![Beggars In France Win Jackpot With Scratch Card Gifted By A Stranger - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/10/9/money.jpg.webp?itok=aZoGjklV)
పారిస్ : అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఓ అజ్ఞాత వ్యక్తి స్క్రాచ్ కార్డు ఇవ్వడంతో ఫ్రాన్స్‌లో నలుగురు యాచకులు 43 లక్షల రూపాయల విలువైన (50,000 యూరోలు) జాక్‌పాట్‌ను దక్కించుకున్నారు. బ్రెస్ట్ నగరంలో ఓ వ్యక్తి వారికి స్క్రాచ్‌కార్డు ఇవ్వడంతో ఆ లాటరీని నలుగురు యాచకులు గెలుచుకున్నారు. లాటరీ షాప్ వద్ద వీరు యాచిస్తుండగా ఓ యూరో వెచ్చించి కొనుగోలు చేసిన స్క్రాచ్ కార్డును ఓ కస్టమర్ వారికి ఇచ్చారని దీంతో లాటరీలో వారికి జాక్‌పాట్ తగిలిందని ఫ్రెంచ్ లాటరీ ఆపరేటర్ ఎఫ్‌డీజే ఓ ప్రకటనలో పేర్కొంది.
లాటరీలో 50,000 యూరోలు తమను వరించాయని తెలియగానే వారు సంబరపడ్డారని, ఈ మొత్తాన్ని వారు సమంగా పంచుకున్నారని ఎఫ్‌డీజే పేర్కొంది. ఇక వర్జీనియాకు చెందిన అమెరికన్ రేమండ్ హరింగ్టన్ ఇటీవల 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేయగా అన్ని టికెట్లూ లాటరీలో గెలుపొందడం గమనార్హం. హరింగ్టన్‌కు మొత్తం 1,25,000 డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. చదవండి : జాక్‌పాట్ అంటే నీదే తమ్ముడు
Comments
Please login to add a commentAdd a comment