![Rare Breed Cat worth Rs 50000 Stolen In Hyderabad Case Filed - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/10/catttt.jpg.webp?itok=vOJu7m8c)
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్‌కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
థాయిలాండ్‌లోని కాహో మనీ బ్రీడ్‌కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్‌లో, మరొకటి బ్లూ కలర్‌లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత.
అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment