నలుగురు భిక్షగాళ్లను గుర్తుతెలియని దుండగులు మంగళవారం వేకువజామున కిడ్నాప్ చేశారు.
హైదరాబాద్ సిటీ: నగరంలోని ఎల్‌బీ నగర్‌లోని హనుమాన్ టెంపుల్ వద్ద నలుగురు భిక్షగాళ్లను గుర్తుతెలియని దుండగులు మంగళవారం వేకువజామున కిడ్నాప్ చేశారు. వ్యానులో వచ్చిన అగంతకులు ఆలయం వద్ద నిద్రిస్తున్న వాళ్లను లేపి వ్యానులో ఎక్కించుకుని వెళ్లారని స్థానికులు చెబుతున్నారు.
కిడ్నాప్ అయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. తోటి బిక్షగాళ్లు ఎల్‌బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.