు పెరగనుంది. అలాగే ఫస్ట్‌క్లాస్ పాస్ రూ.445 నుంచి రూ.935 కు పెరుగనుంది. ప్రతి రోజు జంటనగరాల్లోని వివిధ మార్గాల్లో 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణిస్తున్న సుమారు లక్షా 70 వేల మంది ఎంఎంటీఎస్ ప్రయాణికులపైన చార్జీల భారం పడనుంది. రైల్వేచార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తన స్వభావాన్ని చాటుకుందని ప్రయాణికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రత మరచి చార్జీలు పెంచారు రైళ్లలో ప్రయాణించాలంటేనే భయమేస్తోంది. అసాంఘిక శక్తులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. స్టేషన్లలోనూ, రైళ్లలోనూ ఎక్కడా ప్రయాణికులకు భద్రత లేదు. ప్రయాణికులకు కనీస సదుపాయాలను కూడా అందజేయలేని ప్రభుత్వం రైల్వే చార్జీలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచేసింది. ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. - నూర్, సబర్బన్ బస్,రైల్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఫస్ట్‌క్లాస్ చార్జీలు బాగా పెంచారు ఎంఎంటీఎస్ రైళ్లలో ఫస్ట్‌క్లాస్ చార్జీలు బాగా పెంచారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే సర్‌చార్జీల పేరిట ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇక కొత్తగా పెరుగనున్న చార్జీలు మరింత భారం కానున్నాయి. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చార్జీలను తగ్గించాలి. - ప్రవీణ్ సింగ్, ఎంఎంటీఎస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి లాభార్జన కోసమే ప్రజా రవాణా సదుపాయాన్ని అందజేయవలసిన బాధ్యత నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. తరచుగా పెంచుతున్న చార్జీలను చూస్తోంటే రైల్వే సైతం ఒక ప్రైవేట్ ఆపరేటర్‌గా మారుతోందని అర్ధమవుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. గతేడాది జనవరిలో పెంచారు. ప్రస్తుతం మరోసారి చార్జీలు పెంచారు. రానున్న రైల్వే బడ్జెట్లో మరోసారి చార్జీలు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. - గణేశ్, ప్రయాణికుడు -
సామాన్యుడిపై ఎన్డీయే మొదటి దెబ్బ
తిరుపతి కార్పొరేషన్ : రైలు చార్జీలు భారీగా పెంచడం ద్వారా సామాన్యుడిపై ఎన్డీఏ ప్రభుత్వం మొదటి దెబ్బ వేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయే అధికారం చేపట్టి నెలకూడా కాకముందే సామాన్యులపై రైలు చార్జీల భారం మోపడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ప్రధానంగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వీరికి రైల్వే చార్జీలు భారంగా మారన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఒక్కొక్కరు రైల్వే ప్రయాణ చార్జీల్లో రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా భారం మోయాల్సి ఉంటుంది. ఆ రకంగా తిరుమల శ్రీవారి దర్శణానికి వచ్చే నలుగురు సభ్యులుండే ఒక్కో కుటుంబం సరాసరి రూ.1000 రూపాయలు అదనపు భారం పడనుంది. ఏటా తిరుపతి కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్న లక్షలాది మంది భక్తులకు ఒక రకంగా పెరిగిన చార్జీలు భరించలేని భారమే. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, కోయంబత్తూరు, ముంబాయి వంటి ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులకు కూడా రైలు చార్జీల పెంపు చుక్కలు చూపించనున్నాయి. నెల కూడా కాలేదు... మాది మధ్య తరగతి కుటుంబం. తిరుపతికి వచ్చి సంతోషంగా శ్రీవారిని దర్శించుకున్నాం. రైల్వే చార్జీలు భారీగా పెంచడం తో ఆ సంతోషం మాయమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చి నెల కూడా కాకనే చార్జీలు పెంచడం మంచిది కాదు. - బి.భాస్కర్, ప్రయాణికుడు, సిరిసిల్ల సామాన్యులంటే చులకన కేంద్రంలోకి ఏప్రభుత్వం వచ్చినా వారికి సామాన్య ప్రజల సంక్షేమం పట్టదు. చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతి సామాన్యుడు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చార్జీలు 14 శాతం పెంచితే ఎలా ప్రయాణించాలి. - వెంకటేశ్, ప్రయాణికుడు, బెంగళూరు చార్జీలు పెంపు దారుణం రైలు చార్జీలు భారీగా పెంచడం మా లాంటి వారికి చాలా ఇబ్బంది కర మే. ఇప్పటికే బస్సు ప్రయాణా లు పూర్తిగా మానేసిన మాకు ఇప్పుడు రైలు ప్రయాణం కూడా భారంగా మారనుంది. సామాన్యుడి దృష్టిలో ఉంచుకోకుండా చార్జీలను పెంచడం దారుణం. -లక్ష్మీనారాయణ, గుంటూరు ఇక ప్రయాణం చేయలేం ఇప్పటికే సామాన్య ప్రజలు బస్సు ప్రయాణం అంటే ఆమడ దూరంలో ఉన్నారు. ఇప్పుడు రైలు చార్జీలు పెంచడం వలన ప్రయాణం అంటే మానుకోవాల్సి వస్తోంది. కుటుంబంతో కలసి ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది. పెంచిన చార్జీలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. - పద్మావతి, ప్రయాణికురాలు, విజయవాడ పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలి.... మోడీ సర్కారు పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలి. ఒక్కసారిగా 14 శాతం చార్జీలు పెంచడంతో సామాన్యుడిపై భారం పడుతుంది. అధిక శాతం ప్రయాణికులు రైల్వే మార్గం ద్వారానే గమ్యం చేరుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని చార్జీలు తగ్గించాలి. - మిద్దెలహరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ కన్వీనర్, జిల్లా ఆప్కో డెరైక్టర్ ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం..... నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే ప్రతి సామాన్యుడుకి మేలు జరుగుతుంద ని బీజేపీకి పట్టం కట్టారు. అయితే సామాన్యప్రజలకు అనుకూలంగా ఉన్న రైలు ప్ర యాణాన్ని మరచి ఒక్కసారిగా భారీ మొ త్తంలో చార్జీలు పెంచడం దారుణం. వెంటనే తగ్గించ కుంటే ఉద్యమాలు తప్పవు. -సిరాజ్ బాషా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీల కార్యదర్శి -
చార్జ్
ప్రజలకు బీజేపీ ప్రభుత్వ కానుక రైలు చార్జీలు పెంచుతూ నిర్ణయం సరకు చార్జీలనూ వదల్లేదు ప్రయూణికులపై అదనపు భారమే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్ ప్రజలపై భారాల బండ వేయడం మొదలుపెట్టింది.మొదటి మెట్టుగా రైల్వే చార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. సరకు రవాణా చార్జీలతో పాటు స్లీపర్ క్లాస్, ఏసీ టికెట్ రేట్లను పెంచడంతో రైల్వే ప్రయూణికులు ఆందోళనలో మునిగిపోయూరు. సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా గడవకముందే ఎన్డీఏ సర్కార్ ప్రజలపై పన్నుల దాడి చేస్తోంది. తాజాగా రైలు ప్రయాణికులపై పన్నుల భారం మోపింది. ధరలను, చార్జీలను నియంత్రిస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన బీజేపీ ఇప్పుడు చార్జీల మోత మోగించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనతోనే అతలాకుతలం అవుతున్న సీమాంధ్ర ప్రాంత సగటు ప్రయాణికుడు పెరిగిన చార్జీలను చూసి కంగుతింటున్నారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉండవని, పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు పోదామని భావిస్తున్న ఈ ప్రాంతవాసులకు పెరిగిన రైల్వే చార్జీలు భారమే అవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. బస్సు చార్జీలతో పోల్చితే రైలు చార్జీలు తక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాలతో పాటు ఉన్నత వర్గాలు రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు వీటి రేటు పెంచడంతో వారి గుండెలో రాయి పడినట్టయియంది. 25 నుంచి అమల్లోకి.. పెరిగిన రైలు చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలపై 14.2 శాతం చార్జీల మోతమోగే అవకాశం ఉంది. సరకు రవాణా చార్జీలు 6.5 శాతం పెంచారు. ఈ భారం ప్రజలపై పరోక్షంగా పడనుంది. చార్జీల పెరుగుదల విషయానికి వస్తే.. స్లీపర్ క్లాస్ అయితే 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు రూ.30 నుంచి రూ.50 మేర చార్జీ పెంచారు. ఏసీ త్రీటైర్, టు టైర్ రూ.50 నుంచి రూ.100 మధ్య పెరిగింది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్‌పై పెరిగిన చార్జీల రేట్లను రైళ్లలో టీటీఈలు వసూలుచేస్తారని రైల్వే అధికారులు చెప్పారు. చార్జీల పెంపు ఇలా.. సరకు రవాణా చార్జీలు : 6.5 శాతం స్లీపర్ క్లాస్ (300-500 కిలోమీటర్ల మధ్య) : రూ.30-రూ.50 ఏసీ త్రీటైర్, టు టైర్ : రూ.50- రూ.100 మధ్య -
రైలు మోత..
ఈ నెల 25నుంచి పెరగనున్న రైళ్ల ప్రయాణ చార్జీలు రెట్టింపైన సీజన్ టికెట్ల ధరలు జిల్లాలో పదివేలమందిపై పడనున్న ప్రభావం సామాన్యుడిపై మొదలైన వడ్డన 2013-14 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదన మేరకు అమలు సంగడిగుంట(గుంటూరు) రైలు చార్జీలు పెరగనున్నాయి. అన్నివర్గాలవారిపైనా భారం పడనుంది. ఇటు ప్రయాణచార్జీలు, అటు రవాణా చార్జీలు పెరుగుతుండటంతో నిత్యావసర సరకుల దరలు పెరిగి సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ప్రధాన రవాణా మార్గంగా ఉన్న రైలు ప్రయాణం ఇక ప్రియం కానుంది. ఈ నెల 25వ తేదీనుంచి పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపైనా పెంచిన ఛార్జీల భారం పడనుంది. గుంటూరు నుంచి మాచర్లకు బస్సులో వెళ్ళాలంటే 80 నుంచి 90 రూపాయలు ఛార్జీ అవుతుంది. అదే ప్యాసింజరు రైల్లో అయితే కేవలం 25 రూపాయలే ఉండటంతో అందరూ దానిపైనే ఆధారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం వీటి చార్జీలు పెరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ టికెట్లూ భారమే... జిల్లాలో దాదాపు 8వేల నుంచి పదివేల మంది ఉద్యోగులు, వ్యాపారులు సీజన్ టికెట్లు కొనుగోలు చేసుకుని నిర్థిష్ట ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై వీటి ధరలూ భారీగానే పెరగనున్నాయి. ఇప్పటివరకూ 15రోజుల ఛార్జీని లెక్కగట్టి మూడునెలలకు సీజన్ టికెట్‌గా అందిస్తుండేవారు. ఇది కాస్తా 30 రోజులకు లెక్కగట్టి రెట్టింపవనుంది. అదే విధంగా లగేజీ రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల రవాణాపై తీవ్ర రైలు మోత..ప్రభావం పడి వాటి ధరలు పెరగనున్నాయి. అన్ని తరగతులపైనా 14.2శాతం పెంపుదల 2013-14 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన మేరకు అన్ని తరగతులపైనా 14.2శాతం ధరలు పెరగనున్నాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు. పెరగనున్న ధరలు ఈ నెల 25నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న టికెట్లపై పెరిగిన చార్జీల ప్రకారం అదనపు సొమ్మును రిజర్వేషన్ కౌంటర్లలో గానీ, రైలులో ప్రయాణించే సమయంలోగానీ వసూలు చేస్తారని వివరించారు. ప్రతి స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు పెరిగిన ఛార్టీల వివరాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా సరకు రవాణా విషయంలో 2003 నుంచి అమలులో ఉన్న కనీస దూరం 100 కిలోమీటర్లనుంచి 125 కిలోమీటర్లకు పెంచారని పేర్కొన్నారు. వంద కిలోమీటర్ల లోపు రవాణా చార్జీ రాయితీని ఉపసంహరించారనీ, నాలుగు వర్గీకరణలుగా ఉన్న లో రేటెడ్ కేటగిరీలను మూడుకు కుదించి ఎల్ఆర్ 4 ను తొలగించారని వివరించారు -
పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్సీపీ
రైల్వే ఛార్జీల పెంపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో, అసలు ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా రైల్వే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రయాణికులపై భారీ మొత్తంలో భారం మోపారని, అలాగే సరుకు రవాణా ఛార్జీలు కూడా పెంచి రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. -
కొత్త రైలు ఛార్జీలు ఇవీ...
పెరిగిన రైలు ఛార్జీలు ఈనెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా పెరిగే రైలు ఛార్జీలు ఇలా ఉండబోతున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్-తిరుపతి మధ్య స్లీపర్ ఛార్జీ ప్రస్తుత ధర రూ.355 ఉండగా, పెరిగిన ధర రూ.385 కాబోతోంది. అలాగే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్-తిరుపతి స్లీపర్ ప్రస్తుత ధర రూ.365 ఉండగా, పెరిగిన ధర రూ.420 అవుతుంది. (చదవండి: రైలు ప్రయాణం మరింత భారం) గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్-విశాఖపట్నం మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.335 కాగా, పెరిగిన ధర రూ.405 అవనుంది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం-బెంగళూరు మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.435 ఉండగా పెంపు అనంతరం అది రూ.495 కానుంది. -
రైలు ప్రయాణాలు ఇక భారం
-
రైలు ప్రయాణాలు ఇక భారం
అందరూ అనుకున్నట్లుగానే రైలు ఛార్జీలు పెరిగాయి. ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం చొప్పున, సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ వస్తుండటం, అలాగే రైల్వే మంత్రి సదానంద గౌడ కూడా రైలు ఛార్జీల పెంపు గురించి ప్రస్తావిస్తుండటం తెలిసిందే. అందుకు అనుగుణంగానే రైలు ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు తక్షణం అమలులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల ఛార్జీలు ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడూ పెరగలేదు. అటు రవాణాతో పాటు ఇటు ప్రయాణికుల ఛార్జీలను కూడా భారీగా పెంచారు. ప్రధానంగా డీజిల్ ధరలు గణనీయంగా పెరగడం, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో ఛార్జీల పెంపు తప్పలేదని అంటున్నారు. గతంలో రైలు ఛార్జీలను పెంచినప్పుడు ఏకంగా తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రితో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా కూడా చేయించారు. ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాగా.. రైల్వే బోర్డు ప్రతిపాదించిన మేరకు సరిగ్గా అంతే శాతం చొప్పున ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాను 6.5 శాతం చొప్పున పెంచడం గమనార్హం. దీంతోపాటు రైల్వేలలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు కూడా పచ్చజెండా ఊపాలని సదానందగౌడ భావిస్తున్నట్లు తెలిసింది.