భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్ | Fire Accident At Godown At vanasthalipuram In Rangareddy District | Sakshi
Sakshi News home page

Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Published Fri, Jun 16 2023 11:05 PM | Last Updated on Fri, Jun 16 2023 11:12 PM

Fire Accident At Godown At vanasthalipuram In Rangareddy District - Sakshi

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్‌ గోదాంతో పాటు పక్కనే ఉన్న బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.  అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement