సామాన్యుడిపై ఎన్డీయే మొదటి దెబ్బ | Further, the first blow to the NDA | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై ఎన్డీయే మొదటి దెబ్బ

Published Sat, Jun 21 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

సామాన్యుడిపై ఎన్డీయే మొదటి దెబ్బ

సామాన్యుడిపై ఎన్డీయే మొదటి దెబ్బ

తిరుపతి కార్పొరేషన్ :  రైలు చార్జీలు భారీగా పెంచడం ద్వారా సామాన్యుడిపై ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి దెబ్బ వేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌డీయే అధికారం చేపట్టి నెలకూడా కాకముందే సామాన్యులపై రైలు చార్జీల భారం మోపడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ప్రధానంగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు.

దేశం నలుమూలల నుంచి వచ్చే వీరికి రైల్వే చార్జీలు భారంగా మారన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఒక్కొక్కరు రైల్వే ప్రయాణ చార్జీల్లో రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా భారం మోయాల్సి ఉంటుంది. ఆ రకంగా తిరుమల శ్రీవారి దర్శణానికి వచ్చే నలుగురు సభ్యులుండే ఒక్కో కుటుంబం సరాసరి రూ.1000 రూపాయలు అదనపు భారం పడనుంది.
 
ఏటా తిరుపతి కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్న లక్షలాది మంది భక్తులకు ఒక రకంగా పెరిగిన చార్జీలు భరించలేని భారమే. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, కోయంబత్తూరు, ముంబాయి వంటి ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులకు కూడా రైలు చార్జీల పెంపు చుక్కలు చూపించనున్నాయి.
 
 నెల కూడా కాలేదు...
 మాది మధ్య తరగతి కుటుంబం. తిరుపతికి వచ్చి సంతోషంగా శ్రీవారిని దర్శించుకున్నాం. రైల్వే చార్జీలు భారీగా పెంచడం తో ఆ సంతోషం మాయమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చి నెల కూడా కాకనే చార్జీలు పెంచడం మంచిది కాదు.
- బి.భాస్కర్, ప్రయాణికుడు, సిరిసిల్ల
 
 సామాన్యులంటే చులకన
 కేంద్రంలోకి ఏప్రభుత్వం వచ్చినా వారికి సామాన్య ప్రజల సంక్షేమం పట్టదు. చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతి సామాన్యుడు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చార్జీలు 14 శాతం పెంచితే ఎలా ప్రయాణించాలి.
 - వెంకటేశ్, ప్రయాణికుడు, బెంగళూరు
 
 చార్జీలు పెంపు దారుణం
 రైలు చార్జీలు భారీగా పెంచడం మా లాంటి వారికి చాలా ఇబ్బంది కర మే. ఇప్పటికే బస్సు ప్రయాణా లు పూర్తిగా మానేసిన మాకు ఇప్పుడు రైలు ప్రయాణం కూడా భారంగా మారనుంది. సామాన్యుడి దృష్టిలో ఉంచుకోకుండా చార్జీలను పెంచడం దారుణం.
 -లక్ష్మీనారాయణ,  గుంటూరు
 
 ఇక ప్రయాణం చేయలేం
 ఇప్పటికే సామాన్య ప్రజలు బస్సు ప్రయాణం అంటే ఆమడ దూరంలో ఉన్నారు. ఇప్పుడు రైలు చార్జీలు పెంచడం వలన ప్రయాణం అంటే మానుకోవాల్సి వస్తోంది. కుటుంబంతో కలసి ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది. పెంచిన చార్జీలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
 - పద్మావతి, ప్రయాణికురాలు, విజయవాడ
 
 పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలి....
 మోడీ సర్కారు పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలి.  ఒక్కసారిగా 14 శాతం చార్జీలు పెంచడంతో సామాన్యుడిపై భారం పడుతుంది. అధిక శాతం ప్రయాణికులు రైల్వే మార్గం ద్వారానే గమ్యం చేరుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని చార్జీలు తగ్గించాలి.
  - మిద్దెలహరి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ కన్వీనర్, జిల్లా ఆప్కో డెరైక్టర్
 
 ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం.....
 నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే ప్రతి సామాన్యుడుకి మేలు జరుగుతుంద ని బీజేపీకి పట్టం కట్టారు. అయితే సామాన్యప్రజలకు అనుకూలంగా ఉన్న రైలు ప్ర యాణాన్ని మరచి ఒక్కసారిగా భారీ మొ త్తంలో చార్జీలు పెంచడం దారుణం. వెంటనే తగ్గించ కుంటే ఉద్యమాలు తప్పవు.
 -సిరాజ్ బాషా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీల కార్యదర్శి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement