
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో దత్తాత్రేయ, చిరంజీవి డప్పు కొడుతూ అందరినీ ఉత్సాహపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment