అమ్మానాన్నలే కూతురిని కిడ్నాప్‌ చేశారు | Parents Kidnapped Daughter In Hyderabad Like Cinematic | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలే కూతురిని కిడ్నాప్‌ చేశారు

Published Fri, Jun 15 2018 11:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Parents Kidnapped Daughter In Hyderabad Like Cinematic - Sakshi

ఆనంద్, రుచితల పెళ్లినాటి ఫొటో..

సాక్షి, హైదరాబాద్‌: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సినీ ఫక్కీలో ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్‌ చేశారు. అరుగుల ఆనంద్‌(29) చక్రిపురం కాలనీలో నివాసముంటున్నాడు. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన రుచిత నాగార్జుననగర్‌ కాలనీలోని బంధువుల ఇంటికి వస్తూ.. వెళ్తూండేది. ఈ క్రమంలో ఆనంద్‌కు రుచితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహరం నడిచింది. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో గత ఏప్రిల్‌– 24న ఫలక్‌నామలోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రుచిత తల్లిదండ్రులు కూడ పలుమార్లు వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

కలిసిపోయినట్లుగా నమ్మిస్తు వస్తున్న రుచిత తల్లిదండ్రులు అదును కోసం చూస్తు వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆనంద్‌ ఇంట్లోలేని సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు శ్రీధర్, భవానీలతో పాటుగా మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి రుచితను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న తల్లి, బంధువులు కేకలు వేస్తుండగా, స్థానికులంతా చూస్తుండగానే సినిఫక్కీలో అందరిని తోసేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో ఆనంద్‌ తన భార్యను కిడ్నాప్‌ చేశారంటు రుచిత తల్లిదండ్రులపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈకేసులో పోలీసులు సహకరించడం లేదని ఆనంద్‌ వాపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement