
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురంలో పెను ప్రమాదం తప్పింది. రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్‌లో బుధవారం సాయంత్రంగ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
మంటల్లో టిఫిన్ సెంటర్ పూర్తిగా దగ్గమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
చదవండి: Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు