chepa prasadam
-
చేప ప్రసాదం పంపిణీతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిట (ఫోటోలు)
-
చేప ప్రసాదం: 80 వేల మందికి పైనే..
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: ఆస్తమా రోగులు ఎంతగానో ఎదురుచూసే చేప ప్రసాదం పంపిణీ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు 80 వేల మందికి చేప ప్రసాదం ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటల వరకు పంపిణీ ఉంటుందన్నారు. కాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మొదట బత్తిని కుటుంబ సభ్యుల చేపప్రసాదం పంపిణీని శుక్రవారం ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చేప ప్రసాదం వేసి ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు, సామాన్య ప్రజలు కూడా వేలాదిమంది తరలివచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పోలీస్, మత్స్యశాఖ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆర్‌ఆండ్‌బీ, వాటర్‌బోర్డు, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు పలు శాఖల ఉన్నతాధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకు ముందు దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలోనూ మొదట చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. మంత్రి స్వయం పర్యవేక్షణ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా శుక్రవారం రోజంతా పర్యవేక్షించారు. ఉదయం ప్రారంభించిన మంత్రి రాత్రి వరకు పలుమార్లు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. వాటర్‌బోర్డు, బద్రి విశాల్ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మజ్జిగ పంపిణీ చేశారు. ఇక నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, నగర కలెక్టర్ అమయ్‌కుమార్ తదితరులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం రాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 90 వేల చేప పిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాథోడ్ తెలిపారు. శనివారం ఉదయం వరకు ప్రజలకు అవసరమైనన్ని చేపపిల్లలను అందుబాటులో ఉంచామన్నారు. రాత్రంతా చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని, చేపపిల్లల విక్రయం కూడా కొనసాగుతుందన్నారు. 32 కేంద్రాల ద్వారా పంపిణీ చేప ప్రసాదాన్ని 32 కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు. బత్తిని కుటుంబానికి చెందిన 250 మంది కుటుంబ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు వాలంటీర్లుగా సేవలందించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్వినిమార్గం, మాజీ కార్యదర్శి వినయ్‌కుమార్ ముదిరాజ్తో పాటు పలువురు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చేపప్రసాదం పంపిణీకి చేయూతనందించారు. దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు. 75 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిఘా నిర్వహించారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న చేపప్రసాదం పంపిణీ
-
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం
-
రేపే చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి (ఫోటోలు)
-
చేప ప్రసాదం పంపిణీకి భారీ సన్నాహాలు (ఫొటోలు)
-
వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా..
నాంపల్లి: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నగరంలో వచ్చే జూన్ 7 నుంచి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. చేప మందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారని, వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు త్వరగా కరోనా వ్యాపించవచ్చని,ఎట్టి పరిస్థితుల్లోను చేప ప్రసాదం పంపిణీకి అనుమతించవద్దని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. -
ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. చేప ప్రసాదం కోసం ఈ రోజు 32 వేల చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ రేపు సాయంత్రం వరకూ మరో 1.28 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. 32 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు. -
చేప ప్రసాదం పంపిణీకి లైన్ క్లీయర్
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు(శనివారం) జరిగే చేప మందు ప్రసాదం పంపిణీ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడాన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రైవేటు కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని, వారికి అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు, రూ. 5 భోజనం వసతి కల్పించాలని వివరించారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు తలసాని తెలిపారు. పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అవుతామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డిలతోపాటు బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
చార్మినార్ : మృగశిర కార్తె సందర్భంగా ఏటా బత్తిని సోదరులు అస్తమా రోగులకు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 8.30 నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం అందిస్తామని బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో సత్యనారాయణ వ్రతం, బావి పూజ ఉంటాయని, 8వ తేదీ ఉదయం 6 గంటలకు దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదం తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ జరుగుతుందన్నారు. 170 ఏళ్ల చరిత్ర.. ఏటా ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది. శంకరయ్యగౌడ్‌కు శివరాంగౌడ్, సోమలింగం గౌడ్, విశ్వనాథం గౌడ్, హరినాథ్‌గౌడ్, ఉమామహేశ్వర్ గౌడ్ ఐదుగురు కుమారులు. ప్రస్తుతం వీరిలో శివరాంగౌడ్, సోమలింగం గౌడ్, ఉమామహేశ్వర్ గౌడ్ మృతి చెందారు. మిగతా ఇద్దరూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. -
1.5 లక్షల మందికి చేప ప్రసాదం
- ముగిసిన చేప ప్రసాద వితరణ - 4 ప్రత్యేక కేంద్రాల్లో ప్రసాదం నేడు, రేపు హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం బత్తిన సోదరులు చేపట్టిన చేప ప్రసాద వితరణ ముగిసింది. గురువారం ఉదయం 9 గంటలకు మృగశిర కార్తె ఆరంభాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు చేప ప్రసాదాన్ని భక్తులకు అందచేశారు. సుమారు ఒకటిన్నర లక్షల మందికి చేప ప్రసాదం అందజేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. రాత్రంతా నిర్విరామంగా 32 కౌంటర్లలో ప్రసాదాన్ని రోగులకు అందజేశారు. రాత్రి 7 గంటలకే వీఐపీ కేంద్రాలు మూసివేయడంతో కొందరు వీఐపీ పాసు కలిగిన రోగులు జనరల్ కౌంటర్లలోనే క్యూలో నిల్చోని ప్రసాదాన్ని స్వీకరించారు. అయితే, నగరంలోని కవాడీగూడ, కూకట్పల్లి, వనస్థలిపురం, దూద్‌బౌలిలో మరో రెండు రోజులపాటు చేపప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. ప్రసాదం వితరణ విజయవంతంగా ముగిసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి రోగులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు. ఐదో తరాన్ని సిద్ధం చేశాం: హరినాథ్ గౌడ్ తాము నాలుగు తరాలుగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని ఇస్తున్నామని, తాను నాల్గవ తరానికి చెందిన వాడినని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేపప్రసాదం పంపిణీకి వచ్చే తరాన్ని సంసిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ మందు ఆస్తమా ఉన్నవారికి ఒక ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ విజయవంతం: తలసాని బత్తిన సోదరులు ప్రారంభించిన చేప ప్రసాదం పంపిణీ విజయవంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నా రు. చేప ప్రసాదం పంపిణీకి సహకరించిన బత్తిన సోదరులు, జీహెచ్ఎంసీ, పోలీసులు, మెట్రో వాటర్ వర్క్స్, మెడికల్, విద్యుత్, రెవెన్యూ, ఎగ్జిబిషన్ సొసైటీ, మత్య్సశాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు రోగులకు భోజనం సౌకర్యం కల్పించినందుకు అభినందనలు తెలిపారు.