beggers
-
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ!
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ! -
యాచకులకు డబ్బులిస్తే జైలుకే.. జనవరి ఒకటి నుంచి అమలు
దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. బిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఒక ముందడుగు వేసింది.ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి ఒకటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధం విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్‌లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు.దేశంలో ఈ ప్రాజెక్ట్ 10 నగరాల్లో అమలుకానుంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండోర్‌లో ఈ ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారన్నారు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఓ ముఠా ఇక్కడికి వచ్చిందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచక రహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైనవారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనున్నదన్నారు. ఇక్కడి ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోకపోతే ఈ పథకం విజయవంతం అవదన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి తమవంతు విరాళాలు అందించారు. సాధారణంగా ఇతరుల ముందు చేతులు చాచే వీరు రామ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా అందించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)సమర్పణ్ నిధి ప్రచారంలో కాశీకి చెందిన 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. గత నవంబర్‌లో కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకుని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కాశీలో భిక్షాటన సాగించే బైద్యనాథ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నాని చెప్పాడు. అప్పటి నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తున్నానన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగున్నదని తెలుసుకుని యాచకులమంతా విరాళాలు సేకరించి అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. తాను జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా నాలుగు వేల మందికి పైగా చెప్పులు కుట్టేవారు, చాకలివారు, స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని నూతన రామాలయం కోసం విరాళంగా అందించారు. కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు. ఇది కూడా చదవండి: రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి! -
ఆ యాచకులు రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు!
పారిస్ : అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఓ అజ్ఞాత వ్యక్తి స్క్రాచ్ కార్డు ఇవ్వడంతో ఫ్రాన్స్‌లో నలుగురు యాచకులు 43 లక్షల రూపాయల విలువైన (50,000 యూరోలు) జాక్‌పాట్‌ను దక్కించుకున్నారు. బ్రెస్ట్ నగరంలో ఓ వ్యక్తి వారికి స్క్రాచ్‌కార్డు ఇవ్వడంతో ఆ లాటరీని నలుగురు యాచకులు గెలుచుకున్నారు. లాటరీ షాప్ వద్ద వీరు యాచిస్తుండగా ఓ యూరో వెచ్చించి కొనుగోలు చేసిన స్క్రాచ్ కార్డును ఓ కస్టమర్ వారికి ఇచ్చారని దీంతో లాటరీలో వారికి జాక్‌పాట్ తగిలిందని ఫ్రెంచ్ లాటరీ ఆపరేటర్ ఎఫ్‌డీజే ఓ ప్రకటనలో పేర్కొంది. లాటరీలో 50,000 యూరోలు తమను వరించాయని తెలియగానే వారు సంబరపడ్డారని, ఈ మొత్తాన్ని వారు సమంగా పంచుకున్నారని ఎఫ్‌డీజే పేర్కొంది. ఇక వర్జీనియాకు చెందిన అమెరికన్ రేమండ్ హరింగ్టన్ ఇటీవల 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేయగా అన్ని టికెట్లూ లాటరీలో గెలుపొందడం గమనార్హం. హరింగ్టన్కు మొత్తం 1,25,000 డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. చదవండి : జాక్‌పాట్ అంటే నీదే తమ్ముడు -
భిక్షగాళ్లు, కాగితాలేరుకునే వారికి ‘కోవిడ్–19’ కిట్లు
సాక్షి, మచిలీపట్నం: కరోనా మహమ్మారి.. చాపకింద నీరులా రోజుకు రోజుకు విస్తరిస్తోంది. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కర్ని గడగడ లాడిస్తోంది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, ఎలాంటి ఆధారం లేకుండా చెట్ల కింద, బస్టాండ్లలో కాలక్షేపం చేసే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కోవిడ్ బారిన వీరు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోవిడ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఆరు మాస్కులు, రెండు çసబ్బులతో కూడిన కిట్లులు అందించనుంది. నగరాలు, పట్టణాల్లో సంచ రించే వీరికి మెప్మా ద్వారా రూ.70 విలువైన కిట్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందుకోసం విజయవాడ కార్పొరేషన్‌తో సహా జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, రోడ్డుపక్క ఎలాంటి ఆధారం లేకుండా జీవిస్తున్న వార్ని ఇప్పటికే మెప్మా సహకారంతో గుర్తించారు. ఈ విధంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 997 మంది ఉన్నారు. అదే విధంగా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 230 మంది, గుడివాడ పట్టణ పరిధిలో 300 మంది, తిరువురూలో 94 మంది, జగ్గయ్యపేటలో 80 మంది, నందిగామలో 68, నూజివీడులో 60 మంది పెడనలో 58 మంది, ఉయ్యూరులో 34 మంది కలిపి మొత్తం 1991 కుటుంబాలును గుర్తించారు. రాష్ట్రంలోనే తొలిసారి బుధవారం కృష్ణా జిల్లాలో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కిట్లు పంపిణీ చేయనున్నట్లు మెప్మా పీడీ డాక్టర్ ఎన్ ప్రకాశరావు ‘సాక్షి’కి తెలిపారు. -
జీహెచ్ఎంసీ నివేదిక: హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : యాచకులను షెల్టర్ హోంలకు తరలించే ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించాలన్న పిటీషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణను చేపట్టింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టుకు నివేదించగా.. ఎంతమందిని, ఎక్కడెక్కడికి తరలించారో అన్న వివరాలు సమగ్రంగా లేవని, ఈనెల 15లోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..
‘అవ్వా, అయ్యా... ఒక్క రూపాయి దానం చెయ్యండయ్యా’ అంటూ బస్టాండ్‌లో చేయిజాపి అడుక్కునే గంగవ్వ వెనుక మూడు ప్రాణాలున్నాయి. వాళ్లే జీవితంగా బతుకుతూ, వాళ్ల ఉన్నతి కోసమే బతుకుతున్న గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే సమాధానం చెబుతాయి.కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో ప్రతి నిత్యం భిక్షాటన చేస్తూ కనిపించే గంగవ్వ వయసు 70 దాటింది. కొడుకులు కూతుళ్లు ఆదరించడం లేదేమో.. అందుకే అడుక్కుంటోందేమో అనుకుంటారంతా. కానీ, అర్ధాంతరంగా మరణించిన కొడుకు పిల్లలను ఎలాగైనా చదివించుకోవాలని ఆ భిక్షాటన చేస్తోందని ఎవరూ ఊహించరు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ ఊరి చివరన ఓ పూరిగుడిసెలో ఉంటుంది గంగవ్వ. ఇద్దరు మనవరాళ్లు, ఓమనవడు ఆమె ఆస్తి. రోజూ పొద్దున లేవగానే గిన్నె చేతిలో పట్టుకుని నాలుగిళ్లు తిరిగి అన్నం అడుక్కువచ్చి ముగ్గురి ఆకలి తీరుస్తుంది. వాళ్లను తయారు చేసి బడికి పంపి, తాను కామారెడ్డి బస్టాండ్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం వరకు డబ్బులు అడుక్కుని, ఎవరైనా దయతలచి ఏదైనా పెడితే తిని కడుపు నింపుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం ఆమె దినచర్య. వృద్ధాప్యాన ఒంటి చేత్తో.. గంగవ్వకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. గంగవ్వ పెద్ద కొడుకు సంజీవులు, కోడలు పోచవ్వలను పదేళ్లక్రితం మాయదారి రోగం మింగేసింది. అప్పుడు వాళ్ల పిల్లలు చామంతి, శ్రీకాంత్, వసంతలు పసివారు. ఆ సమయంలో మనవరాళ్లు, మనవడిని గంగవ్వ అక్కున చేర్చుకుంది. అదే సమయంలో ఆమె భర్త కూడా చనిపోవడంతో ఒక్కతే ముగ్గురు పిల్లల బాధ్యతలు తీసుకుంది. రోజూ ఉదయం అన్నం భిక్షం అడిగి పిల్లలకు తలా కొంచెం తిండి పెట్టి వారిని బడికి పంపేది. మధ్యాహ్నం పూట బడిలో భోజనం తిని ఆకలి తీర్చుకునేవారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత నానమ్మ ఏదైనా పెడితే తిని చదువుకునేవారు. రోజూ బడిలో మధ్యాహ్న భోజనంతో ఆకలి తీర్చుకునే ఆ పిల్లలు బడి సెలవులప్పుడు పూట గడవక ఇబ్బంది పడుతుంటారు. పెద్ద మనవరాలు చామంతి గతేడాది పదో తరగతి పాసైంది. ఇంటర్ చదవాలన్న ఆరాటం ఉన్నా ఆర్థిక స్తోమత లేదని ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ మధ్యనే కామారెడ్డిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వర్కర్‌గా చేరింది. ఆమెకు ఇచ్చే వేతనం రోజూ రానుపోను ఖర్చులకే సరిపోతోంది. మనవడు శ్రీకాంత్ ప్రస్తుతం కుప్రియాల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. చిన్న మనవరాలు తొమ్మిదో తరగతి చదువుతోంది. పిల్లల కోసమే బతుకుతున్న పెద్దోడు సంజీవులు, కోడలు పోచవ్వ సచ్చిపోయినప్పుడు ఈ ముగ్గురు సంటి పిల్లలు. ఆ దినం సంది వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్న. వాళ్లు పెరిగి పెద్దోళ్లైన్రు. నేను తిన్నా, తినకున్నా పిల్లల ఆకలి తీర్చేతందుకే బిచ్చం అడుక్కుంటున్న. వాళ్లు సదువుకుంటే కష్టాలు తీరుతయని సదివిస్తున్న. – కరమంచి గంగవ్వ, కుప్రియాల్ ఆమె మాటనే వినుకుంటం నాకు ఊహ తెలువకముందే అమ్మ, నాన్న చనిపోయిండ్రు. మాకు నాయినమ్మనే అన్నీ తానై చూసుకున్నది. ఇప్పటికీ ఎంతో కష్టపడుతది. అందరిలెక్క మాకు అమ్మా, నాన్న ఉంటే మంచిగుండు అనిపిస్తది. కాని ఏం చేస్తం. నాయినమ్మ మమ్ములను మంచిగ చూసుకుంటది. ఆమె చెప్పినట్టు నడుచుకుంటం. – వసంత, చిన్న మనవరాలు అమ్మ, నాయిన.. నాయినమ్మ మా అమ్మ నాయిన ఎట్లుంటరో నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. మా నాయినమ్మనే అమ్మ, నాయిన లెక్క చూసుకున్నది. ఇప్పటికీ మా కోసమే కష్టపడుతున్నది. ఈ మధ్య కామారెడ్డిలోఆక్యుప్రెజర్ వైద్యశాలలో పనిలో చేరిన. – చామంతి, పెద్ద మనవరాలు అన్నీ నాయినమ్మే... నాకు అమ్మా, నాన్న అన్నీ నాయినమ్మే. చిన్నప్పటి నుంచి నానమ్మతోనే జీవితం. నాయినమ్మ మా కోసం ఎంతో కష్టపడుతోంది. నేను బాగా చదువుకుని నానమ్మ కష్టాలు తీరుస్తా. వానొస్తే గుడిసె మొత్తం కురుస్తది. మాకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నం. – శ్రీకాంత్, మనవడు జీవితమంతా కష్టాలే... గంగవ్వ జీవితమంతా కష్టాలతోనే సాగిపోయింది. వృద్ధాప్యంలో ఆసరా అవుతారనుకున్న కొడుకులు ఒక్కొక్కరు మాయమయ్యారు. ముగ్గురు కొడుకుల్లో పెద్దోడు సంజీవులు పదేళ్ల క్రితం నయంకాని రోగంతో కన్ను మూస్తే, రెండో కొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. చిన్నోడు చిన్న వయసులోనే కనిపించకుండా పోయాడు. బతికున్నాడో లేడో కూడా తెలియదు. ఇద్దరు కూతుళ్లు.. ఎవరి కుటుంబం వారిది. కాలు చేయీ ఆడక తనకు చేసేవాళ్లు లేకపోగా, తనపైనే పెద్ద కొడుకు పిల్లలు ఆధారపడి ఉండడంతో ఆమె జీవితమంతా భిక్షాటనతోనే గడచిపోతోంది. కుప్రియాల్ గ్రామంలో ఉన్న పూరి గుడిసె భారీ వర్షాలు కురిస్తే వాన నీరంతా చేరి ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యన పైకప్పు నుంచి నీరు జారకుండా ప్లాస్టిక్ కవర్ కప్పించింది.గంగవ్వకు ఆహార భద్రతా కార్డు ద్వారా 24 కిలోల బియ్యం వస్తాయి. ముగ్గురు పిల్లలు, ఆమె నలుగురు తినాలంటే ఆ బియ్యం పదిహేను రోజులకు సరిపోవు. అంత్యోదయ కార్డు కోసం కలెక్టరేట్‌కు తిరిగినా ఎవరూ కనికరించలేదు. వృద్ధాప్య ఫించన్ నెలకు రూ.2016 వస్తోంది. రోజూ భిక్షమెత్తగా వచ్చే డబ్బులు, పింఛన్ డబ్బులతో తన మందులకు, పిల్లల చదువులకు, బట్టలకు వెచ్చిస్తోంది. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: అరుణ్ గౌడ్ -
బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ
ఒడిశా,భువనేశ్వర్: రాష్ట్రంలో బిచ్చగాళ్ల నిర్మూలనకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మేరకు బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కల్పిస్తారు. ఈ వర్గానికి జీవనోపాధి వనరులతో పునరావాసం కల్పించే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక భద్రత–దివ్యాంగుల సాధికారత విభాగం మంత్రి అశోక్ చంద్ర పండా గురువారం తెలిపారు. పూరీ పట్టణంలో జగన్నాథ మందిరం, భువనేశ్వర్‌లో లింగరాజ్ దేవస్థానాన్ని బహుముఖంగా విస్తరించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రాలుగా ఆవిష్కరించేందుకు భారీ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చకచకా పనులు చేపడుతుంది. ఈ దేవస్థానాల ప్రాంగణాల్లో బిచ్చగాళ్లకు త్వరలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి వృత్తి శిక్షణ కల్పిచండం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుర్తించింది. తొలి విడతలో పూరీ, భువనేశ్వర్ ప్రాంతాల్లో బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల్లో రహదారుల పక్కన భిక్షాటన చేసే వారిని గుర్తించి శిక్షణ కేంద్రాలకు తరలిస్తారు. శిక్షణ అనంతరం వీరు చిరు వ్యాపారం వంటి వ్యాపకాలతో జీవనం సాగించేందుకు ప్రేరణగా ఈ శిక్షణ దోహదపడుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటనను నిర్మూలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లో బిచ్చగాళ్లకు వృత్తి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. -
భిక్షగాళ్ల దీనవ్యథ : కదిలిస్తే కన్నీరే..!
మాసిన గడ్డం..ఏపుగా పెరిగిన జుట్టు.. దుర్వాసన వచ్చే దుస్తులు. కాళ్లు, చేతులకు గాయాలతో అమ్మా, అయ్యా అంటూ చేయి చాస్తూ నగరంలో సంచరించే భిక్షగాళ్లను చూస్తే కొందరు జాలి చూపి చేతిలో చిల్లర వేస్తారు..మరికొందరు చీదరించుకుంటారు.. కానీ ఆ చీదరింపు వెనుక గాయపడిన మనస్సు ఉంటుంది.. ఒకప్పుడు అందరిలా దర్జాగానే బతికిన వారే.. కానీ విధి రాతకు తలొగ్గి కడుపు నింపుకొనేందుకు చేతులు చాస్తున్నారు.. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుబడిన వారి మనోగతం వింటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.. – సాక్షి,అమరావతిబ్యూరో బంగారు లచ్చన్న విజయవాడకు చెందిన లచ్చన్న గతంలో నగరపాలక సంస్థలో వెహికల్ డిపోలో కార్మికుడిగా పనిచేశాడు. విశాఖజిల్లా గుడిచర్లకు చెందిన నాగమణితో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూమార్తె. అందరిలానే వారికి చదువులు చెప్పించి వారిని ఉన్నతంగా బతికేలా చేశారు. ముగ్గురు కొడుకులు ప్రస్తుతం వివిధ వృత్తులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కుమార్తెను బావమరిదికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. చేతికొచ్చిన పిల్లలు ఆదుకుంటారని ఆశించిన లచ్చన్నకు నిరాశే మిగిలింది. 2013లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను కొన్నేళ్లు ఇంట్లో ఉంచుకున్న బిడ్డలు ఆపై మొహం చాటేశారు. ప్రస్తుతం పక్షవాతం రావడంతో కాలు, చేయి పనిచేయడం లేదు. కర్రసాయంతో రెండేళ్లుగా భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన సతీమణి మాత్రం పుట్టింటి వారి దగ్గరే ఉంటుంది. జేమ్స్ అంథాల్ విశాఖజిల్లా రేగడ ప్రాంతానికి చెందిన వాడు. అదే ప్రాంతానికి చెందిన రాములమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆ బిడ్డలను ఉన్నతస్థాయిలో ఉంచాలని ముఫ్పై ఏళ్లు సికింద్రాబాద్‌లోని బొయినపల్లి వద్ద ఫంక్షన్ హాలులో వర్కర్‌గా పనిచేశాడు. అనుకున్నట్లే బిడ్డలను చదువులు చదివించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేశాడు. ఈయన పెద్దకుమారుడు విశాఖ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మరో అబ్బాయి పెయింటర్ వృత్తి చేసుకుంటున్నాడు. కుమార్తె చదువుకొని మంచి స్థాయిలోనే ఉంది. కానీ వారికి తండ్రి భారమయ్యాడు.రెండేళ్లుగా ఇంటిని వదిలి తమిళనాడుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. రంజిత్ తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వ్యక్తి. మెకానిక్‌గా పనిచేసే∙రంజిత్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ కలహాలతో రంజిత్ ఇంట్లో గొడవపడి గత 8 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. విజయవాడలో మెకానిక్‌గా పనిచేస్తూ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. అనారోగ్యం బారిన పడి భిక్షమెత్తుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందరిలాగానే కుటుంబంతో కలిసి దర్జాగా జీవించాల్సి ఉన్నా.. తన విధి రాత బాగా లేక దీనస్థితిలో బతుకుతున్నానంటూ బాధను వ్యక్తం చేశాడు.. పగవాడికి ఇలాంటి కష్టం రాకూడని ఆవేదన చెందాడు. -
భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేస్తాం
సాక్షి,అమరావతి బ్యూరో: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని వీఎంసీ కమిషనర్ జె.నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నవజీవన్ బాల భవన్లో విజయవాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని భిక్షగాళ్లను వీఎంసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గుర్తించిన 80 భిక్షగాళ్లను తెలంగాణకు చెందిన అమ్మ, నాన్న అనాథాశ్రయానికి అప్పగించే కార్యక్రమాన్ని కమిషనర్ నివాస్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా భిక్షగాళ్లకు బిస్కెట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన అమ్మ, నాన్న ఫౌండేషన్ భిక్షగాళ్లను, అనాథలను అక్కున చేర్చుకొనే మంచి çసంస్థ అని చెప్పారు. సంస్థకు అప్పగించే ప్రతిఒక్కరి ఫొటోలు పూర్తి వివరాలు సేకరించినట్లు వివరించారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు రేషన్ కార్డులు ఇచ్చేలా ఈ సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. భిక్షగాళ్లు్ల లేని బెజవాడగా తీర్చిదిద్దేందుకు ఇది తొలిఅడుగు అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మిగిలిన భిక్షగాళ్లను కూడా ప్రత్యేక డ్రైవ్ ద్వారా అమ్మ, నాన్న ఎన్జీవో సంస్థకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.. రాజీవ్ గాంధీ హోల్‌సేల్ మార్కెట్ తరలింపు విజయవాడ: నగరంలో రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్, పూల మార్కెట్లు వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంంలో తన చాంబర్లో హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ తరలింపునకు సహకరించాలని కోరారు. విజయవాడ– అమరావతి గేట్‌వే ప్రాజెక్ట్ కింద ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నమని వివరించారు. దీని దృష్ట్యా హోల్‌సేల్ మార్కెట్లను వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అమరావతి రాజధానికి సమీపంలో విజయవాడ కేంద్ర బిందువు అయిందన్నారు. అందు వలన వ్యాపారాలు మార్కెట్లను తరలించేందుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. సమావేశంలో కార్పొరేషన్ ఎస్టేట్ ఆఫీసర్ సి.హెచ్.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
చూపున్న కాళ్లు.. నడకనేర్పుతున్న కళ్లు !
సూర్యాపేట : నడవ లేని ఆమె కాళ్లు చూపులేని ఆయనను నడిపిస్తున్నాయి... అలాగే చూపులేని ఆయన కళ్లు ఆమెకు దారిచూపుతున్నాయి. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.. కాళ్లు లేని ఓ మహిళ మూడు చక్రాల రిక్షాపై కూర్చొని కళ్లు లేని తన భర్తసాయంతో ఆ రిక్షాను నడిపిస్తూ బతుకుబండిని లా గిస్తోంది. సూర్యాపేట పట్టణానికి చెందిన శోభ– సత్తయ్య దంపతులకు ఎవరూ లేకపోవడంతో పొట్ట కూటికోసం స్థానిక పాత శివాలయం వద్ద ఇలా యా చిస్తూ సాక్షి కెమెరాకు చిక్కారు. అయితే సత్తయ్యకు రెండు కళ్లు కన్పించవు.. శోభకు కాళ్లు కదలలేని పరిస్థితి. కాగా వీరి ప్రయాణం మాత్రం భర్త మూడు చక్రాల బండిని తోసుకుపోతుండగా.. భార్య దారి చూపుతోంది. వీరిని చూసేవారు అయ్యో పాపం అనుకుంటున్నప్పటికీ ఈ వృద్ధ దంపతుల అనోన్యతను చూసి ఆశ్చర్యపోతున్నారు. -
ఒక్క రూపాయి నాణెం రద్దు చేశారు!
రాంపూర్ : యాచకులకు ఒక్క రూపాయి నాణెంను దానంగా వేస్తున్నారా? అయితే ఇక నుంచి వాటిని వారు స్వీకరించరట. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో యాచకుల గ్రూప్ ఒక్క రూపాయి నాణెంను ఇక మీదట దానంగా అంగీకరించకూడదని నిర్ణయించింది. ఈ నాణెంను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగానే, ఇక మీదట తాము కూడా ఒక్క రూపాయి నాణెంను రద్దు చేస్తున్నామని, దీని సైజు 50 పైసల మాదిరి ఉందని యాచకుడు శుక్ర మని చెప్పాడు. ఈ కాయిన్లను తమ వద్ద నుంచి స్వీకరించవద్దని దుకాణాదారులకు, రిక్షావారిని కూడా కోరినట్టు యాచకులు చెప్పారు. ఇక నుంచి యాచకులకు ఎవరు దానం చేయాలన్న ఒక్క రూపాయి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. -
బ్రాహ్మణులు బిచ్చగాళ్లు అంటూ వ్యాఖ్యలు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ నోటి దూకుడుకు పెట్టింది పేరు. ఆయన నోట జారిన మాటలు తరచూ కలకలం రేకెత్తిస్తాయి. మనోభావాల్ని యథాతథంగా మాటల్లో వ్యక్తీకరించేందుకు మంత్రి దామోదర్ రౌత్ ఏమాత్రం సంకోచించరు. ఇదే పంథాలో బ్రాహ్మణుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ వ్యాఖ్యలకు నిరసనగా ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు నడుం బిగించింది. ఈ ఉద్యమాన్ని శ్రీ జగన్నాథుని క్షేత్రం పూరీ నుంచి ప్రారంభించారు. బ్రాహ్మణుల పట్ల మంత్రి చేసిన తేలికపాటి వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకునేంత వరకు బ్రాహ్మణ వర్గం శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఎదురుగా ముక్తి మండపం బ్రాహ్మణ మహా సభ, ఒడిశా వేదిక్ బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడిగా బుధవారం నిరసన ప్రదర్శించాయి. మంత్రి దిష్టి బొమ్మల్ని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తక్షణమే తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరకుంటే ఆందోళన అంచెలంచెలుగా ఉధృతం అవుతుందని ఈ సంఘాలు స్పష్టం చేశాయి. క్షమాపణ చెప్పేది లేదు, తప్పు చేస్తేగా: మంత్రి బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ కూడా విజృంభించారు. వీరి డిమాండుతో క్షమాపణ చెప్పేది లేనే లేదు. తప్పు చేయని పరిస్థితుల్లో క్షమాపణ కోరడం ఎందుకని మంత్రి ఎదురు తిరిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ దుమారం వెనక బాగోతం మీడియాకు వివరించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. క్షమాపణ చెప్పను. కొంత మంది స్వార్థపర రాజకీయ నాయకులు ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. శ్రీ జగన్నాథుని దేవస్థానంలో భక్తులు, యాత్రికులు, పర్యాటకుల నుంచి బ్రాహ్మణులు గుంజు తున్న వ్యవహారం ఏమి టో వివరించాలని ఎదురు దాడిని మరింతగా ప్రేరేపించారు. బ్రాహ్మణులు గుంజుతున్న ఈ సొమ్ము దేవస్థానానికి చెల్లిస్తున్న సుంకమా! ప్రత్యక్షంగా చేయి చాచి అడుక్కోవడమా! అని ప్రశ్నించారు. పూర్వాపరాలిలా ఉన్నాయి మల్కన్‌గిరి ప్రాంతం మారుమూల దళిత ప్రభావిత గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ ప్రసంగించారు. దళితుల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ వృత్తిపట్ల ప్రగాఢ అంకిత భావంతో దళితులు ఎన్నడు దేనిని యాచించరు. ఆకలితో అలమటించే భయానక పరిస్థితుల్లో కొండ కోనల్లో ప్రవహించే సెలయేటి నీటి తాగుతు ప్రాణాల్ని అర్పించేందుకైనా సిద్ధం అవుతారు కాని యాచించేందుకు(భిక్షాటన) అంగీకరించరు. బ్రాహ్మణులు మాత్రం సమయానుకూలంగా దానధర్మాల ప్రేరణతో యాచిస్తారు. హిందు ఆధ్యాత్మిక భావాల నేపథ్యంలో వీరికి దానం చేసేందుకు అంతా ముందుకు వచ్చి గౌరవిస్తారు. ఈ వ్యాఖ్య బ్రాహ్మణ వర్గంలో తీవ్ర కలకలం రేకెత్తించింది. రైతుల ఆత్మ స్థైర్యాన్ని కొనియాడుతూ బ్రాహ్మణుల యాచనని బేరీజు వేయడంతో వివాదం అలముకుంది. పంట నష్టం వగైరా సందర్భాల్లో రైతులు ఆత్మ హత్యలకు పాల్పడే సంఘటనల్ని ఆయన ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో రైతాంగం ఆత్మ హత్యలకు పాల్పడే బలహీనులు కారు. వారి గుండెల్లో ఆత్మ స్థైర్యం నిండి ఉంది. బ్రాహ్మణుల్ని కించ పరిచే యోచన రంగు పులిమి దుమారం రేపడం విచారకరం. హిందు వర్గంలో బ్రాహ్మణులది అత్యున్నత స్థానం. వారిపట్ల ప్రతి హిందువుకు గౌరవాభిమానం ఉంటుంది. ఈ సంప్రదాయం పట్ల తనకు సానుకూలత ఉందని మంత్రి వివరించారు. కష్ట పరిస్థితుల్లో రైతు వైఖరిని విషదీకరించే క్రమంలో చోటుచేసుకున్న మాటల్లో భావాన్ని వక్రీకరించి క్షమాపణ కోరమంటే కుదరని పనిగా మంత్రి తెగేసి చెప్పేశారు. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరంలో బ్రాహ్మణులు సొమ్ము గుంజుకోవడం యాచన కాకుండే సుంకం వసూలు చేయడమా! అని మంత్రి తాజా పరిస్థితుల నేపథ్యంలో వ్యాఖ్యానించారు. -
బిచ్చగాళ్లల్లో ఇద్దరు కోటీశ్వరులు
-
హైదరాబాద్‌లో రిచ్ బెగ్గర్స్..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మెహదీపట్టణంలోని ఓ దర్గా వద్ద బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు నవంబర్ 11న చర్లపల్లి ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈ బిచ్చగాళ్లలో చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఇద్దరి మహిళలను చూసి జైలు అధికారులు అవాక్కయ్యారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కోట్లకు కోట్ల ఆస్తి ఉండి.. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలని తెలుసుకోని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వివరాలు.. ఫర్జానా, రబియా బసీరా అనే మహిళలు గత కొద్దిరోజులుగా లంగర్ హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నారు. బాబా సూచనలతో.. హైదరాబాద్ ఆనంద్‌బాగ్‌కు చెందిన ఫర్జానా(50) ఏంబీఏ చదివింది. లండన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేసింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అయిన కుమారుడి దగ్గర ఉండేది. అనారోగ్యానికి గురైన ఫర్జానా. ఓ బాబాను సంప్రదించింది. వ్యాధి తగ్గాలంటే దేవుడి దయ ఉండాలని, దర్గా వద్ద భిక్షాటన చేయాలని సూచించడంతో ఈ వృత్తిని ఎంచుకుంది. తల్లిని వదిలించుకోవాలనే ఫర్జానా కొడుకు ఇలా చేశాడని జైలు అధికారులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మోసం.. రబియా బసీరాకు అమెరికా గ్రీన్ కార్డ్ కూడా ఉంది. గతంలో అమెరికాలో టీచర్‌గా కూడా పనిచేసింది. నగరంలో కోట్లకు కోట్ల ఆస్తి ఉంది. బంధువులతో కలిసి ఉండాలని హైదరాబాద్‌లోనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. తనకు అండగా ఉన్న కూతురు కూడా కన్ను మూసింది. కోడుకులు, బంధువులు మోసం చేసి ఆస్తి లాక్కొని ఒంటరిదాన్ని చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ ఇద్దరి బిచ్చగత్తెల స్టోరీ బిచ్చగాడి సినిమాను తలపిస్తోంది. -
అడుక్కుంటే ‘చిప్పకూడే’
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలోని ఓ కూడలి.. ట్రాఫిక్ సిగ్నల్ పడింది.. ఇంతలో బిచ్చగాళ్లు వచ్చారు.. బాబ్బాబ్బాబు.. అంటూ వాహనదారుల చుట్టుముట్టారు.. నగరంలోని ఏ జంక్షన్లో చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం! ఇకపై ఇలా బిచ్చమెత్తితే తీసుకెళ్లి జైల్లో పెడతారు! ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో బిచ్చమెత్తు కోవడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వాహనచోదకులు, పాద చారులకు బిచ్చగాళ్లతో తలెత్తుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి 2 నెలలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, వీటిని ఉల్లం ఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుం టామని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం నుంచి 2018 జనవరి 7 వరకు నోటిఫికేషన్ ఉపసంహరించేంత వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించిన వారిపై ఐపీసీలోని 188 సెక్షన్‌తో పాటు హైదరాబాద్ పోలీసు చట్టం, తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుం టామన్నారు. ఈ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే గరిష్టంగా నెలరోజుల జైలు లేదా రూ.200 జరిమానా లేదా రెండూ విధించే ఆస్కా రముంది. రహదారుల్లోని ప్రధాన జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడానికి కొందరు చిన్న పిల్లలు, వికలాంగులను నియమించుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. కొన్నిసార్లు బిచ్చగాళ్ల ప్రవర్తన పాదచారులు, వాహనచోదకులకు ప్రమాదహేతువులుగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 28 నుంచి మూడ్రోజులపాటు అంతర్జాతీయ వాణిజ్య సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం నగరాన్ని సుందరంగా తీర్చిది ద్దుతూ.. బిచ్చగాళ్లపైనా దృష్టి సారించింది. -
ఇవాంకా ఇక్కడికి రావొద్దు! – ఇట్లు అంజలి
అంజలి.. పోలియోతో ఒక కాలు, చేయి పడిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బిచ్చమెత్తుకుని పొట్టపోసుకుంటోంది.. ఇవాంకా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె.. మరి అక్కడెక్కడో వైట్‌హౌస్‌లో ఉండే ఇవాంకాకు.. ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద బిచ్చమెత్తుకునే అంజలికి ఏంటి లింకు? ఇంతకీ అంజలి.. ఇవాంకా హైదరాబాద్‌కు రావొద్దని ఎందుకంటోంది? సాక్షి, హైదరాబాద్: నగరంలోని యాచకులపై ఇవాంకా’ పిడుగుపడింది.. హైదరాబాద్‌లో జరుగనున్న సదస్సుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె వస్తున్నందున ‘బెగ్గర్‌ఫ్రీ యాక్ట్’ నిద్ర లేచింది.. యాచకులెవరూ రోడ్లపై కనబడకూడదని.. వారిని నగర శివార్లలోని సంక్షేమ నిలయాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సిబ్బంది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు.. యాచకులందరినీ వ్యాన్ ఎక్కించారు.. అంజలినీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.. దాంతో ఆమె సిబ్బంది కాళ్లావేళ్లా పడింది.. తన ఇద్దరు పిల్లలు ఆగమవుతారని చెప్పింది.. దాంతో వారు అడుక్కోవద్దని హెచ్చరించి వెళ్లిపోయారు.. దాంతో ఆమె ఒక్కసారిగా ఆవేదనకు లోనైంది.. ఏ పనీ చేసుకోలేని వైకల్యం.. ఎలా బతకాలి, తన పిల్లలు సిరి, కీర్తిలను ఎలా పోషించాలి? ఎలా చదివించాలనే ఆందోళనలో మునిగిపోయింది.. చివరికి దాచిపెట్టుకున్న పదీ, పరకా కూడేసి, అప్పు చేసి ఓ బరువు తూచే మెషీన్ కొనుక్కొంది.. నిన్నటివరకు డబ్బులు దానం చేసినవారు.. ఇప్పుడు బరువు చూసుకుని అయినా చిల్లర ఇవ్వకపోతారా అని భావించింది. కానీ ఒక్కరూ బరువు చూసుకోవడం లేదు, రోజూ తిండికి సరిపడా డబ్బులైనా రావడం లేదు. అటు యాచించే మార్గం లేక, ఇటు ఉపాధికి అవకాశం లేక అంజలి తల్లడిల్లిపోతోంది. ‘‘అసలు నేను, నా బిడ్డలు బతికేదెట్లా..?’’ అని ఆక్రోశిస్తోంది. ఏ ప్రభుత్వానికి.. చట్టాలు, నిబంధనలకు అంతుబట్టని ఈ ఆవేదన ఒక్క అంజలికే కాదు.. తమను ఎందుకు, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియని ఆందోళనలో ఉన్న వేల మంది యాచకుల దీనస్థితి ఇది. ♦ నగరవ్యాప్తంగా.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, ప్రధాన బస్స్టేషన్లు, కూడళ్లు, గుళ్లు, మసీదులు, మందిరాల వద్ద యాచిస్తున్న వారంతా కొద్దిరోజులుగా బెంబేలెత్తిపోతున్నా రు. త్వరలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగనుండటం, దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరవు తుండటంతో ప్రభుత్వం ‘బెగ్గర్‌ఫ్రీ సిటీ’ కోసం చర్యలు చేపట్టింది. యాచకులను చంచల్‌గూడ, చర్లపల్లి కారాగారాల్లో ఏర్పాటు చేసిన ‘ఆనంద నిలయాలు, కారుణ్య కేంద్రా’లకు తరలిస్తోంది. దాంతో యాచకులు తమను ఎక్కడికి తరలిస్తు న్నారో, ఎందుకు తరలిస్తున్నారో, ఎప్పుడు వదులుతారోనన్న ఆందోళనలో పడిపోయారు. తమకు కుటుంబాలు ఉన్నాయంటూ ఆధార్ పత్రాలను చూపుతున్నారు. ఇప్పటివరకు ఆనంద నిలయం, కారుణ్య కేంద్రం సహా పలు చోట్లకు 300 మందికిపైగా యాచకులను తర లించినట్లు అంచనా. అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతూ.. కనిపించిన యాచకులను వ్యాన్ ఎక్కించి తరలించేస్తున్నారు. ఆ కేంద్రాల నుంచి బయటికి రాకుండా ఉంచేస్తున్నారు. అయితే యాచించాల్సిన అవసరం లేకుండా బతకాలని కోరుకోవడం, అందుకు తగిన పరిస్థితులను, ఉపాధి అవకాశాలను కల్పించడం ఉన్నతమైన కార్యక్రమమే అయినా.. ఎవరికోసమో ఉన్నఫళంగా తరలించి, నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘ఇవాంకా రావొద్దు్ద..’ అన్న ఆక్రోశం కనిపిస్తోంది. ♦ అంజలి, పిల్లల బతుకు గడిచేదెలా..? జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ వరకు బస్సులో వచ్చి అక్కడ అడుక్కొంటోంది. హైదరాబాద్ శివార్లలో ని జీడిమెట్లలో నివాసముంటున్న అంజలి తల్లిదం డ్రులు చిన్నవయసులోనే చనిపోయారు. పోలియోతో చిన్నప్పుడే ఒక కాలు, ఒక చెయ్యి చచ్చుపడిపోయాయి. కొందరు తెలిసినవాళ్ల సాయంతో ఓ పూరి గుడిసెలో ఉంటూ పదోతరగతి వరకు చదివింది. ఆమెకు కొన్నేళ్ల కింద సురేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తోడుగా నిలుస్తానని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు సిరి, కీర్తి పుట్టారు. కానీ మద్యానికి బానిసైన సురేశ్.. వైకల్యమున్న ఆమెను చిన్నచూపు చూశాడు. కొంతకాలానికి వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు, తిరిగి రాలేదు. దీంతో అంజలి బతుకు ప్రశ్నార్థకంగా మారింది. చివరికి ఏం చేయాలో తెలియక యాచిం చడం మొదలుపెట్టింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆమెను కలసినప్పుడు తన ఆవేదనను కన్నీటితో చెప్పుకొంది. ‘‘నా భర్త మొదట్లో బాగానే ఉండేవాడు. రాను రాను కాలూ చెయ్యీ లేదని చిన్నచూపు చూశాడు. తాగి వచ్చి నానా బీభత్సం చేసేవాడు, బాగా కొట్టేవాడు. చివరకు నన్ను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. నేను బతికి, పిల్లలను బతికించుకోవాలి కదా. అందుకే అడుక్కోవడం మొదలుపెట్టిన. పెద్దబిడ్డ ఒకటో తరగతి, చిన్నది ఇప్పుడే బడికి వెళుతోంది. రోజూ జీడిమెట్లలో వాళ్లను బడికి పంపించి నేను బస్సులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తాను. పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తిరిగి వెళ్తాను. తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి బరువు మిషన్ తెచ్చిన. కానీ ఎవరూ బరువు చూసుకోవడం లేదు. దీంతో యాచనే దిక్కు అయింది. ఇప్పుడు యాచించే అవకాశం లేదు. పైసలు రావడం లేదు. పస్తులు ఉండాల్సి వస్తోంది. నేను, నా పిల్లలు ఎట్లా బతకాలి సార్..’’ అని కన్నీటి పర్యంతమైంది. ♦ పునరావాసం.. సర్వేలకే పరిమితం జీహెచ్ఎంసీ, నిరాశ్రయ శ్రామిక్ సంఘటన్ వంటి సంస్థల సర్వేల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 5,000 మంది యాచకులు ఉన్నారు. వారిలో ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ వంటి ధ్రువపత్రాలు, కుటుంబాలు ఉన్న యాచకులు కొందరైతే.. ఏ ఆధారమూ లేని అనాధలు, వృద్ధులు, దివ్యాంగులు, దగాపడినవారు మరికొందరు ఉన్నారు. కారణం ఏదైనా యాచించి బతకాల్సిన దుస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. యాచనే ఉపాధిగా మలుచుకొని బతుకు తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. వారు పుట్టుకతోనే తమ పిల్లలను భిక్షాట నలోకి దింపుతున్నారు. ఇలా యాచక వృత్తితో వీధిన పడ్డ బాల్యం నుంచి నేరప్రవృత్తి పుట్టుకువస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. యాచకులకు పునరావాసం కల్పిస్తామన్న ప్రకటనలు, జీహెచ్ంఎసీ సర్వేలు కాగితాలకే పరిమితమయ్యాయి. -
నలుగురు భిక్షగాళ్లు కిడ్నాప్
హైదరాబాద్ సిటీ: నగరంలోని ఎల్బీ నగర్‌లోని హనుమాన్ టెంపుల్ వద్ద నలుగురు భిక్షగాళ్లను గుర్తుతెలియని దుండగులు మంగళవారం వేకువజామున కిడ్నాప్ చేశారు. వ్యానులో వచ్చిన అగంతకులు ఆలయం వద్ద నిద్రిస్తున్న వాళ్లను లేపి వ్యానులో ఎక్కించుకుని వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ అయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. తోటి బిక్షగాళ్లు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాచక రహిత నగరమే ధ్యేయం
ఎల్బీనగర్: బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్ బొంతు రాంమోహన్ తెలిపారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ అమ్మానాన్న అనాథాశ్రమం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మతిస్థిమితం లేని వారికి సేవలు చేస్తున్న అమ్మానాన్న ఫౌండేషన్ చైర్మన్ గట్టు శంకర్‌ను అభినందించారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి మాట్లాడుతూ బెగ్గర్స్ పునరావాసానికి గ్రేటర్ పరిధిలో ప్రణాళికలు సిద్ధం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిచ్చగాళ్ల నిర్మూలనకు తాను మేయర్‌గా ఉన్న సమయంలో అనేక ప్రయత్నాలు చేశానన్నారు. ఈస్ట్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో మానసిక వికలాంగులు, నిజమైన బెగ్గర్లను గుర్తించి అమ్మానాన్న ఫౌండేషన్ కు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో వినోద్కోట్ల, యూసీడీ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, సామ రమణారెడ్డి, అనితా దయాకర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, రమావత్ పద్మానాయక్, రాధా ధీరజ్‌రెడ్డి -
నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు
- నగర మేయర్ బొంతు రామ్మోహన్ చిక్కడపల్లి: నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనుకాడేదిలేదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో యాచకులు లేని నగరంగా హైదరాబాద్‌ను చీర్చిదిద్దాలని ఫ్లకార్డు, బ్యానర్లు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నిజమైన యాచకులకు ఉపాధి కల్పించి, వారి జీవన స్థితిగతులను మెరుగు పర్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. నగరంలో 10వేల మంది బిచ్చగాళ్లు ఉండగా కేవలం 400మంది మాత్రమే నిజమైన యాచకులుగా సర్వేలో తేలిందని, నకిలీలంతా నగరాన్ని వదిలిపెట్టి వెళ్లకపోతే కేసులు తప్పవన్నారు. కార్యక్రమంలో స్థానిక గాంధీనగర్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత, టీఆర్ఎస్ నాయకులు, కార్యక్రమ నిర్వాహక సంస్థ వ్యవస్థాపకులు శంకర్‌నారాయణ, చైర్మన్ జి.రామయ్య, నిర్వాహక కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు. -
పనిలేని పోటుగాళ్లు
హైదరాబాద్: బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. కుటుంబాన్ని పోషించాలంటే చిన్న ఉద్యోగమైనా ఉండాలి. పని కోసం వివిధ ప్రాంతాలవారు మహానగరానికి వలస బాట పడుతుంటే.. ఇక్కడ ఉన్నవారు మాత్రం పనీపాటా లేకుండా గడిపేస్తున్నారు. ‘పని’ చూపిస్తామని దేశవిదేశాలకు చెందిన కంపెనీలు వస్తుంటే.. వీటితో తమకేంటన్నట్టు కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి వారు నగరంలో లక్షన్నర మందికి పైగా ఉన్నారంటే అశ్చర్యం కలుగుతుంది. ఎలాంటి పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారిలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో చదువుకున్న వారే అధికం. ఈ లెక్కలు కేంద్రం ఆధీనంలోని జనాభా గణాంక శాఖ తేల్చినవే. సిటీలో ఉన్న బిచ్చగాళ్లలో డిగ్రీ, టెక్నికల్ డిప్లొమో, పీజీ చదువుకున్నవారు సైతం ఉన్నారట. నాన్-వర్కర్స్ 25 లక్షల మంది కేంద్ర జనాభా లెక్కల విభాగం 2011లో జనాభాను లెక్కించడంతో పాటు ఆర్థిక, సామాజిక కోణాల్లోనూ సమాచారం సేకరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వాటి క్రోడీకరణ, విశ్లేషణ, అధ్యయనం చేసింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ‘ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్’ గత నెలలో అదనపు వివరాలను విడుదల చేసింది. హైదరాబాద్‌కు సంబంధించి ఇందులోని అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. రాష్ట్రాలతో పాటు నగరాలు, పట్టణాల వారీగా గణాంకాలను పొందుపరిచింది. సమాచారం సేకరించే నాటికి ఏపనీ చేయకుండా ఉన్నవారిని ‘నాన్-వర్కర్స్’ కేటగిరీలో చేర్చింది. సిటీకి సంబంధించి ఈ కేటగిరిలో ఉన్నవారు 25,30,026 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 9,72,990, స్త్రీలు 15,57,036 మంది ఉన్నారు. ‘అవన్నీ’ తీసేసిన తరవాత.. సిటీలో ఖాళీగా ఉన్న వారిని ఏడు కేటగిరీ కింద విభజించారు. విద్యార్థులు, గృహావసరాలకు పరిమితమైన వారు, వైకల్యం సహా అనేక కారణాల నేపథ్యంలో కుటుంబీకులపై ఆధారపడిన వారు, పదవీ విరమణ చేసినవారు, పెన్షనర్లను మినహాయించారు. విద్యార్థి దశకు చేరుకోకుండా తల్లి ఒడికి, ఇంటికి పరిమితమైన పసివారిని ‘ఖాళీ’ కేటగిరిలోకి చేర్చకుండా ‘డిపెండెంట్స్’గా విశ్లేషించారు. మిగిలిన 1,66,255 మందీ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారని లెక్క తేలింది. ఇలాంటి వారిలో స్త్రీల కంటే పురుషులే అధికంగా ఉన్నారని ‘సెన్సస్’ స్పష్టం చేసింది. స్త్రీల సంఖ్య 44 వేలుగా ఉండగా.. ‘మగ మహారాజులు’ దీనికి మూడు రెట్లతో ఏకంగా 1.2 లక్షల మందికి పైగా రికార్డులకెక్కారు. ‘అక్షరం’ నేర్చినా అక్కరకు రాకుండా.. విద్యావకాశాలు లేకో, విద్యార్హతలు సాధించలేకో ఖాళీగా ఉండిపోయారనుకుంటే పొరపాటే. ‘పనీపాటా’ లేని వారిలో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఖాళీగా ఉంటున్న నగరవాసుల్లో టెన్త్, ఆలోపు చదివిన వారి కంటే.. ఎస్సెస్సీ పూర్తయి, డిగ్రీ లోపు చదివిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. డిగ్రీ ఆపై విద్యార్హతలు గలవారూ సిటీలో ఖాళీగానే ఉన్నారని గణాంకాలు తేల్చాయి. అక్షరాస్యులై ఉండీ, ఏ పనీ చేయకుండా ఉన్న వారిలో పురుషులు 97,797 మంది ఉండగా, స్త్రీలు 33,651 మంది ఉన్నారు. సిటీలో క్యాలిఫైడ్ బెగ్గర్స్.. సెన్సస్ డిపార్ట్మెంట్ నాన్-వర్కర్స్ కేటగిరీలో బిచ్చగాళ్లనూ చేర్చింది. వారికి సంబంధించిన అనేక అంశాలను సేకరించింది. వీటి ప్రకారం నగరంలో బిచ్చగాళ్ల సంఖ్య 1506గా తేల్చింది. ఇందులో స్త్రీల కంటే పురుషులే అధికమని లెక్కకట్టింది. చదువు లేని కారణంగా ఇతర పనులు చేసుకోలేక ఈ బాట పట్టినవారితో పాటు ‘క్వాలిఫైడ్ బెగ్గర్స్’ సైతం హైదరాబాద్‌లో ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని బిచ్చగాళ్లలో నిరక్షరాస్యులు 583 మంది ఉండగా, అక్షరాస్యులు 932 మంది ఉన్నట్టు నిర్ధారించింది. డిగ్రీ ఆపై చదివిన వారు 46 మంది ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు ‘చేతులు చాస్తున్నార’ని తెలుస్తోంది. డిగ్రీ, సాంకేతిక విద్య అభ్యసించిన వారు ఇద్దరు ఉండగా, డిగ్రీ కంటే ఎక్కువ చదివిన వారు 44 మంది ఉన్నట్లు గణాంకాల్లో స్పష్టం చేసింది. అవకాశాలు కల్పించాలి.. నగరంలో ఉన్న అన్ని వర్గాల వారికీ, వారికున్న అర్హతలు, ఆసక్తుల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఏదో ఒక పని చేయాలనే అవగాహన అందరిలోనూ కల్పించాలి. బిచ్చగాళ్ల విషయానికి వస్తే... ఆదాయం ఎక్కువ, పన్ను ఉండదు అనే ఉద్దేశంతో కొందరు ఈ బాట పడుతున్నారు. వీరి నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలి. బిక్షాటన చేస్తున్నవారికి వృత్తివిద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా పరిస్థితి మార్చవచ్చు. - వివేక్ నర్సింహం, చార్టెడ్ అకౌంటెంట్ -
'బిచ్చమెత్తుకునే పరిస్థితి పోవాలి'
హైదరాబాద్: నగరంలో బడుగు జీవులు బిచ్చమెత్తుకుని జీవించే పరిస్థితి అంతం కావాలని, దీని కోసం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం చిక్కడపల్లిలో జంట నగరాల వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో 610 మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పేదలను చేరదీసి వారికి సాయం చేయటం అభినందనీయం అన్నారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసన సబాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
బిచ్చగాళ్ళమా...పోలీసులమా..
రాజమండ్రి : 'పుష్కరాల విధులకు తీసుకువచ్చారు.. నగరానికి 20 కిలోమీటర్లు దూరంలో వదిలేసి.. మీచావు మీరు చావండి అంటూ వెళ్లిపోయారు.. అర్ధరాత్రి దాటుతున్నా అన్నం పెట్టే దిక్కులేదు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. మేం బిచ్చగాళ్లమో.. వరదబాధితులమో.. లేక పోలీసులమో మాకే అర్ధంకాని పరిస్థితి..' ఇవీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటోన్న గోదావరి పుష్కర ఘాట్ల వద్ద పోలీసుల స్థితి. వారే చెబుతోన్న దుస్థితి. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెంది 1200మంది పోలీసుసిబ్బంది గురువారం మధ్యాహ్నాం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. వారికి రాజమండ్రి బివిఎంస్కూల్లో వసతి కల్పించారు.అయితే శుక్రవారం అక్కడ నుంచి రాజానగరం మండల భూపాలపట్నంలోని రైట్కళాశాలకు బస మార్చారు. ఆ ప్రాంతంలో కనీసం వాటర్‌బాటిల్ దొకికే షాపులు కూడా ఉండవు. మూడు కిలోమీటర్లు నడిచే వస్తే తప్ప బిస్కట్లయినా దొరకని పరిస్థితి. విధులు నిర్వర్తించేందుకు అలాంటి ప్రాంతానికి వచ్చిన పోలీసు సిబ్బందికి భోజనం కాదుకదా.. కనీసం మంచినీళ్లైనా అందించలేదు నిర్వాహకులు. తట్టుకోలేక రాజమండ్రి రావాలంటే రూ.300ఆటోకు ఖర్చుపెడితే తప్ప తిని వెళ్ళే పరిస్థితిలేదు. దీంతో పోలీసుసిబ్బంది ఆకలిమంటలు తట్టుకోలేక రాత్రి 07.30 గంటల సమయం నుంచి ఆందోళన మొదలు పెట్టారు. అయినప్పటికీ పోలీసు అధికారులు వచ్చి చర్చలు జరుపుతున్నారే తప్ప వారికి కావాల్సిన బోజనంను మాత్రం సమకూర్చలేకపోయారు. దీంతో పోలీసుసిబ్బంది వెంటనే తమను విధులనుంచి వెనక్కి పంపించేయాలని, డీఏ కూడా కేవలం రూ.50 ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బోజనం అయినా పెట్టించలేనప్పుడు పుష్కరాల విధులకు ఎందుకు తీసుకురావాలని పోలీసుఅధికారులపై విరుచుకుపడ్డారు. కళాశాల ఆవరణలో తేలులు ఉన్నాయని, మూడు తేళ్ళను చంపామని, ఎవరికైన ఏమైన జరిగితే అర్బన్ ఎస్పీ బాద్యత వహిస్తారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మధుమేహ,హార్ట్పేషెంట్లు అధికంగా ఉన్నారని సమయానికి బోజనం చేయకపోవడం వలన కుప్పకూలేపరిస్థితి ఏర్పడిందన్నారు. 1200 మందికి కేవలం 25రూమ్‌లు కేటాయించడంతో అందరూ వరండాలలో,బయట పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లా పోలీసులకే ఈపరిస్థితే దాపరిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏమిటని వారి ప్రశ్నించారు. స్వయానా ఉపముఖ్యమంత్రి,హోంమంత్రి స్వంత జిల్లాలో కనీసం పోలీసులకు బోజనం పెట్టేపరిస్థితి ఒక్కడ ఎస్పీలకు లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 11.00గంటల సమయంలో బోజనాలు వచ్చినప్పటికీ పోలీసుసిబ్బంది తిరస్కరించడంతో పోలీసు అధికారులు వారితో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. -
బిచ్చగాళ్ల అడ్డాలుగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు
ఢిల్లీలోని మెట్రో రైల్వే స్టేషన్ల పరిసరాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. చాలావరకు మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి. నోయిడా సిటీ సెంటర్, సెక్టార్-18, ఝండేవలాన్, షాదిపూర్, చాందినీ చౌక్...ఇలా ఏ ఇలా స్టేషన్ల బయటచూసినా వీరే కనిపిస్తారు. స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంటే కనిపించే దృశ్యాలన్నీ ఇవే. ఇదే విషయమై పశ్చిమ జనక్‌పురి-కర్కర్డుమాల మధ్య ప్రతిరోజూ రాకపోకలు సాగించే లూబా చోప్రా అనే విద్యార్థిని మాట్లాడుతూ ‘మెట్రో స్టేషన్లలోని మెట్ల వద్ద బిచ్చగాళ్లను చూడాల్సిరావడం చిరాకుగా అనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రతిరోజూ ఓ కొత్త బిచ్చగాడు కనిపిస్తాడు. మెట్రో రైల్వే స్టేషన్లు వారికి కొత్త ఆలయాలుగా మారాయి. ఇదొక వ్యాపారం. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తరహా నిర్లక్ష్య ధోరణి నోయిడా సిటీ సెంటర్ స్టేషన్లోనూ బాగా కనిపిస్తుంది. అక్కడ బిచ్చగాళ్ల సంఖ్య విపరీతంగా ఉండడంతో పాదచారులకు దారి దొరకని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే విషయమై ప్రసూన్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ ‘ఉదయం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే బిచ్చగాళ్లు దారికి అడ్డంగా ఉండడం వల్ల మంచే జరుగుతోంది. ఒకరిపై మరొకరు పడిపోయే పరిస్థితి తప్పిపోతోంది. ఈ రకంగా బిచ్చగాళ్ల వల్ల కొంతమేలే జరుగుతోంది’ అని అన్నాడు. అయితే వారు డబ్బు కోసం బాగా విసిగిస్తుంటారన్నాడు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే జేబు దొంగతనాలు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదన్నాడు. ఈ సమస్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదంటూ విచారం వ్యక్తం చేశాడు.