'బాబుకు లాభం చేకూర్చినవారికే రాజ్యసభ సీట్లు' | Ponnam prabhakar takes on chandra babu naidu due to rajya sabha elections | Sakshi
Sakshi News home page

'బాబుకు లాభం చేకూర్చినవారికే రాజ్యసభ సీట్లు'

Published Tue, Jan 28 2014 12:30 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

'బాబుకు లాభం చేకూర్చినవారికే రాజ్యసభ సీట్లు' - Sakshi

'బాబుకు లాభం చేకూర్చినవారికే రాజ్యసభ సీట్లు'

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు వ్యక్తిగతంగా లాభం చేకూర్చిన వారికే రాజ్యసభ సీట్లు కట్టబెడుతున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ టీడీపీ ఫోరానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ ఎన్నికల బరిలో నిలపాలని ఆ ప్రాంత నేతలను ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబు నిలబెట్టిన గరికపాటి మోహన్ రావును ఓడించాలని తెలంగాణ టీడీపీ ఫోరానికి సూచించారు.


ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని గరికపాటి మోహన్ రావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీతామహాలక్ష్మిని రాజ్యసభ అభ్యర్థులుగా చంద్రబాబు నిన్న ఉదయం నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement