హైదరాబాద్: నగరంలోని చిలుకానగర్‌లో ఆరేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కమలేష్ నగరానికి వచ్చి టాటా కంపెనీలో పనిచేస్తూ కుటుంబంతో చిలుకానగర్‌లో ఉంటున్నాడు. స్థానిక నలంద పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న వీరి కూతురు ఆరోహి మీనా(6) సోమవారం సాయంత్రం ఇంటి వద్ద స్నేహితులతో ఆడుకుంటోంది.
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చి ఆరోహి మీనాను బైక్ పై ఎక్కించుకుని పరారయ్యారని చుట్టుపక్కల వారు చెప్పారని కమలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్తె కోసం చుట్టుపక్కల గాలించి ఆరోహి కిడ్నాప్ అయినట్లు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.