బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్ | BJP Leader son kidnap in hyderabad | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్

Published Mon, Oct 26 2015 10:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్ - Sakshi

బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్

చార్మినార్: హైదరాబాద్కు చెందిన బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్ రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. పాతబస్తీకి చెందిన పొన్న వెంకటరమణ కుమారుడు శబరీష్ (15) ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శబరీష్ చైతన్య టెక్నో స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన శబరీష్ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెదిరించి తీసుకెళ్లారు. ఈ విషయం గమనించిన స్థానికులు వెంకట రమణకు సమాచారం అందించారు. దీనిపై ఆయన వెంటనే శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాలిబండ పోలీసులు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ బీజేపీ నాయకులు వెంకటరమణను పరామర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement