న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా జేపీ నద్దా (జగత్ ప్రసాద్ నద్దా) ఎన్నికయ్యే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఆయన నరేంద్ర మోడీతోనూ, ఇతర బిజెపి నేతలతోనూ సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ను మోడీ మంత్రివర్గంలోకి తీసుకుని హోం లేదా ఇతర కీలక శాఖ అప్పగిస్తారని సమాచారం. దాంతో ఆయన స్థానంలో జేపీ నద్దా బీజేపీ పగ్గాలు చేపట్టే అవకాశముందంటున్నారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నద్దా తొలుత ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించారు. పదేళ్లకు పైగా వివిధ స్థాయిల్లో విద్యార్థి నేతగా పనిచేశారు. ఆ తర్వాత బిజెపిలో చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్నారు. కాగా నద్దా నియామకంపై బీజేపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నద్దా!
Published Sat, May 24 2014 1:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement