Algeria
-
ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
Paris olympics: ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!
ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో జెండర్ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)తో జరిగిన పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్, ఇటలీ బాక్సర్ ఏంజిలా కారిని బౌట్ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని ఖాలీఫ్కు మద్దతు పలికారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్ పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్‌రాజన్‌ను ఇండియాలో వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇమానే చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు.కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 సెకన్ల స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.Imane Khelif is BORN WOMAN. She is NOT a man. *The right to change their gender is illegal and banned in Algeria, the country she represents.*Indians have harassed and harangued Shanthi Soundarrajan, a brilliant sportswoman, just because she didn’t look the way they expect a… pic.twitter.com/JzYvTNgTVV— Chinmayi Sripaada (@Chinmayi) August 2, 2024 గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్‌పై లింగ ఆరోపణలు వచ్చాయి. 2023 చాంపియన్‌షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్‌వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్‌పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో అనుమతినిన్చినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మహిళా బాక్సర్లు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.🇮🇹🇩🇿 Angela Carini from Italy in blue realizes she doesn’t want to fight a man and pulls out mid fight against the trans from Algeria in red at the Olympics.The "fight" lasted less than a minute.Cruel pic.twitter.com/VMksyAAbsx— Lord Bebo (@MyLordBebo) August 1, 2024 -
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
దేశంలో అంతర్యుద్ధం నడుమ.. అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలోనే తమ బిడ్డ కనిపించకుండా పోయాడు. నెలల తరబడి వెతికినా లాభం లేకుండాపోయింది. చివరకు చనిపోయాడని నిర్ధారించేసుకున్నారు వాళ్లు. సరిగ్గా.. పాతికేళ్ల తర్వాత అదే వీధిలో ఓ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబానికి నోట మాట రాలేదు. 1998లో అల్జీరియాలో అంతర్యుద్ధం జరిగిన టైంలో ఒమర్ బీ అనే వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని కొన్నాళ్లూ.. ఆ తర్వాత కూడా ఆచూకీ దొరక్కపోవడంతో చంపేసి ఉంటారని అతని కుటుంబం నిర్ధారణకు వచ్చింది.26 ఏళ్లు గడిచాక.. ఒమర్ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో అతన్ని బంధించినట్లు కుటుంబం తెలుసుకుంది. వెంటనే ఒమర్ సోదరుడు ఆ బంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఆస్తి పంపకాల తగాదాలు.. ఆ కేసు కోర్టులో నడుస్తుండడంతో దగ్గరి బంధువే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తేలింది.అల్జీరియా డిజెల్ఫా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు పారిపోయే యత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌చేశారు. 45 ఏళ్ల వయసులో ఒమర్‌ను చూడగానే ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం అతనికి మానసిక చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం. అయితే.. కిడ్నాప్ చేసి పొరుగింట్లోనే పాతికేళ్లుగా బంధించడం నమ్మశక్యంగా లేదంటున్న పోలీసులు.. సమగ్రంగా దర్యాప్తు చేపట్టాకే కేసు వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. -
అల్జీరియా లో పెను విషాదం
-
భారీగా చెలరేగిన మంటలు: 42 మంది ఆహుతి
అల్జీరియా : ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిలో సహాయక చర్యల్లో ఉన్న 25మంది సైనికులతోపాటు మరో 17మంది పౌరులున్నారని అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. బాధిత బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్ చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్ హస్తం తప్పక ఉండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల జాబితాలో అల్జీరియా చేరింది. సోమవారం రాత్రి నుంచి మంటలు చేలరేగడంతో అడవులు కాలిబూడిదవుతున్నాయి. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. అనేక పశువులు, కోళ్లు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని, ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #Algeria : Defence ministry has just said that 18 members of military have died as result of fires raging through forests & hillsides of Kabylie #الجزائر pic.twitter.com/uPVZ6jGMUf — sebastian usher (@sebusher) August 10, 2021 the fires in algeria are still strong; eleven dead were reported with over 80 wounded.. no help from the authorities was sent yet 💔#AlgeriaIsBurning pic.twitter.com/ki7mSRRD1s — ♠️ (@cicegimeda) August 10, 2021 Fires everywhere #PrayForAlgeria #Algeria https://t.co/r7JMeB4GpF — Jasmine 🌺 (@jasoSisin) August 10, 2021 -
కూలిన విమానం.. 257 మంది మృతి
-
257 మంది దుర్మరణం
అల్జీర్స్: ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో బుధవారం ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు తరలివచ్చాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించామని అల్జీరియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన అనంతరం జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే. ప్రమాదంపై అల్జీరియా రక్షణ శాఖ ప్రకటన చేస్తూ.. ‘మొత్తం 247 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. రక్షణ శాఖ సహాయ మంత్రి అహ్మద్ సలాహ్ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులతో కూడిన ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం దక్షిణ అల్జీరియాలోని బౌఫరిక్ నుంచి పశ్చిమ సహారా సమీపంలోని బెచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మధ్యలో టిన్డౌఫ్లో విమానం ఆగాల్సి ఉంది. పశ్చిమ సహారా ప్రాంతం ప్రస్తుతం మొరాకో అధీనంలో ఉండగా.. దాని స్వాతంత్య్ర పోరాటానికి అల్జీరియా మద్దతిస్తోంది. 300 మంది అత్యవసర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, విమానమే మంటల్లో కాలిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం రష్యాలో తయారైంది. గతంలోనూ.. గత ఆరేళ్లలో అల్జీరియాలో అనేక సైనిక, పౌర విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. డిసెంబర్ 2012న రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2014న టమన్రస్సెట్ నుంచి కాన్స్టాంటిన్కు ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న సీ–130 హెర్క్యులస్ ఆర్మీ విమానం కూలడంతో 77 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో రక్షణ శాఖ ప్రకటించింది. జూలై, 2014న బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వెళ్తున్న ఎయిర్ అల్జేరీ విమానం ఉత్తర మాలిలో కూలిపోవడంతో 116 మంది మరణించారు. వీరిలో 54 మంది ఫ్రెంచ్ జాతీయులున్నారు. -
కుప్పకూలిన ఆర్మీ విమానం
-
విమానం కూలి 200 మంది దుర్మరణం
-
ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిన విమానం
అల్జీర్స్: సైనికులను తరలిస్తున్న ఆర్మీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం ఈ సంఘటన జరింది. దేశరాజధాని అల్జీర్స్ శివారులోగల బొఫరిక్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్టు పక్కనేఉన్న జనావాసాలపై విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. స్థానిక మీడియా కథనాల మేరకు.. బొఫరిక్ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ఆర్మీ ఆధీనంలో ఉంది. అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలించే కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతూఉంటుంది. ఆ క్రమంలో బుధవారం 100 మంది సైనికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టుకు సమీపంగా కూలిపోయింది. ఈ ఘటనలో సైనికులు, విమాన సిబ్బంది అందరూ చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం కూలిన ఇళ్లలోని ప్రజలను కలుపుకుంటే మృతుల సంఖ్య 200 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
1000 లైక్స్ కొట్టండి.. లేదంటే కింద పడేస్తా
ఫేస్ బుక్ లో లైక్స్ కోసం ఎంత వికృత చేష్టలకైనా పాల్పడుతున్నారు కొందరు. ఓ తండ్రైతే ఏకంగా తను జన్మనిచ్చిన బాబునే ఈ లైక్స్ కోసం ప్రమాదంలోకి నెట్టేయాలని చూశాడు. చివరకు తానే వెళ్లి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అల్జెరియాలో ఓ తండ్రి తన బాబును 15వ ప్లోర్ విండ్ నుంచి కిందకి పడేయబోతున్నట్టు ఫోటో తీశాడు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆ పోస్టుకు 1000 లైక్స్ ఇవ్వాలని, లేదంటే అలానే ఆ బేబిని కిందకి పడేస్తానంటూ దారుణమైన క్యాప్షన్ పెట్టాడు. ఫేస్ బుక్ లో ఈ పోస్టు పెట్టిన వెంటనే అతనిపై నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. ఆదివారం పోలీసులు అతన్ని అరెస్టు చేసి, అల్జెరియా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు వెంటనే అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఏఐ అరేబియా న్యూస్ సైట్ రిపోర్టుచేసింది.. -
'ఆ పోలీస్‌ను చంపింది మేమే'
ఆల్జియర్స్: అల్జీరియాలో ఓ పోలీసు అధికారిని కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి దారుణంగా కాల్చిచంపారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది తామే నంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అల్ ఖాయిదా సంస్థ ఉత్తర ఆఫ్రికా విభాగం, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు చాలా కాలంగా అల్జీరియా ప్రభుత్వానికి వ్యతిరేంకంగా పనిచేస్తుండగా ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం కాన్స్టాంటిన్లో జరిగిన పోలీస్ అధికారి హత్యకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు అని, హత్య అనంతరం అతడి గన్ను సైతం వారు స్వాధీనం చేసుకున్నారని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ వార్తా సంస్థ అమాక్ పేర్కొంది. ఇందులో ఐఎస్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్న గన్ ఇదేనంటూ ఫోటోను సైతం ప్రచురించింది. అల్జీరియా అధికారులు మాత్రం గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో పోలీసు అధికారి మృతి చెందినట్లు వెల్లడించినప్పటికీ.. ఇస్లామిక్ స్టేట్ ప్రకటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
ఐదుగురు మిలిటెంట్లు హతం
అల్జీర్స్: అల్జీరియా ఆర్మీ ఐదుగురు మిలిటెంట్లను మట్టుపెట్టింది. రాజధాని అల్జీర్స్‌కు 480 కి.మీ దూరంలో ఉన్నబోట్నా ప్రావిన్స్ తాజాల్ట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులపై దాడులు చేసిన సైన్యం మిలిటెంట్ల దగ్గరున్న ఆరు బంకర్లు, భారీ ఎత్తున ఆయుధాలు, మైన్స్‌లను ధ్వంసం చేసింది. గత ఐదునెలలుగా ఆర్మీ 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆదర్శ దేశం
అదిగో అల్లదిగో... అల్జీరియా ఆఫ్రికా, అరబ్ దేశాల్లో అతి పెద్ద దేశం అల్జీరియా. దీనికి ఈశాన్యంలో టునీషియా, తూర్పులో లిబియా, దక్షిణంలో మొరాకో దేశాలు ఉన్నాయి. ఉత్తర ఐరోపాకు అల్జీరియా ఎక్కువ మొత్తంలో సహజవాయువులను సరఫరా చేస్తుంది. ఆఫ్రికాలో చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో అల్జీరియా రెండవ స్థానంలో ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశం ఫ్రెంచ్ అధీనంలో ఉంది. ఆ కాలంలో ఫ్రాన్సు నుంచి ఎంతో మంది అల్జీరియాకు వచ్చి ఎన్నో నగరాల్లో స్థిరపడ్డారు. ఈ ప్రభావంతో అల్జీరియా సంస్కృతి, ఆర్థికవ్యవస్థ, సమాజంపై ఫ్రెంచ్ ప్రభావం బలంగా కనిపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్సుకు వ్యతిరేకంగా ఎందరో నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా రకరకాల గ్రూపులు ఒక్కటయ్యాయి. ముఖ్యంగా ‘అల్జీరియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఏర్పాటుతో అల్జీరియా చరిత్ర కీలకమైన మలుపు తిరిగింది. 1962లో ఫ్రాన్స్ నుంచి అల్జీరియాకు స్వాతంత్య్రం వచ్చింది. వేలాది మంది అల్జీరియాను వదిలి తమ సొంతదేశం వెళ్లిపోయారు. ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో అల్జీరియా బాగా దెబ్బతిన్నది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. 1962 జూలై 1న అల్జీరియాలో జరిగిన రెఫరెండం ద్వారా కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ పరీక్షా సమయంలో అధైర్యపడకుండా, నిరాశపడకుండా ప్రజలందరూ ఐకమత్యాన్ని ప్రదర్శించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూనుకున్నారు. పట్టుదల, నిబద్ధతతో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది అల్జీరియా. అయితే జీవవైవిధ్యంలో మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు, పక్షులు, జంతువుల విషయంలో తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది. ఆధునిక అల్జీరియా సాహిత్యంపై అరబిక్, ఫ్రెంచ్ ప్రభావం బలంగా ఉంది. అల్జీరియా సంగీతం ‘రాయ్’కి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. క్రీడా రంగంలో ప్రతిభ చూపుతున్న ఆఫ్రికాలోని ముఖ్యమైన దేశాలలో అల్జీరియా ఒకటి. ఎందరో వరల్డ్ ఛాంపియన్లు, ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న క్రీడాకారులు ఈ దేశంలో ఉన్నారు. ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్‌బాల్... మొదలైనవి ఈ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆటలు. అల్జీరియాలో బహుళ పార్టీలు ఉన్నాయి. అయితే ఏ పార్టీ కూడా తనకు తానుగా అధికారాన్ని కైవసం చేసుకునే స్థితిలో లేదు. అందుకే పార్టీల మధ్య పొత్తు అనేది తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’, ‘వర్కర్స్ పార్టీ’, ‘నేషనల్ ర్యాలీ ఫర్ డెమోక్రసీ’, ‘ర్యాలీ ఫర్ కల్చర్ అండ్ డెమోక్రసీ’, ‘సొసైటీ ఫర్ పీస్’... మొదలైనవి అల్జీరియాలో ప్రధాన రాజకీయ పార్టీలు. టాప్ 10 1. అల్జీరియా జాతీయపతాకంలో ఎరుపు రంగు ప్రజల త్యాగాన్ని, ఆకుపచ్చ రంగు ప్రకృతిని, తెలుపు రంగు శాంతిని ప్రతిబింబిస్తాయి. 2. ప్రఖ్యాత రచయిత అల్బర్ట్ కామూ అల్జీరియాలోని కోస్తా పట్టణం మండోవిలో జన్మించారు. 3. అధికార భాష అరబిక్‌తో పాటు దేశంలో ఫ్రెంచ్ భాష ఎక్కువగా మాట్లాడతారు. స్థానిక మాండలికం ‘దర్జా’ను అరవైశాతం మంది మాట్లాడతారు. 4. సహారా ఎడారిలో కనిపించే ‘ఫెనిక్ ఫాక్స్’ అల్జీరియా జాతీయ జంతువు. 5. అతిథికి ఖర్జూరాలు, పాలు ఇచ్చి స్వాగతం పలకడం అల్జీరియాలో సంప్రదాయం. 6. అల్జీరియాలో పొడవైన నది... చెలిఫ్. 7. వ్యవసాయ ప్రాంతాలలో ‘ల టోయిజ’ పేరుతో జరిగే ఉత్సవంలో రైతులకు సహాయంగా ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తారు. 8. ఆఫ్రికా దేశాలలో అల్జీరియా అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన ఉన్న దేశం. 9. ‘అల్జీర్స్’ అనే నగరం పేరు నుంచి దేశానికి ‘అల్జీరియా’ అనే పేరు వచ్చింది. 10. అల్జీరియా తొలి అధ్యక్షుడు అహ్మద్ బెన్ బెల్లా. అయితే రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాడు. -
అక్కడ ఫేస్బుక్, ట్విట్టర్లపై నిషేధం
అల్జీరియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. హైస్కూల్ ఎగ్జామ్ పేపర్లను ఆన్ లైన్లలో పోస్టు చేస్తుండటంతో వీటిని అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఎగ్జామ్స్ కోసం సోషల్ మీడియాను అక్కడ బ్లాక్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసే తప్పుడు పేపర్ల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఉండటానికి నిషేధం విధించామని అధికారులు వెల్లడించారు. 3జీ మొబైల్ నెట్ వర్క్ ద్వారా యాక్సెస్ అయ్యే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ప్రశ్నాపత్రాల పేపర్ల చీటింగ్ దేశంలో ఎక్కువగా జరుగుతుండటంతో ప్రభుత్వానికి వాటిని నిరోధించడం కష్టతరంగా మారుతోంది. ఈ నెల మొదట్లో పేపర్లను లీక్ చేసిన కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసులకు, ఫ్రింటర్లకు సంబంధించిన వారు ఉన్నారు. 2016 హైస్కూల్ ఎగ్జామ్స్ పేపర్లు సోషల్ మీడియాలో లీక్ పై విచారణ కొనసాగుతోంది. -
34 మంది ఉగ్రవాదులు అరెస్టు
అల్జీర్స్: ఉగ్రవాదులకు సహకరించిన 34 మంది అనుమానిత ఉగ్రవాదులను అల్జీరియా సైన్యం అరెస్టు చేసింది. టిజి ఓజో, ఎల్ క్వీడ్ ప్రావిన్స్‌లలో ఉగ్రవాదుల అలికిడి ఎక్కువగా ఉందని, అందుకు కారణం అక్కడ ఉన్న కొంతమంది సహకరిస్తుండటం వల్లే అలా జరుగుతోందని, అందుకే కొంతమందిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. ఉగ్రవాద చర్యల గురించి ఆరా తీయగా ఎల్ క్వీడ్ ప్రాంతంలో వారికి సంబంధించిన సమాచారం లభించిందని, దాంతో పోలీసుల సహాయం తీసుకొని తాము దాడులు నిర్వహించామని, ఈ క్రమంలో 34మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిటనట్లు వెల్లడించింది. -
కుప్ప కూలిన సైనిక హెలికాప్టర్
అల్జీర్స్: ఒక సైనిక హెలికాప్టర్ కూలీ పన్నెండు మంది అల్జీరియన్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన అల్జీర్స్ లోని రెగానే అనే ప్రాంతానికి దక్షిణంగా ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు మిలటరీ అధికారులు తెలిపారు. ' అల్జీరియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-171 హెలికాప్టర్ అద్రార్ ప్రావిన్స్‌లో కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది' అని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, మరిన్ని కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. అల్జీరియా స్వాతంత్ర్యం పొందిన 1962 నుంచి నేటి వరకు మొత్తం 15 సార్లు ప్లేన్ క్రాష్ ఘటనలు చవిచూసింది. ఈ దేశంలో 2003లో జరిగిన ప్రమాదమే అతి పెద్దది. ఈ ఘటనలో అప్పుడు 97 మంది ప్రాణాలుకోల్పోయారు. -
కూలిన అల్జీరియా విమానం!
116 మంది మృతి చెందినట్లు అనుమానం ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో గల్లంతు అల్జీర్స్: మరో విమానం కుప్పకూలిందా? వారం కిందట మలేసియా విమానం పేల్చివేత, బుధవారం తైవాన్ విమానం కుప్పకూలిన ఘటనలను మరవకుండానే మూడో విమాన దుర్ఘటన చోటుచేసుకుంది! ఆఫ్రికా దేశమైన అల్జీరియాకు చెందిన ఎండీ-83 అనే ఎయిర్ అల్జీరీ విమానం గురువారం మాలి దేశంలోని ఉత్తర ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ గల్లంతైంది. దీంతో ఈ విమానం కూలిపోయి ఉండొచ్చని... అందులోని 116 మంది మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి 1:17 గంటలకు (స్థానిక కాలమానం) అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు బయలుదేరిన 50 నిమిషాల అనంతరం విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలను కోల్పోయిందని అధికారులు చెప్పారు. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు ఎక్కారన్నారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు అల్జీరియా, ఫ్రాన్స్ ప్రభుత్వాలు యుద్ధ విమానాలను రంగంలోకి దించాయన్నారు. మాలి, నైజర్ దేశాల పరిధిలోని ఎడారిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రయాణ మార్గంలో భారీ వర్షం కురుస్తున్నందువల్ల విమాన దిశను మార్చుకునేందుకు అనుమతివ్వాలంటూ నైజర్ దేశంలోని ఏటీసీకి పైలట్ నుంచి చివరి సందేశం అందిందని బుర్కినా ఫాసో ప్రభుత్వం తెలిపింది. ఈ విమానం స్విఫ్ట్ ఎయిర్‌కు చెందిందని స్పెయిన్ పైలట్ల యూనియన్ తెలిపింది. తైవాన్ విమానం బ్లాక్‌బాక్స్‌లు లభ్యం మగాంగ్: తైవాన్‌లో బుధవారం కుప్పకూలిన ట్రాన్స్‌ఏసియా ఎయిర్వేస్ విమానానికి చెందిన బ్లాక్‌బాక్సులను అధికారులు గురువారం కనుగొన్నారు. ఘటనాస్థలి సమీపంలో లభించిన వీటిని స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌బాక్స్‌ల ద్వారా ఈ ప్రమాదానికి కారణం తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాదంలో 48 మంది మృతిచెందడం తెలిసిందే. -
అల్జీరియా ‘ముబారక్’కు మళ్లీ పట్టం
చమురు, వాయు నిక్షేపాల పెన్నిధి అల్జీరియాకు అధ్యక్షునిగా బౌటెఫ్లికా నాలుగోసారి ‘ఎన్నికయ్యారు.’ రెండేళ్లుగా మంచం పట్టినా ఆయన పాలన సాగిపోతోందంటే అది... అల్జీరియా ప్రజాస్వామ్య ప్రహసంలో కీలక పాత్రధారులైన సైనిక నేతలు, అమెరికా, ఈయూల మహిమే. ‘నా తరం చరమాంకానికి చేరింది. దేశానికి మేం చేయగలిగిందేదో చేశాం. ఇక ఈ దేశం మీ చేతుల్లోనే, మీ యువతరం చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి.’ ఇలాంటి మాటలు ఏ దేశాధినేత నోటి నుంచైనా రావడం విన్నారా? 2012లో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెలజీజ్ బౌటెఫ్లికా (77) అన్న మాటలివి. కడుపులో క్యాన్సర్‌ను దాచుకున్న ఆయన రెండేళ్ల నుంచి ఎవరికీ కనిపించలేదు. ఈ నెల 17న ఇలా ఓటేసి, అలా నాలుగో దఫా అధ్యక్షునిగా ఎన్నిక య్యారు. ఎలానైతేనేం పోలైన 51.7 శాతం ఓట్లలో 81.53 శాతం ఓట్ల భారీ ఆధిక్యతను సాధించారు (2009లో అది 90.24 శాతం!). అల్జీరియా ప్రజాస్వామ్య విషాదాంత హాస్య నాటకానికి ఇంతకు మించిన ఉపోద్ఘాతం అనవసరం. ఇక రిగ్గింగు, అక్రమాలను పట్టించుకోనవసరం లేదు. ‘అధికారం’ (లె పొవాయర్) అని పిలిచే అధికార ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ (ఎన్ఎల్ఎఫ్) 2012లో కూడా ఇలాగే పార్లమెంటును అస్మదీయులతో నింపింది. ఆ ఎన్నికలను జాతీయ ఎన్నికల కమిషన్ సైతం విశ్వసనీయత, పారదర్శ కత లేనివిగా ప్రకటించింది. ‘ప్రజాస్వామ్య స్థాపన’ కోసం పక్కనే ఉన్న లిబియాను వల్లకాడుగా మార్చిన అమెరికా, ఈయూల కళ్లకు నాటి ఎన్నికలు ప్రజాస్వామ్యీకరణ దిశగా ‘నిర్ణయాత్మకమైన ముందడుగు’గా కనిపించాయి! 1991లో ‘ఇస్లామిక్ సాల్వేషన్ ఫ్రంట్’కు (ఐఎస్ఎఫ్) భారీ ఆధిక్యతను కట్టబెట్టి ప్రజలు ‘ఘోరమైన తప్పు’ చేశా రని మాజీ వలస యజమాని ఫ్రాన్స్, అమెరికా తీర్పు చెప్పాయి. సైన్యంతో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి, ఐఎస్ఎఫ్ను నిషేధించాయి. అల్జీరియాను ‘ఇస్లామిజం ము ప్పు’ నుంచి కాపాడాయి. అలా రాజేసిన అంతర్యుద్ధంలో (1991-2002) రెండు లక్షల మంది బలైపోయారు. వారి సమాధులపైనే ఒకప్పటి ఈజిప్ట్ నియంత హోస్నీ ముబారక్ తరహా ‘అరబ్బు ప్రజాస్వామ్యం’ పుట్టుకొచ్చింది. ఆ ప్రహస నంలో 1999 నుంచి బౌటెఫ్లికా ఘట్టం నడుస్తోంది. 2008 లోనే ఎన్నిసార్లైనా అధ్యక్ష పీఠాన్ని ఎక్కడానికి వీలు కల్పిం చేలా ఆయన రాజ్యాంగాన్ని సవరించారు. ప్రపంచ మానవ హక్కుల సంస్థ ‘అథారిటేరియనిజం ఇండెక్స్’ ప్రకారం అక్క డున్నది నియంతృత్వమే. పత్రికా స్వేచ్ఛ సూచీపై దానికి లభించిన పాయింట్లు ఘనమైన గుండు సున్న! 1962లో స్వాతంత్య్రం పొందిన అల్జీరియా 1980 లలో వేగంగా వలసవాద ఆర్థిక సంకెళ్లను తెంచుకుని స్వావ లంబన దిశగా సాగింది. ఆఫ్రికాలోనే అత్యంత పారిశ్రామిక దేశంగా ఎదిగింది. అలీనోద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. ఆ స్వతంత్ర ఆర్థిక, రాజకీయ విధానాలు గిట్టకే పాశ్చాత్య దేశాలు వలస కాలపు సైనిక నాయకుల సహాయం తో దేశాన్ని అస్థిరతకు గురిచేశాయి. ప్రపంచ చమురు నిల్వ లలో 17వ స్థానం, సహజవాయు నిల్వలలో 9వ స్థానంలో ఉన్న దేశాన్ని దివాలా తీయించాయి. 1991లో తీసుకున్న ఐఎంఎఫ్ అప్పుకు నాలుగేళ్లలో... అసలుకు ఏడు రెట్ల వడ్డీ లను (9 వేల కోట్ల డాలర్లు) రాబట్టారు. అల్జీరియాను అరబ్బు ప్రపంచంలోని ‘అత్యంత సుస్థిర రాజకీయ వ్య వస్థ‘గా మార్చారు. రెండేళ్లుగా మంచంపై ఉన్నా బౌటెఫ్లికా ‘పాలన’ సాగిందంటే సైన్యం మహిమే. బౌటెఫ్లికాపై పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రభువులకు ఎందుకంత ప్రీతో ‘దిగుమతులు-దిగుమతుల’ ఆర్థిక వ్యవ స్థగా అల్జీరియాకు లభించిన బిరుదును చూస్తే సరిపో తుంది. 2000లో 930 కోట్ల డాలర్లుగా ఉన్న దిగుమతులు 2010 నాటికి 4,725 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇక నేటి ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి జీడీపీలో 5 శాతం. చమురు, సహజ వాయువులు గాక ఇతర రంగాల్లోని ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులలో (ఎఫ్‌డీఐ) మధ్యధరా ప్రాంత దేశాల్లో అట్ట డుగు స్థానం దానిదే. నిరుద్యోగం 30 శాతానికి చేరి ప్రజా సేవలన్నవే లేని అల్జీరియా మరో చమురు సంపన్న దరిద్ర దేశం. ట్యునీషియా, ఈజిప్ట్ నియంతృత్వాలను కూల్చిన అరబ్బు విప్లవ ప్రభావంతో 2011-12 మధ్య దేశంలో ప్రజా స్వామికోద్యమం, ఆందోళనలు పెల్లుబికాయి. చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచే 75 శాతం ప్రభుత్వ రాబడికి ఆధారపడ్డ బౌటెఫ్లికా.. విదేశీమారక నిల్వలతో ఆ అసంతృ ప్తిని చల్లార్చారు. సబ్సిడీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యో గుల వేతనాల పెంపుదల వంటి చిట్కాలు ప్రయోగించారు. చమురు, సహజవాయు క్షేత్రాలను కనిపెట్టిన వారికే వాటిపై 100 శాతం యాజమాన్యం కట్టబెట్టేయడానికి బౌటెఫ్లికా 2005లోనే చట్టాన్ని చేశారు. సైనిక నేతల హితబోధతో 49 శాతం యాజమాన్యంతో సరిపుచ్చారు. బౌటెఫ్లికా చల్లగుం డాలే గానీ ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ రోజులు రాక మానవు. అందుకే అమెరికా, ఈయూల దౌత్యవేత్తలు, బహు ళజాతి కంపెనీలు అల్జీర్స్‌కు తీర్థయాత్ర సాగిస్తున్నారు. పి. గౌతమ్ -
సైనిక విమానం కూలి 103 మంది మృతి
అల్జీర్స్: అల్జీరియా దేశానికి చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలిపోయింది. 103 మంది మరణించినట్టు సమాచారం. తూర్పు ప్రాంతంలోని ఓయుమ్ ఈ బోవాఘీ ప్రావిన్స్‌లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. మిలటరీ అధికారుల కుటుంబ సభ్యులను తీసుకెళ్తుండగా విమానం ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న 103 మంది మరణించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. దట్టమైన మంచు, అననుకూల వాతావరణం ప్రమాదానికి కారమని భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి వైద్య సహాయ బృందాలు చేరుకున్నాయి. -
New Director General of CRPF ?
GENERAL AWARENESS 1. Ibrahim Boubacar Keita was elected the President of which of the following African coun tries in August 2013? (He will take office on September 19, 2013) 1) Algeria 2) Niger 3) Burkina Faso 4) Mali 5) Senegal 2. Who won the 200-metre sprint at the World Athletics Cham pionships in Moscow on Au gust 17, 2013? 1) Warren Weir 2) Usain Bolt 3) Curtis Mitchell 4) Tyson Gay 5) Yohan Blake 3. The 15,000th branch of which of the following banks was inau gurated in Sooranam, Tamil Nadu on August 17, 2013? 1) Punjab National Bank 2) ICICI Bank 3) State Bank of India 4) Indian Bank 5) Indian Overseas Bank 4. Who was appointed the Dire ctor General of Central Reser ve Police Force (CRPF) on Au gust 17, 2013? (He succee ded Pranay Sahay) 1) R.K.Singh 2) Alok Joshi 3) Ranjit Sinha 4) Dilip Trivedi 5) Vijay Kumar 5. Who among the following Arjuna award winners is a Squash player? 1) P.V. Sindhu 2) Kavita Chahal 3) Rupesh Shah 4) Dharmendra Dalal 5) Joshna Chinappa 6. Subramanian Swamy's Janata Party was merged with which of the following political parties in August 2013? 1) Congress 2) Janata Dal (Secular) 3) Bharatiya Janata Party 4) Janata Dal (United) 5) Samajwadi Party 7. What does NDTL mean? 1) New Demand and Tenure Lia bilities 2) Net Demand and Time Liabi lities 3) National Deposits and Total Liquidity 4) New Deposits and Term Liquidity 5) None of these 8. Which of the following terms is used in Banking? 1) Epicenter 2) Gravity 3) Latitude 4) Longitude 5) None of these 9. Fiscal Policy is concerned with? 1) Export and Import 2) Education 3) Population control 4) Public revenue and expenditure 5) None of these 10. Foreign exchange reserves of India are kept in the custody of? 1) IBRD 2) IMF 3) SBI 4) Government treasury 5) RBI 11. Which of the following terms is not used in Banking? 1) Holding company 2) Post dated cheque 3) Credit 4) Time deposit 5) Centripetal force 12. The Score of My Life' is written by? 1) Pandit Ravi Shankar 2) Zubin Mehta 3) Javed Akhtar 4) APJ Abdul Kalam 5) None of these 13. Anshu Jain is associated with which of the following foreign banks? 1) RBS 2) Deutsche Bank 3) HSBC 4) Barclays 5) Bank of America 14. The National Science Day is celebrated in honour of? 1) J.C.Bose 2) S.Ramanujan 3) H.J.Bhabha 4) C.V.Raman 5) S. Chandrasekhar 15. Which of the following is not a cash crop? 1) Jute 2) Cashew nut 3) Rubber 4) Cotton 5) Wheat 16. Which of the following books is not written by Indira Goswami? 1) The Man from Chinnamasta 2) Pages Stained with Blood 3) The Moth Eaten Howdah of a Tusker 4) An Unfinished Autobiography 5) Rudali 17. Harare is the capital of? 1) Zambia 2) Yemen 3) Congo 4) South Sudan 5) Zimbabwe 18. Galvanometer is an instrument to measure? 1) Relative density of liquids 2) Electric currents 3) Pressure of gases 4) Distances 5) None of these 19. In a current account the with drawals can be made? 1) Once a day 2) Once a week 3) Once a month 4) As many times as needed 5) None of these 20. A short term government secu rity paper is called? 1) Share 2) Debenture 3) Mutual Fund 4) Treasury bill 5) None of these 21. WTO basically promotes? 1) Tourism 2) Global peace 3) Unilateral trade 4) Multilateral trade 5) Disarmament 22. CDS stands for? 1) Credit Demand Swap 2) Collateral Default Swap 3) Credit Default Swap 4) Collateral Demand Swap 5) None of these 23. The headquarters of International Olympic Committee is at? 1) Los Angeles 2) New York 3) Moscow 4) Lausanne 5) Paris 24. Which of the following terms is used in the game of Hockey? 1) Volley 2) Bull'seye 3) Trump 4) Serve 5) Centre forward 25. Which of the following is not a pharmaceutical company? 1) Intas 2) Novartis 3) Roche 4) Hindustan Unilever Limited 5) Glaxo SmithKline 26. Which of the following commi ssions is formed to guard agai nst predatory and collusive behavior of the business organi zations? 1) Knowledge Commission 2) Finance Commission 3) Administrative Reforms Commission 4) Competition Commission 5) Labour Commission 27. Two Leaves is the symbol of which of the following political parties? 1) SP 2) BSP 3) DMK 4) AIADMK 5) JD (U) 28. When too much of money is chasing too few goods, the situ ation is called? 1) Recession 2) Depression 3) Inflation 4) Deflation 5) Stagflation 29. Which of the following sche mes provides social security cover to the people working in the unorganized sector? 1) Raj Lakshmi 2) Kuteer Jyothi 3) Swavalamban 4) Antyodaya 5) None of these 30. Who is the Chairman of Institute of Banking Personnel Selection (IBPS)? 1) Pratip Chaudhuri 2) Arun Kaul 3) T.M. Bhasin 4) K.R. Kamath 5) M.Narendra 31. Which of the following abbre viations and their full forms is not matched correctly? 1) LAF ---Liquidity Adjustment Facility 2) SWIFT --- Society for World wide Interbank Financial Tele communication 3) AFSPA---Armed Forces Super Powers Act 4) MDG---Millennium Develo pment Goals 5) MAT--Minimum Alternate Tax 32. The foreign trade policy in India is announced by the? 1) RBI 2) Ministry of Finance 3) Ministry of Commerce 4) Planning Commission 5) Ministry of External Affairs 33. Who is the author of the book 'Building Social Business'? 1) Amartya Sen 2) Muhammad Yunus 3) Paul Krugman 4) Alvin Roth 5) None of these 34. Which of the following agen cies/organizations plays a major role to control inflation in a country? 1) Central Bank of the country 2) Stock markets of the country 3) Planning Commission 4) Both 1 and 2 5) All 1, 2 and 3 35. NPAs in commercial banks means? 1) Bank deposits which are not invested 2) Capital assets not in use 3) Loans in which interest or principal amount is not recovered 4) Low interest rate loans 5) High interest rate loans KEY 1) 4 2) 2 3) 3 4) 4 5) 5 6) 3 7) 2 8) 5 9) 4 10) 5 11) 5 12) 2 13) 2 14) 4 15) 5 16) 5 17) 5 18) 2 19) 4 20) 4 21) 4 22) 3 23) 4 24) 5 25) 4 26) 4 27) 4 28) 3 29) 3 30) 4 31) 3 32) 3 33) 2 34) 1 35) 3