సాక్షి, హైదరాబాద్ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్‌లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment