bathini brothers
-
చేప ప్రసాదం పంపిణీతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిట (ఫోటోలు)
-
చేప ప్రసాదం.. హుష్!
సాక్షి, హైదరాబాద్: ఆ రోజు కోసమే ఆస్తమా రోగులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. మృగశిర కార్తె అరుదెంచే అరుదైన సందర్భాన చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. ఈసారి వీరి ఆశలపై కోవిడ్ –19 నీళ్లు చల్లింది. ఆస్తమా రోగులు ఆపన్నహస్తంగా భావించే చేప ప్రసాదానికి తొలిసారిగా బ్రేక్ పడింది. 175 ఏళ్లపాటు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా రద్దు చేశారు. సోమ, మంగళవారాల్లో (ఈ నెల 8 ఉదయం 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు) చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బత్తిని హరినాథ్ గౌడ్ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వేలాదిగా తరలివచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, అంతేకాకుండా రాత్రిపూట కర్ఫ్యూ తదితర కారణాల తో చేప ప్రసాదం అందించడం దుస్సాహసమనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఇలా పంపిణీ చేసేవారు.. ప్రతి ఏడాది చేప ప్రసాదం తయారీలో భాగంగా పంపిణీకి ఒకరోజు ముందు దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ చేసేవారు. అనంతరం చేప ప్రసాదాన్ని తయారీకి ఉపక్రమించేవారు. తొలుత వీరి కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకునేవారు. ఈ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టేవారు. ఈసారి ఇవేవీ చేపట్టడంలేదు. మొదట్లో 50 కిలోలే.. మొదట్లో 50 కిలోల వరకు తయారైన చేప ప్రసాదం ఆ తర్వాత 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా.. అనంతర కాలంలో చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. అప్పట్లో మారిన వేదికలు.. ♦ బత్తిని హరినాథ్ గౌడ్ పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలోనే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు ♦ 1997లో పాతబస్తీలో జరిగిన మత కలహాల కారణంగా ఈ వేదిక నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మార్చారు. ♦ 1998లో అప్పటి ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది ♦ అనంతరం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్బంగా తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. ♦ నాటి నుంచి పోయిన ఏడాది వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే కొనసాగింది. ♦ కరోనా వైరస్ కారణంగా ఈసారి పంపిణీకి బ్రేక్ పడింది దయచేసి ఎవరూ రావొద్దు.. ప్రస్తుతం ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్న రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేప ప్రసాదం పంపిణీ సరైంది కాదని భావించాం. పంపిణీ చేపడితే ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చేప ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయం. దీని కోసం ఎవరూ రావద్దని స్పష్టం చేస్తున్నాం. – బత్తిని హరినాథ్ గౌడ్ -
వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా..
నాంపల్లి: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నగరంలో వచ్చే జూన్ 7 నుంచి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. చేప మందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారని, వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు త్వరగా కరోనా వ్యాపించవచ్చని,ఎట్టి పరిస్థితుల్లోను చేప ప్రసాదం పంపిణీకి అనుమతించవద్దని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. -
చేప ప్రసాదం @ 171 ఏళ్లు
చార్మినార్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్‌బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభమవుతుంది. కాగా.. చేప ప్రసాదానికి 171 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉంది. మొదట్లో 50 కిలోల వరకు.. మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన చేప ప్రసాదం ప్రస్తుతం 3.5 క్వింటాళ్లకు చేరిందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. మొన్నటి వరకు చేప మందుగా ప్రాచుర్యం పొందగా.. ప్రస్తుతం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడు రకాలు.. చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30,45 రోజుల్లో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నారు. రెండు గంటలకు ముందుగా.. చేప ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించరాదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేప ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా ఆహారం, నీరు తీసుకోవద్దు. బత్తిని స్వగృహంలోని బావి , పూజ అనంతరం చేప ప్రసాదం స్వీకరిస్తున్న బత్తిని హరినాథ్ గౌడ్ (ఫైల్) బత్తిని వీరన్న గౌడ్‌తో ప్రారంభం... బత్తిని వంశ పూర్వీకులైన వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ల నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్ హయాంలో చేప ప్రసాదం పంపిణీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అనంతరం మూడు తరాలుగా చేప ప్రసాదం కొనసాగుతూనే ఉంది. ఇలా ఫలితం .. ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని చేప నోటిలో పెట్టి మింగడంతో అది కదులుతూ గొంతు ద్వారా జీర్ణాశయంలోకి వెల్లి జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుందంటున్నారు. అంతేకాకుండా నేరుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతుండడంతో చేప ప్రసాదం త్వరగా రక్త ప్రసరణలో కలిసి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందంటున్నారు బత్తిని సోదరులు. అప్పట్లో అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలో పంపిణీ అయిన చేప ప్రసాదం.. 1997లో పాతబస్తీలో జరిగిన మతకలహాల కారణంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను కేటాయించింది. అనంతరం చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2012లో బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న మరో ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలా టలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా ఇక్కడే చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
చేపమందు ప్రసాదం పంపిణీ
-
చేప ప్రసాదం కోసం...ఆస్తమా బాధితులు
-
చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
చార్మినార్ : మృగశిర కార్తె సందర్భంగా ఏటా బత్తిని సోదరులు అస్తమా రోగులకు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 8.30 నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం అందిస్తామని బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో సత్యనారాయణ వ్రతం, బావి పూజ ఉంటాయని, 8వ తేదీ ఉదయం 6 గంటలకు దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదం తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ జరుగుతుందన్నారు. 170 ఏళ్ల చరిత్ర.. ఏటా ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది. శంకరయ్యగౌడ్‌కు శివరాంగౌడ్, సోమలింగం గౌడ్, విశ్వనాథం గౌడ్, హరినాథ్‌గౌడ్, ఉమామహేశ్వర్ గౌడ్ ఐదుగురు కుమారులు. ప్రస్తుతం వీరిలో శివరాంగౌడ్, సోమలింగం గౌడ్, ఉమామహేశ్వర్ గౌడ్ మృతి చెందారు. మిగతా ఇద్దరూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. -
బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ : మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ప్రతి ఏటా బత్తిన సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీని బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. 32 కేంద్రాలు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తొలుత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 1500 మందితో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఉచిత భోజన, మంచి నీటి సదుపాయం కల్పించారు. గురువారం ఉదయం 8.30 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకులు తెలిపారు. -
6 లక్షల మందికి 5 క్వింటాళ్ల చేప ప్రసాదం
చార్మినార్ : చేప ప్రసాదం పంపిణీలో భాగంగా మంగళవారం బత్తిని కుటుంబ సభ్యులు పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఏటా చేప పంపిణీ ప్రసాదానికి ముందు కుటుంబసభ్యులతో కలిసి ఈ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. పూజా కార్యక్రమాల్లో బత్తిని విశ్వనాథ్ గౌడ్, హరినాథ్ గౌడ్, శివానంద్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్, సంతోష్ గౌడ్లతో పాటు దాదాపు 250 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం తయారీ కార్యక్రమం కొనసాగింది. బుధవారం ఉదయం 4 గంటలకు పూజల అనంతరం 6.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని బత్తిని సోదరులు తెలిపారు. ఈసారి 6 లక్షల మందికి.. గతేడాది 3.5 క్వింటాళ్ల చేప ప్రసాదం పంపిణీ చేశామని... అయితే, అది చాలక పోవటంతో మరో 50 కిలోలను తయారు చేసి పంపిణీ చేసినట్లు బత్తిని గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా 5 క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని ముందుగానే తయారు చేస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 34 లైన్లను ఏర్పాటు చేసి ఒక్కో లైన్లో నలుగురు చేప మందు పంపిణీ చేయనుండగా, వారికి మరో నలుగురు సహాయకులుగా పని చేస్తారన్నారు. 24 గంటల్లో మూడు షిప్టులలో తాము ప్రజలకు చేప ప్రసాదాన్ని అందజేయనున్నామన్నారు. ఉచితంగా ఆహారం.. టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షుడు నాగ్నాథ్ మాశెట్టి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం చేప ప్రసాదం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్ సైనీ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ శ్వేత మెహంతి హాజరయ్యారు. -
చేప ప్రసాదం పంపిణీ నేడే
* నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తై ఏర్పాట్లు * పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రోగులు * 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు హైదరాబాద్: ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం రాత్రి 11 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభంకానుంది. మరుసటి రోజు (9వ తేదీ) రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె నాడు బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల ముందు నుంచే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్బోర్డ్, ఇతర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు రెండురోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి సహాయకులు చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందడిగా కనిపించింది. కాగా, చేప ప్రసాదం కోసం తరలివచ్చిన రోగులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అల్పాహారాన్ని అందించాయి. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి సోమవారం మధ్యాహ్నం లోపు చేప పిల్లలను అందుబాటులోకి తెస్తామని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దాదాపు 50 వేల చేపలు ముందుగా అందుబాటులో ఉంచుతామన్నారు. అవి అయిపోయే సమయంలో తిరిగి తెప్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, చేప ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సెంట్రల్‌జోన్‌తో పాటు నగరంలోని పలు జోన్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులను ఇక్కడ బందోబస్తు విధులకు కేటాయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నలుమూలలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రోగులకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. -
చేప ప్రసాదం రెడీ
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు నిర్వహణ కమిటీతో పాటు సంబంధిత అధికారులతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల నిల్వకు సరిపడే వాటర్ ట్యాంకులను అందుబాటులో ఉంచటంతో పాటు ప్రసాదం పంపిణీకి సరిపడే కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వికాస్‌రాజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, పోలీస్ అడిషనల్ కమిషనర్ అంజనీ కుమార్, ఫిషరీస్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ పాల్గొన్నారు.