ఒలింపిక్స్‌లో జెండర్‌ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి! | Boxer Imane Khelif Gender Row At Olympics 2024, Singer Chinmayi Sripaada Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Gender Row At Paris Olympics 2024: ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!

Published Fri, Aug 2 2024 4:35 PM | Last Updated on Fri, Aug 2 2024 6:05 PM

Boxer Imane Khelif gender row at Olympics chinmayi sripaada tweet goes viral

ప్యారిస్ ఒలింపిక్స్ మ‌హిళ‌ల బాక్సింగ్  ఈవెంట్లో జెండర్‌ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్స‌ర్ ఇమేని ఖాలిఫ్‌ (Imane Khalif)తో జ‌రిగిన  పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్‌ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్‌,  ఇట‌లీ బాక్స‌ర్ ఏంజిలా కారిని బౌట్‌ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని  ఖాలీఫ్‌కు మద్దతు పలికారు.  ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌  పెట్టారు.

ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య  అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్  పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్‌రాజన్‌ను ఇండియాలో  వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా  ఇమానే చిన్నప్పటి ఫోటోను  పోస్ట్‌ చేశారు.

కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కేవ‌లం 46 సెక‌న్ల‌ స్వ‌ల్ప వ్య‌వ‌ధ‌లోనే ఆ మ్యాచ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కారిని ప్ర‌క‌టించింది. త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు త‌ప్ప‌ద‌ంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే.  అటు అల్జీరియా ఒలింపిక్ క‌మిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది.

 గ‌తంలోనూ అల్జీరియా బాక్స‌ర్ ఇమేని ఖాలిఫ్‌పై లింగ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 2023 చాంపియ‌న్‌షిప్ నుంచి డిస్‌క్వాలిఫై అయ్యింది. జెండ‌ర్ ఇష్యూ వ‌ల్లే ఆమెను ఆ క్రీడ‌ల నుంచి త‌ప్పుకోవాల్సి వచ్చింది.   ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్‌వై క్రోమోజోమ్‌లు ఉన్న‌ట్లు తేలినంద‌ని ఐబీఏ అధ్య‌క్షుడు ఉమ‌ర్ క్ర‌మ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో  అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్‌పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉంద‌ని, అందుకే ఆమె మ‌హిళ‌ల క్యాట‌గిరీలోని 66 కేజీల విభాగంలో  అనుమతినిన్చినట్టు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్ర‌తినిధి మార్క్ ఆడ‌మ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మ‌హిళా బాక్స‌ర్లు మండిపడుతున్నారు.  మరోవైపు  కొన్ని దేశాలు తాను మెడ‌ల్ గెల‌వ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement