![Line Clear To Chepa Mandu Prasadam Distribution - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/7/hc_0.jpg.webp?itok=Y_JUvOZ7)
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు(శనివారం) జరిగే చేప మందు ప్రసాదం పంపిణీ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడాన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రైవేటు కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment