
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేడుకగా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జనవరి 1 నుంచి జరిగే నుమాయిష్‌కు అనుమతి ఇవ్వకూడదని న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు నేడు అఫిడవిట్‌ను సమర్పించగా దాన్ని చూసిన హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. అఫిడవిట్‌లో ఎక్కడా ప్రజల భద్రతపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడింది.
మరోసారి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నుమాయిష్ మంటల్లో చిక్కుకోగా భారీ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని హైకోర్టు సూచించింది. కాగా తెలంగాణ సచివాలయం కూల్చివేతపైనా నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. వాదోపవాదాల అనంతరం విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. చదవండి: నుమాయిష్‌కు అంతా సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment