1000 లైక్స్ కొట్టండి.. లేదంటే కింద పడేస్తా | Man jailed for dangling baby from window in Algeria | Sakshi
Sakshi News home page

1000 లైక్స్ కొట్టండి.. లేదంటే కింద పడేస్తా

Published Tue, Jun 20 2017 7:35 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

1000 లైక్స్ కొట్టండి.. లేదంటే కింద పడేస్తా - Sakshi

1000 లైక్స్ కొట్టండి.. లేదంటే కింద పడేస్తా

ఫేస్ బుక్ లో లైక్స్ కోసం ఎంత వికృత చేష్టలకైనా పాల్పడుతున్నారు కొందరు.  ఓ తండ్రైతే ఏకంగా తను జన్మనిచ్చిన బాబునే ఈ లైక్స్ కోసం ప్రమాదంలోకి నెట్టేయాలని చూశాడు. చివరకు తానే వెళ్లి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అల్జెరియాలో ఓ తండ్రి తన బాబును 15వ ప్లోర్ విండ్ నుంచి కిందకి పడేయబోతున్నట్టు ఫోటో తీశాడు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆ పోస్టుకు 1000 లైక్స్ ఇవ్వాలని, లేదంటే అలానే ఆ బేబిని కిందకి పడేస్తానంటూ దారుణమైన క్యాప్షన్ పెట్టాడు.
 
ఫేస్ బుక్ లో ఈ పోస్టు పెట్టిన వెంటనే అతనిపై నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. ఆదివారం పోలీసులు అతన్ని అరెస్టు చేసి, అల్జెరియా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు వెంటనే అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఏఐ అరేబియా న్యూస్ సైట్ రిపోర్టుచేసింది.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement