జీహెచ్‌ఎంసీ నివేదిక: హైకోర్టు అసంతృప్తి | High Court Unhappy Over GHMC Report On Beggars | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ నివేదిక: హైకోర్టు అసంతృప్తి

Published Thu, May 7 2020 9:44 PM | Last Updated on Thu, May 7 2020 9:48 PM

High Court Unhappy Over GHMC Report On Beggars - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాచకులను షెల్టర్‌ హోంలకు తరలించే ప్రక్రియకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇచ్చిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించాలన్న పిటీషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణను చేపట్టింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టుకు నివేదించగా.. ఎంతమందిని, ఎక్కడెక్కడికి తరలించారో అన్న వివరాలు సమగ్రంగా లేవని, ఈనెల 15లోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement