కిడ్నాప్‌ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా.. | Algerian man Missing For 26 Years Later Found In | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..

Published Wed, May 15 2024 10:20 AM | Last Updated on Wed, May 15 2024 10:20 AM

Algerian man Missing For 26 Years Later Found In

దేశంలో అంతర్యుద్ధం నడుమ.. అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలోనే తమ బిడ్డ కనిపించకుండా పోయాడు. నెలల తరబడి వెతికినా లాభం లేకుండాపోయింది. చివరకు చనిపోయాడని నిర్ధారించేసుకున్నారు వాళ్లు. సరిగ్గా.. పాతికేళ్ల తర్వాత అదే వీధిలో ఓ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబానికి నోట మాట రాలేదు. 

1998లో అల్జీరియాలో అంతర్యుద్ధం జరిగిన టైంలో ఒమర్‌ బీ అనే వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బహుశా ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని కొన్నాళ్లూ.. ఆ తర్వాత కూడా ఆచూకీ దొరక్కపోవడంతో చంపేసి ఉంటారని అతని కుటుంబం నిర్ధారణకు వచ్చింది.

26 ఏళ్లు గడిచాక.. ఒమర్‌ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో అతన్ని బంధించినట్లు కుటుంబం తెలుసుకుంది. వెంటనే ఒమర్‌ సోదరుడు ఆ బంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. ఆస్తి పంపకాల తగాదాలు.. ఆ కేసు కోర్టులో నడుస్తుండడంతో దగ్గరి బంధువే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తేలింది.

అల్జీరియా డిజెల్ఫా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు పారిపోయే యత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌చేశారు. 45 ఏళ్ల వయసులో ఒమర్‌ను చూడగానే ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం అతనికి మానసిక చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం. అయితే.. కిడ్నాప్‌ చేసి పొరుగింట్లోనే పాతికేళ్లుగా బంధించడం నమ్మశక్యంగా లేదంటున్న పోలీసులు.. సమగ్రంగా దర్యాప్తు చేపట్టాకే కేసు వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement