పెరిగిన రైలు ఛార్జీలు ఈనెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా పెరిగే రైలు ఛార్జీలు ఇలా ఉండబోతున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్-తిరుపతి మధ్య స్లీపర్ ఛార్జీ ప్రస్తుత ధర రూ.355 ఉండగా, పెరిగిన ధర రూ.385 కాబోతోంది. అలాగే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్-తిరుపతి స్లీపర్ ప్రస్తుత ధర రూ.365 ఉండగా, పెరిగిన ధర రూ.420 అవుతుంది. (చదవండి: రైలు ప్రయాణం మరింత భారం)
గోదావరి ఎక్స్‌ప్రెస్లో హైదరాబాద్-విశాఖపట్నం మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.335 కాగా, పెరిగిన ధర రూ.405 అవనుంది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్లో విశాఖపట్నం-బెంగళూరు మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.435 ఉండగా పెంపు అనంతరం అది రూ.495 కానుంది.
కొత్త రైలు ఛార్జీలు ఇవీ...
Published Fri, Jun 20 2014 6:40 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement