హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఎఫ్‌బీ ఖాతాలోని ఫొటో
సాక్షి, ముంబై: కొన్నేళ్ల కిందట వచ్చిన '3 ఇడియట్స్' మూవీ చూసి కాలేజీలు, స్కూళ్లల్లో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు కదా. కానీ అలాంటివేం జరడగం లేదని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు ఆ విద్యార్థి పోస్ట్ చేసిన పోస్టును ఒక్కసారైన చదవాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన '3 ఇడియట్స్' మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై దక్షిణాదిలో దర్శకుడు శంకర్ స్నేహితుడు పేరుతో తీయగా విద్యార్థులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
కొన్ని సినిమాల ప్రభావం అనంతరం విద్యావ్యవస్థలో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. చదివే చదువు వేరు, చేయాలనుకున్న ఉద్యోగం, స్థిరపడాలనుకున్న రంగం వేరుగా ఉంటున్నాయని హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ పేజీలో ఓ విద్యార్థి పోస్ట్ చేశాడు. ఒకవేళ నేను సింగర్, నటుడు, డ్యాన్సర్, లేక డైరెక్టర్ అవ్వాలనుకుంటే చదువుకున్న పైథాగారస్ సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడతాయని ప్రశ్నించాడు. ప్రస్తుతం ముంబై నెటిజన్లకు అది ఓ హాట్ టాపిక్‌గా మారింది.
నవ్వుకునేందుకు కామిక్ పుస్తకాలు చదువుతుంటాం. అయితే కామిక్ పుస్తకాలు చదివిన వారికి పరీక్షలు పెడతామని చెప్పండి. ఒక్కరూ కూడా కామిక్ బుక్స్ వైపు కన్నెతి చూడరు. బాగా వేడిగా ఉన్న ప్రెషర్ కుక్కర్ లో పడ్డట్లు విద్యార్థుల పరిస్థితి తయారవుతుంది. అమ్మానాన్నలు మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి. మీరు అనుకున్న దాని కంటే గొప్పగా ఎదిగి మీరు గర్వపడేలా చేస్తామంటూ సందేశం ఇచ్చాడు. మరో గంటలో నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉందని, వెళ్తున్నానంటూ విద్యార్థి తన పోస్ట్‌ను ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment