హైరదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
► బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు.
► బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు.
Hyderabad: 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
Published Mon, Jan 1 2024 7:40 AM | Last Updated on Mon, Jan 1 2024 1:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment