బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం | bathini brothers starts fish medicine for asthma in exhibition grounds | Sakshi
Sakshi News home page

బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

Published Wed, Jun 8 2016 10:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

bathini brothers starts fish medicine for asthma in exhibition grounds

హైదరాబాద్ : మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ప్రతి ఏటా బత్తిన సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీని బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. 32 కేంద్రాలు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తొలుత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.

1500 మందితో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఉచిత భోజన, మంచి నీటి సదుపాయం కల్పించారు. గురువారం ఉదయం 8.30 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement