
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం చైతన్య నగర్‌లో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అంతయ్య(68) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్నారు. అతడి బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈయన దేవరకొండ సర్పంచ్‌గా కూడా పనిచేశారు.